న్యూఢిలీ : భారత రైల్వే సంస్థ ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రయాణికుల లగేజ్‌పై చూసిచుడనట్టు వ్యవహరించిన రైల్వేశాఖ ఇకపై భారాన్ని మోపనుంది. ఇందులో భాగంగా 30 ఏళ్ల నుంచి వస్తున్న లగేజ్ నిబంధనల స్థానంలో కొత్తవి తీసుకువచ్చింది. కొంతమంది పరిమితికి మించి లగేజ్‌తో ప్రయాణిస్తున్నారని తోటివారి నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కొత్త నిబంధనలు :
ప్రయాణం | లగేజ్ పరిమితి(కేజీలలో) |
రుసుంతో లగేజ్ పరిమితి(కేజీలలో) |
స్లిపర్ క్లాస్ | 40 | 80 |
సెకండ్ క్లాస్ | 35 | 70 |
ఏసీ టూ టైర్ | 50 | 100 |
ఏసీ ఫస్ట్ క్లాస్ | 70 | 150 |
పరిమితి కన్నా ఎక్కువగా లగేజ్ ఉన్నట్టయితే పార్సిల్ కౌంటర్‌లో రుసుం చెల్లించి.. లగేజ్‌వ్యాన్‌లో అదనపు లగేజ్‌ని ఉంచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నిబంధనలు ఉన్నాయని.. వాటిని కఠినంగా అమలు చేయడమే తర్వాయి అని రైల్వే అధికారులు పేర్కొన్నారు. అదనపు లగేజ్‌కు రుసుం చెల్లించకుండా పట్టుబడితే.. ఆ మొత్తానికి వసూలు చేసే రుసుంపై ఆరు రెట్లు జరిమానా విధించనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment