సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ భారత్ ఆశయాలపై కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ–లెర్నింగ్ పోర్టల్‌ను జీహెచ్‌ఎంసీకి చెందిన అధికారులు, సిబ్బంది ఇతర నగరాలకంటే అత్యధికంగా వినియోగించుకుని టాప్‌లో నిలిచినట్టు జీహెచ్‌ఎంసీ ఓ ప్రకట నలో తెలిపింది. స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్యాలు, పారిశుధ్యం తదితర కార్యక్రమాలకు సంబంధించి మున్సిపల్ అధికారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేం దుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్‌లైన్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది.
జీహెచ్‌ఎంసీకి చెందిన 4,323 మంది ఇందులో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ లెర్నింగ్ శిక్షణ పొం దారు. వీరిలో 2,889 మంది విజయవంతంగా కోర్సును పూర్తిచేయడంతో సర్టిఫికెట్లు కూడా అందుకున్నట్టు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో ఎక్కువ మందితో కోర్సును పూర్తిచేయించిన వారిలో ఏఎంఓహెచ్ డాక్టర్ మైత్రేయి, వర్క్ ఇన్‌స్పెక్టర్ గజేందర్‌బాబు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్టు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ హైదరాబాద్‌సిటీ సపోర్టింగ్ యూనిట్ విశేషంగా కృషి చేస్తుండటంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.