
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పొద్దుటూర్‌తో పాటు తమిళనాడులో కొత్తగా ఆరు శాఖలను ప్రారంభించినట్లు ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ వెల్లడించింది. ఇవి సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్, డిపాజిట్లు, రుణాలు తదితర బ్యాంకింగ్ సర్వీసులను సమగ్రంగా అందిస్తాయని బ్యాంక్ తెలిపింది.
2024–25లో కొత్తగా 35 శాఖలను ప్రారంభించినట్లు, మొత్తం బ్రాంచీల సంఖ్య 877కి చేరినట్లు వివరించింది. కస్టమర్లకు అనుకూలంగా ఉండేలా తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్ కేవీబీ డిలైట్‌ను 150 పైచిలుకు ఫీచర్లతో మెరుగుపర్చినట్లు పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆఖరు నాటికి బ్యాంక్ మొత్తం వ్యాపార పరిమాణం రూ. 1,81,993 కోట్లకు చేరింది. తొమ్మిది నెలల కాలానికి నికర లాభం రూ. 1,428 కోట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment