
పోలింగ్ ఏజెంట్లకు వీరు అర్హులు
సాక్షి, సిటీబ్యూరో: ఫిబ్రవరి 2న నిర్వహించనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లుగా ఉండాలనుకునేవారు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరై ఉండాలని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి బి.జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొన్న డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేదా సెక్యూరిటీ ఉన్న వ్యక్తులు పోలింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు అనర్హులని పేర్కొన్నారు.పోలింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద తగిన వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.