కన్నీరే మిగిలింది... | Tears left ... | Sakshi
Sakshi News home page

కన్నీరే మిగిలింది...

Published Sat, Mar 14 2015 2:49 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

Tears left ...

 కారణం ఏంటో తెలీదు..ఓ తల్లి పిల్లల కళ్లెదుటే కాలిపోయింది..‘అమ్మ’ ఎందుకు కాలిపోతోందో తెలీదు...అమ్మను పట్టుకుంటే తాము కాలిపోతామనే సంగతీ అసలే తెలీదు... అల్లారుముద్దుగా పెంచిన ‘అమ్మ’ అగ్నికి ఆహుతి అవుతుండటంతో ఇద్దరు పిల్లలు అమ్మను కౌగిలించుకున్నారు. వారూ మంటల్లో చిక్కుకున్నారు. ఆర్తనాదాలు చేయడం మినహా చావు నుంచి బయటపడలేకపోయారు. అందరూ అగ్నికి ఆహుతయ్యారు. మనస్పర్థలతో భార్యను పుట్టింటికి పంపిన భర్త, శాశ్వతంగా భార్యతో పాటు ఇద్దరు పిల్లలను కోల్పోయాడు. కదిరిలో జరిగిన ఈ సంఘటన అందరినీ కన్నీరు పెట్టించింది. కారణం ఏదైనా... కారకులెవరైనా :  బంగారులాంటి పిల్లలను అల్లారుముద్దగా పెంచాల్సిన తల్లి ఆత్మహత్య చేసుకునేందుకు కారకులెవరైనా బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు.. తల్లితో కలిసి కానరాని లోకాలకు వెళ్లారు.
 
 గోరంట్ల : ఎస్‌ఏపీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ నియామాకంపై కళాశాల యాజమాన్యంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదంలో కళాశాల కరస్పాండెంట్ కెంపుల లక్ష్మన్న ఇంటి వద్ద కిరోసిన్ పోసి నిప్పటించారని హిందూపురం పార్లమెంటు సభ్యులు నిమ్మల కిష్టప్ప సోదరుడు కుమారుడు, ఎంపీటీసీ సభ్యుడు నిమ్మల యువశేఖర్, కళాశాల సివిక్స్ లెక్చరర్ శ్రీనాథ్ మరికొంత మందిపై కళాశాల కరస్పాండెంట్ లక్ష్మన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఇందుకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాల మేరకు ....కళాశాలలో ప్రిన్సిపాల్ నియామకంపై నెలకొన్న వివాదంలో కరస్పాండెంట్‌పై కక్ష్య కట్టిన పైన  పేర్కొన్న నిందితులు గురువారం సాయంత్రం లక్ష్మన్న ఇంటి వద్దకు వెళ్లి ఘర్షణ పడేందుకు గాను గలాట చేశారు. ఆ సమయంలో లక్ష్మన్న తమ్ముడు శ్రీనివాసులు రాకను గమనించిన వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. శ్రీనివాసులు కొంత సేపు ఉండి వెళ్లిపోయారు. ఆ తర్వాత  రాత్రి 10.45 ప్రాంతంలో ఇంటి వద్ద గ్రిల్స్‌లో నుంచి కిరోసిన్ పోసి నిప్పంటించారు. నవారు మంచం నుంచి మంటలు వ్యాపిస్తుండటంతో లక్ష్మన్న బయటకు వచ్చి చూశారు. బయట వాహనాల్లో నిమ్మల యువశేఖర్, శ్రీనాథ్ తన అనుచరులు మహేష్, నరేష్ తదితరులు లక్ష్మన్నను దూషిస్తూ ఇంటిని కిరోసిన్ పోసి తగల బెట్టండి... ఎవరు అడ్డు వస్తారో చూద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంటలు తీవ్రం కాకుండా లక్ష్మన్న కుటుంబసభ్యులు ఆర్పివేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు.
 
 అయితే ఈ ఘటనకు కారణం ప్రిన్సిపాల్ నియామకంలో నెలకొన్న వివాదమే. నిమ్మల యువశేఖర్ గత నెల 11, 19 తేదీల్లో గొడవలు పడి దౌర్జన్యంతో ప్రిన్సిపాల్‌గా శ్రీనాథ్‌ను నియమించారు. దీంతో ఆ నియామకం చెల్లదని  కోర్టు ద్వారా  స్టే తేవడంతో శ్రీనాథ్‌ను  తప్పించి, నిబంధనల మేరకు డాక్టర్ సూర్యనారాయణను నియమించారు. నిందితుల నుంచి నాకు, కళాశాలలో పని చేస్తున్న లెక్చరర్లకు ప్రాణహాని ఉందని కళాశాల కరస్పాండెంట్ లక్ష్మన్న పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
 
 ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేస్తాం : ఎంపీటీసీ సభ్యుడు నిమ్మల యువశేఖర్, సివిక్స్ లెక్చరర్ శ్రీనాథ్, మహేష్, నరేష్‌తో పాటు మరి కొంత మందిపై ఎస్‌పీఎస్ కళాశాల కరస్పాండెంట్  కెంపుల లక్ష్మన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement