కొత్త హ్యాండ్‌బ్యాగేజ్ రూల్స్: విమానాల్లో.. | New Flight Luggage Rules Full Details | Sakshi
Sakshi News home page

కొత్త హ్యాండ్‌బ్యాగేజ్ రూల్స్: విమానాల్లో..

Dec 26 2024 3:49 PM | Updated on Dec 26 2024 3:59 PM

New Flight Luggage Rules Full Details

విమానంలో ప్రయాణించే.. ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ తరుణంలో వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, భద్రతను మెరుగుపరచడానికి 'బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ' (BCAS), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కొత్త హ్యాండ్‌బ్యాగేజ్ రూల్స్ పెట్టాయి.

బీసీఏఎస్ రూల్స్ ప్రకారం.. ప్రయాణికులు ఇప్పుడు కేవలం ఒక హ్యాండ్‌బ్యాగ్ (Handbag) మాత్రమే తీసుకెళ్లడానికి అర్హులు. ఈ విధానం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ అమలు కానుంది. ఎయిర్‌పోర్టులలో పెరిగిపోతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కొత్త నిబంధనల ప్రకారం.. ప్రయాణికుల వెంట ఇకపై ఒక హ్యాండ్‌బ్యాగ్ మాత్రమే ఉండాలి. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ తరగతుల్లో ప్రయాణించే వారు గరిష్టంగా 7 కేజీల బరువున్న హ్యాండ్‌బ్యాగ్.. ఫస్ట్ క్లాస్‌ లేదా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వారి హ్యాండ్‌బ్యాగ్ బరువు 10 కేజీల వరకు ఉండొచ్చు. అంతే కంటే ఎక్కువ లగేజ్ ఉంటే.. చెక్ ఇన్ కావాల్సిందే.

హ్యాండ్‌బ్యాగ్ కొలతలు
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కేవలం హ్యాండ్‌బ్యాగ్ బరువును మాత్రమే కాకుండా.. కొలతలను కూడా నిర్ణయించింది. కాబట్టి బ్యాగ్ పొడవు 40 సెంమీ, వెడల్పు 20 సెంమీ, ఎత్తు 55 సెంమీ మించకూడదు.

కొత్త హ్యాండ్‌బ్యాగేజ్ రూల్స్ 2024 మే2 నుంచి అమలులోకి వస్తాయి. కాబట్టి అంతకంటే ముందే టికెట్ బుక్ చేసుకున్న వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి.

కొత్త నిబంధనలకు అనుగుణంగా, ఇండిగో & ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలు కూడా తమ బ్యాగేజీ విధానాన్ని సవరించాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లోని ప్రయాణికులు ఒక క్యాబిన్ బ్యాగ్‌ని తీసుకురావచ్చు. దాని పొడవు 115 సెం.మీ మించకూడదు.. అది 7 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండకూడదు. అదనంగా.. ప్రయాణీకులు పర్స్, కాంపాక్ట్ ల్యాప్‌టాప్ బ్యాగ్ లేదా అలాంటి ఏదో ఒక వ్యక్తిగత వస్తువును 3 కిలోల బరువు వరకు తీసుకురావచ్చు. ఇండిగో ప్రయాణికులు కూడా ఒక క్యాబిన్ బ్యాగ్, ఒక వ్యక్తిగత వస్తువును తీసుకెళ్లడానికి అర్హులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement