ప్రశాంతంగా పాలీసెట్ పరీక్ష
– వచ్చే నెల10వ తేదీన ఫలితాలు
– 7 వేల మంది విద్యార్థులకుగాను 6716 మంది హాజరు
కర్నూలు సిటీ: పాలీసెట్–2017 ప్రవేశ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. కర్నూలు నగరం, నంద్యాల, శ్రీశైలంలలో ఏర్పాటు చేసిన 21 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. నగరంలోని ఏర్పాటు చేసిన 12 కేంద్రాల్లో 4444 మంది విద్యార్థులకు గాను,4253 మంది, నంద్యాలలోని 8 కేంద్రాల్లో 2399 మందికిగాను, 2320 మంది, శ్రీశైలంలో ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలో 157 మందికికాను, 143 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పాలీసెట్–2017 ఫలితాలను వచ్చే నెల10 తేదీన విడుదల చేయనున్నారు. పలు కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు తనిఖీ చేశాయి.