handbag
-
రైలులో మర్చిపోయిన హ్యాండ్ బ్యాగ్ అప్పగింత
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):రైలు ప్రయాణంలో రూ. 40వేలు నగదుతో పాటుగా రూ. 6.5 లక్షల బంగారు ఆభరణాలు ఉన్న మహిళ హ్యాండ్ బ్యాగును విధుల్లో ఉన్న టీటీఐ గుర్తించి విచారణ అనంతరం బాధితులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. విజయవాడ డివిజన్‌కు చెందిన టీటీఐ జి.లక్ష్మయ్య ఈ నెల 18న ఎల్టీటీ–విశాఖపట్నం రైలులో ఎస్–1, బీ–4,5,6 కోచ్‌లలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉదయం 5.10 గంటలకు రైలు భీమవరం టౌన్ దాటిన తరువాత బీ6 కోచ్‌లో బెర్త్‌లు తనిఖీలు చేస్తుండగా బెర్త్ నంబర్ 26 పక్కన డైనింగ్ టేబుల్‌పై మహిళ హ్యాండ్ బ్యాగు ఉండటాన్ని గుర్తించారు. దీనిపై తోటి ప్రయాణికులను విచారించగా భీమవరంలో స్టేషన్లో దిగిన కుటుంబానిదిగా తెలిపారు. దీంతో విషయాన్ని ఆయన విజయవాడ కమర్షియల్ కంట్రోలర్‌కు సమాచారం అందించారు. బ్యాగులోని ఫోన్ రింగ్ అవుతుండటంతో తోటి ప్రయాణికుల సమక్షంలో మాట్లాడగా హ్యాండ్ బ్యాగు ట్రైన్లో మర్చిపోయినట్లు బాధితురాలు తెలిపింది. కోచ్‌లోని ప్రయాణికుల సమక్షంలో బ్యాగులో ఏముందో నిర్ధారించాల్సిందిగా తెలపడంతో అందులో రూ. 40 వేల నగదు, రూ. 6.50 లక్షల విలువైన 120 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు చెప్పడంతో అవి సరిగా ఉండటంతో బ్యాగు బాధితురాలిదేనని నిర్ధారించారు. ఆమె అభ్యర్ధన మేరకు రాజమండ్రిలో తన సోదరుడికి అప్పగించాలని టీటీఐని కోరటంతో విషయం రాజమండ్రి కమర్షియల్ కంట్రోలర్‌కు, స్టేషన్ ఆఫీసర్‌కు, జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైలు రాజమండ్రిలో ఆగిన తరువాత జీఆర్పీ పోలీసులు బాధితురాలి సోదరుడి నుంచి వివరాలు సేకరించి బ్యాగును అందజేశారు. విధుల్లో చిత్తశుద్ది, అంకితభావంతో వ్యవహరించి రైలు ప్రయాణికురాలి నష్టాన్ని నివారించిన టీటీఐ లక్ష్మయ్యను డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు ప్రత్యేకంగా అభినందించారు. -
ఆలియాకు రణ్‌బీర్ ఖరీదైన గిఫ్ట్.. స్పెషల్ ఏంటో తెలుసా?
బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంట ఒకటి. గతేడాది వివాహాబంధంతో ఒక్కటైన ఈ జంటకు నవంబర్‌లో పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తమ ముద్దురు కూతురుకు రాహా అని నామకరణం కూడా చేశారు. ఏప్రిల్ 14, 2022న సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితమే మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. మొదటి వివాహా వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి ఆలియా భట్‌కు రణ్‌బీర్ కపూర్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. దాదాపు రూ.10 లక్షల విలువ చేసే హ్యాండ్‌బ్యాగ్ ఇచ్చి భార్యపై ప్రేమను చాటుకున్నాడు. కాగా.. బాలీవుడ్ జంట బాంద్రాలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. తమ కలల ఇంటి పనులను పర్యవేక్షించేందుకు రాగా.. ఆలియా, రణ్‌బీర్ కెమెరాలకు చిక్కారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా బ్యూటీఫుల్ కపుల్స్ అరుదైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సింపుల్‌గా చోరీ.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: అర్ధరాత్రి కుటుంబీకులంతా నిద్రిస్తున్న సమయంలో ఇంటి కిటికీలోంచి కర్రతో హ్యాండ్ బ్యాగ్‌ను తస్కరించి అందులో ఉన్న రూ.15 వేల నగదును కాజేసి ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాలు.. మియాపూర్ జేపీఎన్ నగర్‌లోని ప్లాట్ నంబర్ 242లో రవి అనే ఫొటోగ్రాఫర్ అద్దెకు ఉంటున్నాడు. (చదవండి: 20 రోజులు.. 2 సార్లు.. రూ.2.2 లక్షలు!) సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ప్లాట్లోని ఇంటి గేటు పైనుంచి దూకిన దొంగ.. ఇంటి వెనక కిటికీ వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న కర్రను తీసుకొని చివరి భాగంలో ఇనుప వైరును కొక్కెంగా చేసి బిగించాడు. దాని సహాయంతో కిటికిలో నుంచి గోడకు తగిలించిన హ్యాండ్ బ్యాగ్‌ను తస్కరించాడు. అందులో ఉన్న రూ.15 వేలు తీసుకుని పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ వెంకటేష్, డీఐ మహేష్, ఎస్ఐ ప్రసాద్‌లు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడు రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఊరెళ్తున్నారా... ఇల్లు భద్రం) -
ఆమె బ్యాగ్ ధరతో ఆర్నెల్లు బతికేయొచ్చు..
ముంబై : బాలీవుడ్ నటులు, సెలబ్రిటీలు తమ హోదాను చాటుకోవడానికో, స్టైల్ స్టేట్మెంట్ కోసమో ఖరీదైన వస్తువులు వాడుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కాస్ట్లీ లుక్‌తో హల్చల్ చేశారు. బేబీ పింక్ కలర్ షర్ట్, అదే రంగు జీన్స్ ధరించిన మనీషా సింపుల్‌గా కనిపించినా, ఆమె హ్యాండ్‌బ్యాగ్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. మనీషా చేతిలో కనిపించిన హ్యాండ్ బ్యాగ్ ధర భారత కరెన్సీలో రూ 1.7 లక్షలు. ఇక రూ 50 వేల ఖరీదైన షూ ధరించిన మనీషా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తన ప్రత్యేకతను నిలుపుకునేందుకు బ్రాండెడ్ కలెక్షన్‌ను బాగానే డిస్ప్లే చేశారు. అయితే మనీషా బ్యాగ్ ధరతో ఓ సామాన్య కుటుంబం ఆర్నెల్ల పాటు హాయిగా బతికేయవచ్చు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
కొడవలూరు: మహిళ హ్యాండ్ బ్యాగ్‌లోని బంగారు, వెండి నగలు చోరీ చేసిన కేసులో నిందితుడైన బిట్రగుంటకు చెందిన గుర్రంకొండ రాజేష్ అలియాస్ బుడ్డను ఆదివారం కొడవలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉ న్నాయి. తిరుపతికి చెందిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై సూర్యనారాయణ కుటుం బసభ్యులతో కలిసి జనవరి 23వ తేదీన గుంటూరుకు వెళ్లాడు. అనారోగ్యంతో ఉన్న బంధువులను పరామర్శించి తిరిగి తిరుపతికి వస్తూ రాత్రి కావడంతో కమ్మపాలెం వద్ద కారును ఆపి నిద్రకు ఉపక్రమించారు. సూర్యనారాయణ భార్య హ్యాండ్ బ్యాగ్‌ను నిందితుడు దొంగిలించి అందులో ఉన్న బంగారు చైన్, వెంకటేశ్వరస్వామి డాలర్, రెండు జతల వెండి కాళ్ల పట్టీలు అపహరించాడు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు గుర్రంకొండ రాజేష్ అని నిర్ధారిం చారు. ఆదివారం కోవూరు బస్టాండ్‌లో ఉన్న అతడిని అరెస్ట్ చేశారు. బంగా రు, వెండి నగలను స్వాధీనం చేసుకోవడంతోపాటు జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్ జీపీపీ రామరాజు తెలిపారు. -
హ్యాండ్‌బ్యాగ్ కోసం ఎంత పని చేసింది..!
గ్వాగ్డాంగ్, చైనా : పబ్లిక్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే సెక్యూరిటీ చెక్స్ల్లో వస్తువులు పోతాయని ఎప్పుడైనా మీరు భయపడ్డారా?. చైనాలోని ఓ మహిళ అలానే భయపడ్డారు. మరో ఆలోచన లేకుండా రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ చెక్స్‌లో భాగంగా వినియోగించే ఎక్స్ రే మెషీన్‌లోకి హ్యాండ్ బ్యాగ్‌తో పాటు తాను కూడా ఎక్కారు. ఈ ఘటన దక్షిణ చైనాలో గల గ్వాంగ్డాంగ్ ప్రావిన్సులోనిలో రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఎక్స్ రే మెషీన్ స్క్రీన్‌లో మహిళ ఇమేజ్ను చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. హైహీల్స్‌తో పాటే ఆమె ఎక్స్‌రే మెషీన్‌లోకి వెళ్లారు. దీంతో ఆమె జాగ్రత్తగా బయటకు వస్తుందో లేదో? అని ఆందోళన చెందారు. మెషీన్లో నుంచి ఆమె భద్రంగా బయటకు రావడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. మహిళ ఎక్స్ రే ఇమేజ్‌లు చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. మరి మీరు మహిళ ఎక్స్ రే ఫొటోలపై ఓ లుక్కేయండి. -
మహిళల కోసం ఓ మారణాయుధం
ఆయుధం హ్యాండ్‌బ్యాగ్‌లో పడుతుంది, కానీ బ్యాగ్ పట్టనంత డబ్బు కావాలి! ‘నిర్భీక్’ అనే కొత్త .32 కాలిబర్ రివాల్వర్ ఈ నెలాఖరుకు మార్కెట్లోకి వస్తోంది. లేదా ముందే వచ్చినా రావచ్చు. రావడం మాత్రం ఖాయం. వచ్చాక దీనివల్ల మహిళలకు ఏమైనా మేలు జరుగుతుందా అనే విషయం మాత్రం ఖాయంగా చెప్పలేం. మహిళలకే ఎందుకంటే... భారతదేశంలో తొలిసారిగా మహిళల కోసమే తయారవుతున్న రివాల్వర్ ఇది. ఇందులో ఆరు బులెట్లు ఉంటాయి. యాభై మీటర్ల దూరం వరకు దిగబడతాయి. ఒక్క బులెట్ తగిలినా చాలు, మీదకు రాబోతున్నవాడు కుప్పకూలిపోతాడు. కాన్పూర్‌లోని దేశరక్షణ ఆయుధాల కర్మాగారంలో నాణ్యమైన విడి భాగాలతో నిర్భీక్ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే 20 వరకు ఆర్డర్లు వచ్చాయని ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ అబ్దుల్ హమీద్ చెబుతున్నారు. ఇంకా ఏం చెబుతున్నారంటే... ఈ రివాల్వర్ని దగ్గర ఉంచుకుంటే ఆడవాళ్లకు ధైర్యంగా ఉంటుందట. హ్యాండ్ బ్యాగ్‌లో చక్కగా ఇమిడిపోతుందట. పైన అందమైన డిజైనింగ్‌తో నిర్భీక్ అనే ఇంగ్లిషు అక్షరాలు తళతళ లాడుతూ ఉంటాయట. అన్నీ బాగున్నాయి కానీ, ఈ రివాల్వర్ ఎలుకల మందులా వీధి చివర కిరాణా షాపులలో దొరకదు. బస్టాపు పక్కన బడ్డీ కొట్లలో దొరకదు. వందకో రెండొందలకో దొరకదు. ఇవన్నీ అటుంచితే, దీన్ని మగవాళ్లకు అమ్మకుండా ఉంటారా అనే ప్రశ్నకు అస్సలు సమాధానం దొరకదు. పైగా రివాల్వర్ కొనుగోలుకు, ముందుగా అప్లికేషన్ పెట్టుకోవాలి. రివాల్వర్ ఎందుకు అవసరమో వివరణ ఇవ్వాలి. అడ్వాన్స్ చెల్లించాలి. ఆ తర్వాత వచ్చి తీసుకెళ్లమన్నప్పుడు బయల్దేరి వెళ్లాలి. ఇప్పుడు చెప్పండి, సాధారణ మహిళలకు ఈ ఆయుధం ఎలా పనికొస్తుందో? మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చాలా చేస్తుంటాయి. వాటన్నిటినీ మనం సమర్థించనవసరం లేదు. ముఖ్యంగా ఇలాంటి ఆలోచనలను! అన్నట్టు రివాల్వర్ ధర లక్షా 23 వేల రూపాయలు. ఇంత ధర పెట్టి కొనడం కన్నా ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకోవడం తేలిక కదా. ఎలా మలచుకోవడం? ఈ మధ్య వచ్చిన ‘ది డే ఆఫ్టర్ ఎవ్రీడే’ అనే లఘుచిత్రాన్ని యూట్యూబ్‌లో చూడండి. ఖాళీ చేతులను మారణాయుధాలుగా ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది.