లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది. ఈ దశలో 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి.
అసోంలోని కరీంగంజ్, సిల్చార్, మంగళ్‌దోయ్, నవ్‌గోంగోన్, కలియాబోర్, బీహార్‌లోని కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా, భాగల్పూర్, బంకా, ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్, మహాసముంద్, కాంకేర్, జమ్మూ కాశ్మీర్‌లోని ఒక స్థానం, కర్ణాటకలోని ఉడిపి, చిక్కమగళూరు, హాసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుమకూరు, మాండ్య, మైసూర్, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, చిక్కబళ్లాపూర్, కోలార్‌లో ఈ నెల 26న పోలింగ్ జరగనుంది.
ఇదేవిధంగా కేరళలోని కాసరగోడ్, కన్నూర్, వటకర, వాయనాడ్, కోజికోడ్, మలప్పురం, పొన్నాని, పాలక్కాడ్, అలత్తూర్, త్రిస్సూర్, చాలకుడి, ఎర్నాకులం, ఇడుక్కి, కొట్టాయం, అలప్పుజ, మావెలిక్కర, పతనంతిట్ట, కొల్లం, అట్టింగల్, తిరువనంతపురం, మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్, దామో, ఖజురహో, సత్నా, రేవా, హోషంగాబాద్, బేతుల్‌లలో ఓటింగ్ జరగనుంది.
రాజస్థాన్‌లోని టోంక్, సవాయ్ మాధోపూర్, అజ్మీర్, పాలి, జోధ్‌పూర్, బార్మర్, జలోర్, ఉదయ్‌పూర్, బన్స్వారా, చిత్తోర్‌గఢ్, రాజ్‌సమంద్, భిల్వారా, కోట, ఝలావర్-బరన్‌లలో ఓటింగ్ జరగనుంది. అలాగే మహారాష్ట్రలోని బుల్దానా, అకోలా, అమరావతి (ఎస్సీ), వార్ధా, యవత్మాల్-వాషిం, హింగోలి, నాందేడ్, పర్భానీలలో పోలింగ్ జరగనుంది. త్రిపురలోని త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానానికి 26న ఓటింగ్ జరగనుంది.
యూపీలోని అమ్రోహా, మీరట్, బాగ్‌పత్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, అలీఘర్, మధుర, బులంద్‌షహర్‌లలో ఓటింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, రాయ్‌గంజ్, బలూర్‌ఘాట్‌లలోని ఓటింగ్ జరగనుంది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 89 స్థానాలలో 51 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దీంతోపాటు ఎన్డీఏ మిత్రపక్షం ఎనిమిది సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో 21 మంది కాంగ్రెస్ ఎంపీలు విజయం సాధించారు. మరికొన్ని సీట్లు సీపీఎం, బీఎస్పీ తదితర పార్టీలకు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment