మహిళలకు ఉచిత శిక్షణ | free training for unemployed women | Sakshi
Sakshi News home page

మహిళలకు ఉచిత శిక్షణ

Aug 1 2016 6:34 PM | Updated on Sep 4 2017 7:22 AM

గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ మహిళలకు ఈనెల 3వ తేది నుంచి 30 రోజుల పాటు బ్యూటీపార్లర్‌ మేనేజ్‌మెంట్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు శ్రీనాథ్‌ సోమవారం తెలిపారు.

సంగారెడ్డి మున్సిపాలిటీ: గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఈనెల 3వ తేది నుంచి 30 రోజుల పాటు బ్యూటీపార్లర్‌ మేనేజ్‌మెంట్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు స్టేట్‌బ్యాంక్‌ గ్రామీణ ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ శ్రీనాథ్‌ సోమవారం తెలిపారు. ఆసక్తి గలవారు విద్యార్హత ధ్రువపత్రాలు, తెల్లరేషన్‌ కార్డు కలిగినవారు సంగారెడ్డిలోని పాత వెలుగు కార్యాలయం ఆవరణలో ఉన్న ఉపాధి శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతితో రవాణా చార్జీలు సైతం చెల్లిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement