హర్యానాలో ఈ ఏడాది అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పలు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీకి చెందిన రాజకీయ అనుభవజ్ఞులు హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ ఎన్నికలకు బీజేపీ పటిష్టమైన వ్యూహం సిద్ధం చేస్తోంది. దీనిలో కుల సమీకరణలకు ప్రాధాన్యతనివ్వనున్నారని సమాచారం.
ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానాలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు ఢిల్లీకి చెందిన ఏడుగురు బీజేపీ ఎంపీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాట్‌లు, గుర్జర్‌లు, వాల్మీకులు, వ్యాపార వర్గాలతో సహా పూర్వాంచలిలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. హర్యానా ఎన్నికల్లో గెలవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ బీజేపీ ఎంపీలు బన్సూరి స్వరాజ్, మనోజ్ తివారీ కీలకపాత్ర పోషించనున్నారు.
దక్షిణ ఢిల్లీ ఎంపీ రామ్‌వీర్ సింగ్ బిధూరి హర్యారాలోని గుర్జర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు, పశ్చిమ ఢిల్లీ ఎంపీ కమల్‌జిత్ సెహ్రావత్ జాట్ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించనున్నారు. నార్త్-వెస్ట్ ఢిల్లీ ఎంపీ యోగేంద్ర చందోలియా రిజర్వ్‌డ్ తరగతిని ఆకట్టుకునేందుకు ప్రచారం సాగించనున్నారు. చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్‌వాల్ వ్యాపార వర్గాల్లో తన పరిధిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈయనకు ఎంపీగా మారకముందు నుంచే వ్యాపార వర్గాలవారితో సన్నిహిత సంబంధాలున్నాయి. కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా హర్యానాలోని పంజాబీ కమ్యూనిటీ ఓటర్లను ఆకట్టుకునే దిశగా ముందుకు కదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment