న్యూఢిల్లీ: ఇతర కూలీల మాదిరిగానే తానూ మూటలు మోస్తాడు. చెవిలో ఉన్న ఇయర్ ఫోన్లను చూసి అతను పాటలు వింటున్నాడని అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న అతను స్టడీ మెటీరియల్‌ను వింటుంటాడు. అందుకోసం రైల్వే స్టేషన్‌లో అందుబాటులో ఉన్న ఉచిత వైఫై సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు.
కేరళలోని ఎర్నాకులం రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేస్తున్న కె.శ్రీనాథ్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా. సహచర కూలీలకు భిన్నంగా శ్రీనాథ్ ఓ వైపు లగేజీని బ్యాలెన్స్ చేస్తూనే మొబైల్ ఫోన్ లో పాఠాలను నేర్చుకుంటున్నాడు. అంటే పని చేస్తూనే నేర్చుకుంటున్నాడన్న మాట. 20 – 40 ఎంబీపీఎస్ స్పీడు కలిగిన ఉచిత వైఫై సాయంతో తాను మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు, ఆన్‌లైన్ పరీక్షలూ రాస్తూ ఉంటా నని చెబుతున్నాడు. హైస్కూల్ వరకే చదివిన శ్రీనాథ్ ఇప్పటికే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఓ రాత పరీక్షలో అర్హత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment