![New FASTag Rules Kick In On February 17th Heres All You Should Know Key Changes And Penalties](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/fastag.jpg.webp?itok=J_KIcZU-)
టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో 'నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. FASTag బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించి ముఖ్యమైన మార్పులతో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వస్తాయి.
కొత్త మార్పులు టోల్ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి మాత్రమే కాకుండా.. మోసపూరిత కార్యకలాపాలను తగ్గించడానికి రూపొందించారు. కొత్త నియమాలను పాటించడం వల్ల వాహన వినియోగదారుడు జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. టోల్‌ల ద్వారా సజావుగా ముందుకు సాగిపోవచ్చు.
ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనలలో మార్పులు
60 నిమిషాల విండో: టోల్ ప్లాజాకు చేరుకోవడానికి ముందు ఫాస్ట్‌ట్యాగ్ 60 నిమిషాల కంటే ఎక్కువ కాలం ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే.. అది తెలుసుకున్న తరువాత 10 నిమిషాల పాటు బ్లాక్‌లిస్ట్‌లోనే కొనసాగితే.. లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి.
డబుల్ ఫెనాల్టీ: టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉండి.. లావాదేవీ రిజెక్ట్ అయితే.. మీరు చెల్లించాల్సిన టోల్ ఛార్జ్ కంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.
గ్రేస్ పీరియడ్: డబుల్ పెనాల్టీని నివారించడానికి వినియోగదారులు ట్యాగ్ చదివిన 10 నిమిషాలలోపు వారి FASTagని రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఉదాహరణలకు మీరు టోల్ చేరుకోవడానికి ముందే మీ ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ అయితే.. దానిని తెలుసుకున్న తరువాత కూడా టోల్ గుండా వెళ్తే.. లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. అప్పుడు డబుల్ టోల్ ఛార్జ్ చెల్లించాలి. అలా కాకుండా.. మీ ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో చేరడానికి 60 నిమిషాల ముందు లేదా స్కాన్ చేసిన 10 నిమిషాలలోపు (మొత్తం 70 నిమిషాల్లో) మీరు దానిని రీఛార్జ్ చేస్తే లావాదేవీలు సక్సెస్ అవుతాయి. ఎలాంటి జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదు.
టోల్ ప్లాజాలో ఎక్కువ టోల్ ఫీజు చెల్లించకుండా తప్పించుకోవాలంటే.. టోల్ ప్లాజాలను చేరుకునే ముందు మీ ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ తగినంత ఉండేలా చూసుకోవాలి. బ్లాక్‌లిస్టింగ్ వంటివి నివారించుకోవడానికి కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.
హైవేపై అన్‌లిమిటెడ్ టోల్ పాస్‌లు
వాహనదారులకు ఉపశమనం కలిగించడానికి.. టోల్ వసూల్లలో సరళీకరణను సాధించడానికి కేంద్రం టోల్ పాస్‌ల జారీలో కొత్త విధానం తీసుకురానుంది. ఇందులో వార్షిక టోల్ పాస్‌లు, లైఫ్ టైం టోల్ పాస్‌లు జారీ చేయడానికి సంకల్పించింది.
వార్షిక ప్లాన్ కింద ఏడాది 3000 రూపాయలు, లైఫ్ టైం టోల్ పాస్ (15 సంవత్సరాలు) కోసం రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుందని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 340 రూపాయలకు నెలవారీ టోల్ పాస్ అందుబాటులో ఉంది. ఈ లెక్కన తీసుకుంటే ఏడాదికి రూ. 4080 చెల్లించాలి. కానీ ఏడాదికి టోల్ పాస్ తీసుకుంటే.. 1080 రూపాయలు ఆదా చేయవచ్చు.
ఇదీ చదవండి: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు: ఇక కొనుగోలు కష్టమే!
వార్షిక, లైఫ్ టైం పాస్‌లు ప్రస్తుత FASTag వ్యవస్థలో చేర్చనున్నారు. కాబట్టి దీనికోసం ప్రత్యేకించి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఈ టోల్ పాస్ వ్యవస్థను త్వరలోనే తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వార్షిక టోల్ పాస్ లేదా జీవిత కాల టోల్ పాస్ అనేది ఒక టోల్ గేటుకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని చోట్లా పనిచేస్తుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment