ప్రగతినగర్ : అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రజావాణిలో సీరియస్ అయ్యారు. తాను ఆదేశించినా.. విచారణ జరిపి నివేదిక ఇవ్వకపోవడంపై పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గూపన్‌పల్లిలో ఫేజ్-2 ఇళ్ల నిర్మాణాల విషయంలో విచారణ జరిపి వివరణ ఇవ్వని డీఎల్‌పీఓ, గ్రామ కార్యదర్శులనుంచి వివరణ తీసుకోండి అంటూ డీపీఓను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలువురు సమస్యలపై ఫిర్యాదులు చేశారు. కలెక్టర్‌తోపాటు అదనపు జేసీ శేషాద్రి, డీఆర్వో మనోహర్, జడ్పీ సీఈఓ రాజారాం తదితరులు ఫిర్యాదులు స్వీకరించారు.
అక్రమ నిర్మాణాలపై..
గూపన్‌పల్లి ఫేజ్-2లో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మిస్తున్నారని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే వ్యక్తి గత వారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని డీపీఓ, గ్రామ కార్యదర్శులను కలెక్టర్ ఆదేశించారు. ఆ ఫిర్యాదుదారుడు ఈ వారం కూడా ప్రజావాణికి వచ్చి.. సమస్య అలాగే ఉందని, అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. తానే స్వయంగా ఆదేశించినా చర్యలు తీసుకోకపోవడంతో మండిపడ్డారు.
డీపీఓతో ఫోన్ ద్వారా మాట్లాడారు. డీఎల్‌పీఓతోపాటు గ్రామ కార్యదర్శినుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
మైనింగ్‌కు అనుమతివ్వాలంటూ..
ఆర్మూర్‌లోని మామూళ్ల నడిమి గుట్ట వద్ద మైనింగ్‌కు ఒడ్డెరలకు అనుమతి ఇవ్వాలని ఒడ్డెర సంఘం రాష్ట్ర నాయకుడు దేవంగుల నాగేశ్ కలెక్టర్‌ను కోరారు. ఒడ్డెర కార్మికుల సమస్యల పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమకు బాకూర్ గుట్ట వద్ద కంకర మిషన్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకుండా అపుదల చేయడం గు రించి మాట్లాడారు. ఆర్మూర్‌లో ఒడ్డెరలు సు మారు 2 వేల మంది ఉన్నారని, రాళ్లు కొట్టుకుం టూ జీవిస్తున్నామని, మైనింగ్‌కు అనుమతి ఇ వ్వకపోతే జీవనోపాధి కోల్పోతామన్నారు. ఆయన వెంట సంఘం నాయకులు రాజన్న, ఎల్లయ్య, గణపతి, రాజు తదితరులున్నారు.
వధశాలకు మరమ్మతుల కోసం..
స్వాతంత్య్రంకంటె ముందు ఆర్మూర్‌లో నిర్మిం చిన మేకల వధశాలకు మరమ్మతుల కోసం ని ధులు మంజూరు చేయాలని అరె కటికె సంఘం ఆర్మూర్ ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి వినతి ప త్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టణం దినదినాబివృద్ధి చెందడంతో 1995 నుంచి అద్దె భవనంలో మేకల వధశాల నిర్వహిస్తున్నామన్నారు. కాగా తాత్కాలికంగా మేకల వధశాలను మూసి వేయాలని మున్సిపాలిటీ అదికారులు నోటీసులు ఇచ్చారన్నారు. కేటాయించిన వధశాలకు నిధులు కేటాయించి సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ఇసుక మఫియాపై..
ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని వేల్పూర్ మండలం అక్లూర్ రైతులు కలెక్టర్‌ను కోరారు. గ్రామం నుంచి అనుమతి లేకుండానే ఇసుకను తరలిస్తున్నారన్నారు. దీంతో భూగర్భజలాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితులకు భూ పంపిణీపై..
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్లుగా వెంటనే దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయాలని న్యూడెమోక్రసీ నాయకులు కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లాకార్యదర్శి వేల్పూర్ భూమయ్య, నాయకులు నర్సయ్య, సాయాగౌడ్, మురళి తదితరులు పాల్గొన్నారు.
కబ్జా దారులపై..
నందిపేటలో సర్వే నం. 685/1, 2, 3, 4, 5 లలోని భూమి తన పేరు మీద ఉన్నప్పటికీ సర్పంచ్ ఎండీ షకీల్ , గ్రామ కార్యదర్శి శంకర్‌లు అక్రమార్కులకు కొమ్ముకాస్తూ భూఅక్రమాలకు పాల్పడుతున్నవారిని ప్రోత్సహిస్తున్నారంటూ గ్రామానికి చెందిన రావెళ్ల ఝాన్సీ లక్ష్మీబాయి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
వికలాంగుల సమస్యలపై..
వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ కలెక్టర్‌ను కోరారు. ఇటీవల అర్హులైన పింఛన్ కూడా తొలగించారని, అందరికీ పింఛన్లు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద వికలాంగులకు లక్ష రుపాయలు ఇవ్వాలన్నారు.
ఆదేశించినా.. విచారణ జరపరా?
Published Tue, Nov 18 2014 3:32 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement