దేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు (80) కలిగిన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశ రాజకీయాల్లో సాధువుల ప్రవేశం 90వ దశకంలో రామమందిర ఉద్యమం నుంచి ప్రారంభమైంది. ఇది నేటికీ కొనసాగుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన స్వామి బ్రహ్మానంద్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్వామి బ్రహ్మానంద్ గోసంరక్షణ కోసం పాటుపడ్డారు. పార్లమెంటులో కూడా ఈ అంశంపై చర్చించారు. స్వాతంత్య్రానంతరం 1951-52లో తొలి సాధారణ ఎన్నికలు జరిగాయి. గోరఖ్‌నాథ్ పీఠానికి చెందిన మహంత్ దిగ్విజయ్‌నాథ్ 1952,1957 ఎన్నికలలో హిందూ మహాసభ నుండి పోటీ చేసినప్పటికీ, కాంగ్రెస్ ముందు సత్తా చాటలేకపోయారు. 1966లో స్వామి బ్రహ్మానంద్ స్వామి కర్పాత్రి మహారాజ్‌తో కలిసి లక్షలాది సాధువులతో కలసి గోహత్యను నిషేధించాలనే ఉద్యమాన్ని చేపట్టారు. దీనిపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఎదుట నిరసనలు చేపట్టారు.
ఈ ఉద్యమ నేపధ్యంలో అప్పటి ప్రభుత్వం స్వామి బ్రహ్మానంద్‌ను అరెస్టు చేసి, జైలుకు తరలించింది. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల్లోకి రావాలని ఆయనను పలువురు కోరారు. దీంతో ఆయన జన్ సంఘ్‌లో చేరడం ద్వారా రాజకీయాల్లోకి కాలుమోపారు. 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ లోక్‌సభ స్థానం నుండి స్వామి బ్రహ్మానంద్ పోటీ చేసి విజయం సాధించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక సాధు సన్యాసి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికవడం అదే తొలిసారి. తరువాతి కాలంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు.
నాటి ప్రధాని ఇందిరా గాంధీ 1967లో బ్యాంకుల జాతీయకరణ అంశాన్ని లేవనెత్తినప్పుడు, స్వామి బ్రహ్మానంద్ అందుకు మద్దతుగా నిలిచారు. దీంతో జన్‌సంఫ్‌కు, స్వామి స్వామి బ్రహ్మానంద్‌కు మధ్య దూరం పెరిగింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో హమీర్‌పూర్ నుండి స్వామి బ్రహ్మానంద్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఈ విధంగా ఆయన రెండోసారి ఎంపీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment