
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ 'ఫాస్ట్‌ట్యాగ్' (FASTag)లో రెండు కొత్త మార్పులను జారీ చేశాయి. టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడం, వివాదాలను తగ్గించడం లక్ష్యంగా లావాదేవీలు ఈ రూల్స్ ప్రవేశపెట్టారు. కొత్త నియమాలు ఈ రోజు (ఫిబ్రవరి 17) నుంచి అమలులోకి వస్తాయి.
తక్కువ బ్యాలెన్స్, చెల్లింపులలో ఆలస్యం లేదా బ్లాక్‌లిస్ట్ ఫాస్ట్‌ట్యాగ్‌లు కలిగిన వాహనదారులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానాలు చెల్లించకుండా.. ఉండాలంటే, ఫాస్ట్‌ట్యాగ్‌లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. అవి బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నాయా.. లేదా.. అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి.
ఫాస్ట్‌ట్యాగ్‌లో తగిన బ్యాలెన్స్ లేకపోతే.. అది బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తుంది. టోల్‌ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి ఒక గంట లేదా 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్ట్‌ట్యాగ్ ఇన్‌యాక్టివ్‌లోనే ఉంటే కోడ్ 176 ఎర్రర్‌ను చూపి లావాదేవీలు క్యాన్సిల్ అవుతాయి. అంతే కాకుండా మీరు స్కాన్ చేసిన 10 నిమిషాల తరువాత ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లినా.. మళ్ళీ లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. ఇలా లావాదేవీలు క్యాన్సిల్ అయినప్పుడు.. వాహనదారుడు ఫెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: జీతాల పెంపుపై టీసీఎస్ ప్రకటన: ఈ సారి ఎంతంటే..
ఇక బ్లాక్‌లిస్ట్ నుంచి బయటపడాలంటే, తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దూర ప్రయాణాలు ప్రారంభించే ముందు ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. టోల్ ప్లాజాలను చేరుకునే ముందు FASTag బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి.
ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. గత సంవత్సరం నవంబర్‌లో రూ.6,070 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు జరిగాయి. డిసెంబర్ నాటికి లావాదేవీలు రూ.6,642 కోట్లకు చేరింది. ఈ సంఖ్య ఈ ఏడాది మళ్ళీ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment