వేసవి సెలవులు ముగించుకొని ఈనెల 12వ తేదీ నుంచి బడులు ప్రారంభం కాబోతున్నాయి.
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవులు ముగించుకొని ఈనెల 12వ తేదీ నుంచి బడులు ప్రారంభం కాబోతున్నాయి. క్షేత్ర స్థాయిలో ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా డైరెక్టర్ ఆదేశించారు. అలాగే ఈనెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బడిబాట నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ మేరకు అకాడమిక్ క్యాలెండర్‌ను కూడా ఖరారు చేసినట్లు తెలిసింది. బడిబాటలో ప్రధానంగా బడిబయట ఉన్న పిల్లలను స్కూళ్లలో చేర్పించాలని విద్యాశాఖ సూచించింది. ఐదో తరగతి, ఏడో తరగతి, 8వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు పైతరగతుల్లో చేరేలా అవసరమైన అన్ని చర్యలు ప్రధానోపాధ్యాయులు చేపట్టాలని పేర్కొంది. ఇంగ్లిషు మీడియం విషయంలో జిల్లాల్లో కలెక్టర్లు అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. బడిబాట పర్యవేక్షణకు డైరెక్టరేట్ నుంచి సీనియర్ అధికారులను వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జిలుగా నియమించారు.