Jammu and Kashmir Assembly Polls: సాయంత్రం 5 గంటల వరకు 65.84 శాతం ఓటింగ్‌ నమోదు | Jammu and Kashmir Assembly Elections Third and Final Phase | Sakshi
Sakshi News home page

Jammu and Kashmir Assembly Polls: సాయంత్రం 5 గంటల వరకు 65.84 శాతం ఓటింగ్‌ నమోదు

Published Tue, Oct 1 2024 6:53 AM | Last Updated on Tue, Oct 1 2024 6:58 PM

Jammu and Kashmir Assembly Elections Third and Final Phase

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మూడవ, చివరి దశ పోలింగ్‌ కొనసాగుతోంది.  ఓటర్లు అ‍త్యంత ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జమ్ము ప్రాంతంలోని జమ్ము, ఉధంపూర్, సాంబా, కథువా జిల్లాలు, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా, బండిపోరా, కుప్వారా జిల్లాలకు చెందిన 39.18 లక్షల మంది ఓటర్లు 5,060 పోలింగ్ స్టేషన్‌లలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

సాయంత్రం అయిదు గంటల వరకు 65.84 శాతం ఓటింగ్‌ నమోదైంది. 

ఉధంపూర్ జిల్లాలో అత్యధికంగా 72.91%, సాంబా (72.41%), కథువా (70.53%), జమ్ము (66.79%), బండిపోరా (63.33%), కుప్వారా (62.76%), బారాముల్లా (55.73%) పోలింగ్‌ నమోదైంది.

నియోజకవర్గాలలో జమ్మూ జిల్లాలోని ఛంబ్ మొదటి 10 గంటల్లో 77.35% పోలింగ్‌తో ముందంజలో ఉంది. ఒకప్పుడు తీవ్రవాద,  వేర్పాటువాదుల కోటగా ఉన్న సోపోర్ సెగ్మెంట్‌లో అత్యల్పంగా 41.44% పోలింగ్ నమోదైంది.

జమ్ము కశ్మీర్‌ చివరి దశ పోలింగ్‌: మధ్యాహ్నం 1 గంట వరకు 44 శాతం ఓటింగ్‌ నమోదైంది.

 

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 11 గంటల వరకు 28.12 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఉదంపూర్‌లో 33.84 శాతం ఓటింగ్‌ నమోదైంది. బారాముల్లాలో 23.20 శాతం ఓటింగ్ నమోదైంది.
 

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ తుదివిడత పోలింగ్‌లో మొత్తం 415 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ దశ ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్ పోటీలో ఉన్నారు.  పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజానికి చెందినవారు, గూర్ఖా కమ్యూనిటీవారు ఈ ఎన్నికల్లో అత్యధిక ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికలు జరుగుతున్న ఏడు జిల్లాల్లో 20,000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

శాంతియుతంగా ఓటింగ్‌ జరిగేందుకు పోలింగ్‌ ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జమ్ము రీజియన్‌ అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీపీ) ఆనంద్‌ జైన్‌ తెలిపారు. జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 61.38 శాతం పోలింగ్‌ నమోదుకాగా, సెప్టెంబర్ 26న జరిగిన రెండో దశలో 57.31 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. నేడు జరగనున్న తుదివిడత ఎన్నికల్లో 18 నుండి 19 ఏళ్ల మధ్య వయసు గల 1.94 లక్షల మంది యువకులు, 35,860 మంది వికలాంగ ఓటర్లు, 85 ఏళ్లు పైబడిన 32,953 మంది వృద్ధ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు  జరగనుంది.

ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ ప్రహేళిక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement