ఆమె బ్యాగ్‌ ధరతో ఆర్నెల్లు బతికేయొచ్చు.. | Manisha Koirala Pairs Costly Bag At The Airport | Sakshi
Sakshi News home page

ఆమె బ్యాగ్‌ ధరతో ఆర్నెల్లు బతికేయొచ్చు..

Published Fri, Feb 15 2019 7:31 PM | Last Updated on Fri, Feb 15 2019 7:45 PM

Manisha Koirala Pairs Costly Bag At The Airport - Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటులు, సెలబ్రిటీలు తమ హోదాను చాటుకోవడానికో, స్టైల్‌ స్టేట్‌మెంట్‌ కోసమో ఖరీదైన వస్తువులు వాడుతుంటారు. తాజాగా బాలీవుడ్‌ నటి మనీషా కొయిరాలా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కాస్ట్‌లీ లుక్‌తో హల్‌చల్‌ చేశారు. బేబీ పింక్‌ కలర్‌ షర్ట్‌, అదే రంగు జీన్స్‌ ధరించిన మనీషా సింపుల్‌గా కనిపించినా, ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.

మనీషా చేతిలో కనిపించిన హ్యాండ్‌ బ్యాగ్‌ ధర భారత కరెన్సీలో రూ 1.7 లక్షలు. ఇక రూ 50 వేల ఖరీదైన షూ ధరించిన మనీషా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తన ప్రత్యేకతను నిలుపుకునేందుకు బ్రాండెడ్‌ కలెక్షన్‌ను బాగానే డిస్‌ప్లే చేశారు. అయితే మనీషా బ్యాగ్‌ ధరతో ఓ సామాన్య కుటుంబం ఆర్నెల్ల పాటు హాయిగా బతికేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement