ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దాం | Minister Harish Rao Participate In Prtu Candidate Janardhan Reddy | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దాం

Published Sun, Feb 19 2017 1:25 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దాం - Sakshi

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దాం

టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిద్దాం: మంత్రి హరీశ్‌రావు
పీఆర్టీయూ అభ్యర్థిగా  జనార్దన్‌రెడ్డి నామినేషన్‌


సాక్షి, హైదరాబాద్‌: ‘‘టీఆర్‌ఎస్‌ మద్దతిస్తున్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి గెలుపు ఖాయం. ఆయన్ను మంచి మెజారిటీతో గెలిపిద్దాం. గతంలో గెలిచిన స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డిల మెజారిటీని బద్దలు కొట్టాలి. అయితే అతి విశ్వాసం వద్దు. ఆత్మవిశ్వాసంతో ముందు కెళ్దాం’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, మొదటి ప్రాధాన్య ఓటుతోనే జనార్దన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చా రు.

శాసనమండలి ఉపాధ్యాయ నియోజ కవర్గానికి (మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి– హైదరాబాద్‌) జరగనున్న ఎన్నికలో టీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీ చేస్తున్న పీఆర్టీయూ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు  సంద ర్భంగా శనివారం పలువు రు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు, మంత్రులు, ఉపాధ్యా యులు ఇక్కడ ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో సమా వేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ టీచర్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని మూడు జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని జనార్దన్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కోరారు. శనివారమే మేడ్చెల్‌ సమావేశం పూర్తికాగా ఆదివారం వికారాబాద్, సోమవారం వనప ర్తిలలో సమావేశాలు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం, టీచర్లకు మధ్య వారధిగా..
దశబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని, ఉపాధ్యాయ, ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోం దని ఎమ్మెల్సీ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తెలిపారు. తనను గెలిపిస్తే ప్రభుత్వం, ఉపా ధ్యాయులకు మధ్య వారధిలా పని చేస్తానన్నారు. సమావేశంలో 30 ఉపాధ్యాయ సంఘాలు జనార్దన్‌రెడ్డికి మద్దతు ప్రకటించా యి. అనంతరం జీహెచ్‌ఎంసీ కార్యాలయం లో నామినేషన్‌ దాఖలు చేశారు. సమావేశం లో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు తలసాని, మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్, మండలి చీఫ్‌విప్‌ సుధాకర్‌రెడ్డి, విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఐదు నామినేషన్లు
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ శాసనమండలి ఉపాధ్యాయ స్థానానికి శనివారం ఐదు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అద్వైత్‌ కుమార్‌సింగ్‌ తెలిపారు. నామినేషన్లు వేసినవారిలో ఇ.లక్ష్మయ్య, నర్సింగ్‌రావు, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, మీసాల సాయిబాబా, అరకల కృష్ణగౌడ్‌ ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement