
ఢిల్లీ: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర స్థాయి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ , కిషన్ రెడ్డిలు పోటీ చేయట్లేదని ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా తాము ప్రచారం చేస్తామని వెల్లడించారు. అయితే.. ఇదే వరుసలో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అధిష్టానానికి డీకే అరుణ తన నిర్ణయాన్ని తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
బీజేపీ గూటికి రాథోడ్ బాపురావు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీజేపీ గూటికి చేరారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కాదని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్‌కు సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో అసంతృప్తికి గురైన బాపురావు.. బీజేపీ నుంచి బరిలో దిగనున్నారు.
ఇదీ చదవండి: బీజేపీకి గడ్డం వివేక్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక
Comments
Please login to add a commentAdd a comment