అట్లాంటా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 20 వ నెల నెలా తెలుగు వెలుగు సాహిత్య కార్యక్రమం వర్చువల్‌గా జరిగింది. ఈ సందర్భంగా శ్రీనాథుడి సాహిత్యంలోని గొప్పతనం, ఆయన జీవితంలోని విశేషాలపై వక్తలు ప్రసంగించారు. ఎంతో విలువైన వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య సంపదను భావితరానికి భద్రంగా అందించే కృషిలో తానా ఎల్లప్పుడూ ముందుంటుందని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రాచీన సాహిత్యంపై సదస్సు నిర్వహించడం మంచి విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో న్యూ జెర్సీ రాష్ట్ర యుటిలిటీస్ బోర్డు కమీషనర్ ఉపేంద్ర చివుకుల, కెనడా దేశంలోని అల్బర్టా రాష్ట్ర మౌలిక వసతుల శాఖామంత్రిగా కీలక భాద్యతలు నిర్వహిస్తున్న ప్రసాద్ పండాలు పాల్గొన్నారు. శ్రీనాథుడి రచనల విశిష్టతలను పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ వివరించారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక తరపున నిర్వాహకులు తోటకూర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment