
సాక్షి, హైదరాబాద్/ కేయూ క్యాంపస్ (వరంగల్): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి కాకతీయ యూని వర్సిటీ రెండ్రోజుల పాటు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఐసెట్)కు 90.56% హాజరైనట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి తెలి పారు. తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లో 4 కేంద్రాల్లో 27, 28 తేదీల్లో ఐసెట్ జరిగింది.
మొత్తం 75,952 మంది ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోగా వీరిలో 68,781 (90.56%) హాజర య్యారని, 7171 (9.44 శాతం) గైర్హాజరైనట్లు అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలి పారు. ఐసెట్ ప్రాథమిక కీ ఆగస్టు 4న విడు దల చేస్తారని, అభ్యంతరాలు 8వ తేదీ వరకు స్వీకరిస్తారని ఆయన వెల్లడించారు. ఫైనల్ కీ, ఫలితాలు ఆగస్టు 22న విడుదల చేస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment