pragathi nagar
-
ఈ ఘటనతో తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి
-
హైదరాబాద్ ప్రగతి నగర్ వద్ద నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
-
విషాదం.. నాలాలో పడిపోయి నాలుగేళ్ల బాలుడు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో సోమవారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో బాచుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ ఎన్ఆర్ఐ కాలనీ వద్ద నాలాలో పడిపోయి నాలుగేళ్ల బాలుడు నితిన్ గల్లంతయ్యాడు. ఈ క్రమంలో నిజాంపేట రాజీవ్ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో, నితిన్‌ను బయటకు తీసే ప్రయత్నం విఫలం కావడంలో అక్కడే ఉన్న తుర్క చెరువులోకి మృతదేహం కొట్టుకుపోయింది. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. కొన్ని గంటల పాటు శ్రమించి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇదిలా ఉండగా.. జంట నగరాల్లో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇళ్లలోకి వరదు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు, మేడ్చల్‌లో అపార్ట్మెంట్లలో మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరుకుంది. దీంతో, వరదల్లో చిక్కుకున్న వారిని జేసీబీల సాయంతో బయటకు తీసుకువచ్చారు అధికారులు. ఇది కూడా చదవండి: Hyderabad : వర్షం దెబ్బకు హైదరాబాద్ ఏమయిందంటే.? -
బాలకృష్ణ బృందానికి రోడ్డు ప్రమాదం.. ఆర్టిస్టులకు తీవ్ర గాయాలు
సినిమా బృందం ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు జూనియర్ ఆర్టిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. జూనియర్ ఆర్టిస్టులు బాలకృష్ణ సినిమా షూటింగ్‌కు వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాచుపల్లికి వ్యాన్‌లో బయలుదేరగా ప్రగతి నగర్ చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
విషాదం: ఎంతకూ ప్రాణం పోకపోవడంతో..
సాక్షి, నిజాంపేట్: ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రాణం తీసుకోవాలనుకున్న ఓ వృద్ధుడు మొదట తన శరీరాన్ని బ్లెడ్‌తో కోసుకుని చనిపోవాలనుకున్నాడు. అయితే ఎంతకూ ప్రాణం పోకపోవడంతో చివరకు అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రగతినగర్‌లోని అదిత్య లేక్‌వ్యూ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 302లో కె.రామలింగేశ్వర్రావు(70), హైమవతి భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. రామలింగేశ్వర్‌రావుకు రెండుసార్లు బైపాస్ సర్జరీ అయింది. బీపీ, షుగర్‌తో పాటు ఆహారం సరిగా తినలేకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. చదవండి: దారుణం: కుటుంబంపై కత్తులతో దాడి.. ముగ్గురి మృతి నెల రోజులుగా ఆహారం సరిగా తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోయి సోమవారం రాత్రి సుమారు 8.45 గంటలకు టెర్రస్ పైకి వెళ్లాడు. అక్కడ తన శరీరంపై బ్లెడ్‌తో గాట్లు పెట్టుకున్నాడు. అప్పటి నుంచి పైనే ఉన్న రామలింగేశ్వర్రావు అర్ధరాత్రి సుమారు 12.45 గంటలకు అపార్ట్మెంట్ పైనుంచి దూకాడు. మంగళవారం ఉదయం అపార్ట్మెంట్ వాచ్‌మెచ్ ద్వారా సమాచారం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు రామలింగేశ్వర్‌రావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చదవండి: ఆమెలాగా అతగాడి పరిచయం.. అశ్లీల వీడియోలను పంపించాలని.. ఒంటరి తనం కూడా కారణామా? రామలింగశ్వేరావు, హైమవతి ఇద్దరే ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కుమారుడు స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమార్తెలు మాత్రం నగరంలోనే ఉంటున్నారు. వీరందరూ ఉన్నత స్థితిలోనే ఉన్నారు. అప్పడప్పుడూ వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్లేవారు. -
పెళ్లింట్లో అసభ్య ప్రవర్తన, హిజ్రాల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా బలవంతంగా డబ్బులు వసూలు చేసిన హిజ్రాలు వారికి సహకరించిన ఆటో డ్రైవర్లను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతినగర్ ఆర్.కె.లేఅవుట్‌కు చెందిన ప్రేవేటు ఉద్యోగి పంచాంగం చలపతి ఈనెల 24న తన కుమారుడి వివాహం జరిపించాడు. 25న ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసే క్రమంలో 8 మంది హిజ్రాలు ఆయన ఇంటికి వచ్చి రూ.20 వేలు డబ్బులు డిమాండ్ చేశారు. అసభ్యకరంగా ప్రవర్తించారు. భయపడిన చలపతి కుటుబ సభ్యులు వారికి రూ.16,500 ఇవ్వడంతో వెళ్లిపోయారు. ఈ విషయంపై బాధితుడు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు ప్రగతినగర్ ఎలీప్ చౌరస్తాలో టీఎస్15 యూడీ 0298 ఆటోలో వెళ్తున్న 8 మంది హిజ్రాలను, ఆటో డ్రైవర్లు కరణ్ గుప్త, మొహమ్మద్ మాసీలను అరెస్టు చేశారు. ఈ విషయమై మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అమాయకులను వేధించే ట్రాన్స్జెండర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే డయల్ 100కు ఫోన్ చేయాలని, లేదా వాట్సాప్ నెంబర్ 94906 17444కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
బిక్కుబిక్కుమంటూ గడిపిన కాలనీవాసులు
-
ప్రగతినగర్‌లో పేలుడు పదార్ధాలు స్వాధీనం
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్లో ఎస్ఓటీ పోలీసులు గురువారం పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు . ఓ ఇంటి సెల్లార్ నిర్మించేందుకు అడ్డుగా ఉన్న బండరాళ్లను పగలగొట్టేందుకు పేలుడు వదార్ధాలు తీసుకుని వచ్చారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్ధలానికి చేరుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 70 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు, ఒక ఇటాచి వాహనం, రెండు కంప్రెషర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
ప్రగతినగర్ :జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూ పొందిస్తున్నామని పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇందుకోసం శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్‌తో కలిసి సమష్టి కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. గత పాల కుల ని ర్లక్ష్యం కారణంగా నిజామాబాద్ అభివృద్ధి కుం టుపడిందన్నారు. 1974 సంవత్సరంలోనే నిజామాబాద్ మాస్టార్ ప్లాన్ తయా రు చేశారని, ఇప్పుడు 2014 సంవత్సరంలో ఉన్నామన్నారు. 40 సంవత్సరాల తేడా కనిపిస్తున్నా నగరం మాత్రం అలాగే ఉండిపోయిం దన్నారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ తీరు అధ్వానంగా మారిన విషయం అందరికీ తెలుసేనన్నారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ, బైపాస్ నిర్మాణాల్లో నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. గత పాలకులు చేశామా...అంటే చేశామా అన్నట్లుగా నిజామాబాద్ మున్సిపాలిటీని,మున్సిపాల్ కార్పొరేషన్‌గా మార్చారన్నారు. బంగా రు తెలంగాణ నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ అర్బన్‌ను స్మార్ట్‌సిటీగా, మాస్టర్ ప్లాన్ నిర్మాణం, పెం డింగ్‌లో ఉన్నా బైపాస్‌రోడ్డు నిర్మాణాలపై నా లుగు గంటలపాటు ఎమ్మెల్యే లు, మేయర్ సుజాత, కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి చర్చించినట్లు తెలిపారు. వీలైనంత తొం దరగా నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ కు టెండర్లు పిలవనున్నామన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను గ్రేటర్ నిజామాబాద్‌గా మార్చాలంటే 12 గ్రామాలు విలీ నం చేయాల్సి ఉంటుందన్నారు. నగరాన్ని అర్బన్ డెవలప్మెంట్ సొసైటీగా మార్చాలంటే గ్రా మాలు పంచాయతీలుగానే ఉండాల్సి వస్తుందన్నారు. స్మార్ట్ సిటీ ప్లాన్ కోసం హైదరాబాద్ నుంచి అధికారులను పిలిపించామని కవిత తెలిపారు. ఐఏఎస్‌ల విభజనలో కొంత మంది జిల్లా అధికారులు ఆంధ్రాకు కేటాయిం చబడ్డారనీ కవిత పేర్కొన్నారు. జిల్లాలో ముఖ్య మైన ఐఏఎస్ పోస్టులు కలెక్టర్, మున్సిపాల్ కమిషనర్,డ్వామా పీడీల కేటాయింపు కేంద్రం పరిధిలో ఉందన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్యెల్యే గణేశ్ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ నగర అభివృద్ధికి ఎప్పటికప్పు డు అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని,అయితే వైద్య సేవల్లో ఎలాంటి లోటు కలుగకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు తెలి పారు. నిజామాబాద్ నగర జనాభా దృష్ట్యా మరో తహశీల్ కార్యాలయం ఏర్పాటు కోసం సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రూరల్ ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డు లో బ్రిడ్జికి ఇరువైపుల రోడ్డు నిర్మాణానికి చ ర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్రిడ్జిపై చిన్న చిన్నపాటి మరమ్మతులు త్వరలో పూర్తి చేస్తామన్నారు.సమావేశంలో నగర మేయర్ సుజా త, డిప్యూటీ మేయర్ ఫయీమ్ పాల్గొన్నారు. 90 శాతం దరఖాస్తుల పరిశీలన ప్రభుత్వ పథకాల అమలు కోసం నిరంతరం జిల్లా యం త్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ రోనాల్డ్రో స్ అన్నారు. సమగ్ర సర్వే ద్వారా వచ్చిన దరఖాస్తులను 90 శాతం పరి శీలించామని తెలిపారు. వికలాంగుల కోసం గత నెల 21 నుంచి 30 వరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పా టు చేయగా 12 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 6,500 మంది వికలాంగుల ను అర్హులుగా గుర్తించామన్నారు. ఈ నెల ఎవరికైనా పింఛన్లు రాకుంటే వచ్చేనెల రెం డు నె లల పింఛన్ పంపిణీ చేస్తామన్నారు.ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మౌళిక వసతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. -
ఆదేశించినా.. విచారణ జరపరా?
ప్రగతినగర్ : అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రజావాణిలో సీరియస్ అయ్యారు. తాను ఆదేశించినా.. విచారణ జరిపి నివేదిక ఇవ్వకపోవడంపై పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గూపన్పల్లిలో ఫేజ్-2 ఇళ్ల నిర్మాణాల విషయంలో విచారణ జరిపి వివరణ ఇవ్వని డీఎల్పీఓ, గ్రామ కార్యదర్శులనుంచి వివరణ తీసుకోండి అంటూ డీపీఓను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలువురు సమస్యలపై ఫిర్యాదులు చేశారు. కలెక్టర్‌తోపాటు అదనపు జేసీ శేషాద్రి, డీఆర్వో మనోహర్, జడ్పీ సీఈఓ రాజారాం తదితరులు ఫిర్యాదులు స్వీకరించారు. అక్రమ నిర్మాణాలపై.. గూపన్పల్లి ఫేజ్-2లో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మిస్తున్నారని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే వ్యక్తి గత వారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని డీపీఓ, గ్రామ కార్యదర్శులను కలెక్టర్ ఆదేశించారు. ఆ ఫిర్యాదుదారుడు ఈ వారం కూడా ప్రజావాణికి వచ్చి.. సమస్య అలాగే ఉందని, అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. తానే స్వయంగా ఆదేశించినా చర్యలు తీసుకోకపోవడంతో మండిపడ్డారు. డీపీఓతో ఫోన్ ద్వారా మాట్లాడారు. డీఎల్పీఓతోపాటు గ్రామ కార్యదర్శినుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మైనింగ్‌కు అనుమతివ్వాలంటూ.. ఆర్మూర్‌లోని మామూళ్ల నడిమి గుట్ట వద్ద మైనింగ్‌కు ఒడ్డెరలకు అనుమతి ఇవ్వాలని ఒడ్డెర సంఘం రాష్ట్ర నాయకుడు దేవంగుల నాగేశ్ కలెక్టర్‌ను కోరారు. ఒడ్డెర కార్మికుల సమస్యల పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమకు బాకూర్ గుట్ట వద్ద కంకర మిషన్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకుండా అపుదల చేయడం గు రించి మాట్లాడారు. ఆర్మూర్‌లో ఒడ్డెరలు సు మారు 2 వేల మంది ఉన్నారని, రాళ్లు కొట్టుకుం టూ జీవిస్తున్నామని, మైనింగ్‌కు అనుమతి ఇ వ్వకపోతే జీవనోపాధి కోల్పోతామన్నారు. ఆయన వెంట సంఘం నాయకులు రాజన్న, ఎల్లయ్య, గణపతి, రాజు తదితరులున్నారు. వధశాలకు మరమ్మతుల కోసం.. స్వాతంత్య్రంకంటె ముందు ఆర్మూర్‌లో నిర్మిం చిన మేకల వధశాలకు మరమ్మతుల కోసం ని ధులు మంజూరు చేయాలని అరె కటికె సంఘం ఆర్మూర్ ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి వినతి ప త్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టణం దినదినాబివృద్ధి చెందడంతో 1995 నుంచి అద్దె భవనంలో మేకల వధశాల నిర్వహిస్తున్నామన్నారు. కాగా తాత్కాలికంగా మేకల వధశాలను మూసి వేయాలని మున్సిపాలిటీ అదికారులు నోటీసులు ఇచ్చారన్నారు. కేటాయించిన వధశాలకు నిధులు కేటాయించి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇసుక మఫియాపై.. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని వేల్పూర్ మండలం అక్లూర్ రైతులు కలెక్టర్‌ను కోరారు. గ్రామం నుంచి అనుమతి లేకుండానే ఇసుకను తరలిస్తున్నారన్నారు. దీంతో భూగర్భజలాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు భూ పంపిణీపై.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్లుగా వెంటనే దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయాలని న్యూడెమోక్రసీ నాయకులు కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లాకార్యదర్శి వేల్పూర్ భూమయ్య, నాయకులు నర్సయ్య, సాయాగౌడ్, మురళి తదితరులు పాల్గొన్నారు. కబ్జా దారులపై.. నందిపేటలో సర్వే నం. 685/1, 2, 3, 4, 5 లలోని భూమి తన పేరు మీద ఉన్నప్పటికీ సర్పంచ్ ఎండీ షకీల్ , గ్రామ కార్యదర్శి శంకర్లు అక్రమార్కులకు కొమ్ముకాస్తూ భూఅక్రమాలకు పాల్పడుతున్నవారిని ప్రోత్సహిస్తున్నారంటూ గ్రామానికి చెందిన రావెళ్ల ఝాన్సీ లక్ష్మీబాయి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వికలాంగుల సమస్యలపై.. వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ కలెక్టర్‌ను కోరారు. ఇటీవల అర్హులైన పింఛన్ కూడా తొలగించారని, అందరికీ పింఛన్లు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద వికలాంగులకు లక్ష రుపాయలు ఇవ్వాలన్నారు. -
‘నమోదు, సవరణ’కు సహకరించండి
ప్రగతినగర్: ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రకియ సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని జిల్లా అదనపు జేసీ శేషాద్రి కోరారు.గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఓటర్ల సవరణపై వివిధ రాజకీయ ప్రతినిధులు, నాయకులతో ఆయన మాట్లాడారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో డిసెంబర్ 8వ తేదీ వరకు ఓటర్లు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపునకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. నవంబర్ 16,23,30 తేదీల్లో, డిసెంబర్ 7వ తేదీన రాజకీయ పార్టీల నుంచి బూత్‌స్థాయి ఏజెంట్ల ద్వారా బూత్‌లెవల్ అధికారులు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన దరఖాస్తులను డిసెంబర్ 22వ తేదీలోగా విచారణ చేసి పరిష్కరిస్తామని తెలిపారు. జనవరి 2015, 5వ తేదీన తుది పరిశీలన కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తామన్నారు. జాబితాలో పేర్ల నమోదుకు ఆధార్ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. జాబితాలో పేర్లులేని అర్హులైన ఓటర్లు డిసెంబర్ 8వ తేదీ వరకు నిర్ణీత ఫారంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక నమోదు తేదీలో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బూత్‌లెవల్ అధికారులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ, నమోదుపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు. సమావేశంలో డీఆర్వో యాదిరెడ్డి, ఏఈ గంగాధర్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొలువులుఇస్తారా!
ప్రగతినగర్ : ప్రభుత్వ శాఖలలో త్వరలో ఔట్సోర్సింగ్ విధానంలో వెయ్యి పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఉద్యోగ ఏజెన్సీలు వేసిన టెండర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అర్హతలేని ఏజెన్సీలు సైతం టెండర్లలో పాల్గొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ వేయగా 27 ఏజెన్సీ లు టెండర్లు దాఖలు చేశాయి. సీల్డు టెండర్లను గతనెల 20న అదనపు జాయింట్ కలెక్టర్ శేషాద్రి ఏజెన్సీ నిర్వాహకుల సమక్షంలో తెరిచారు. కాగా కొన్ని ఏజెన్సీలు బినామీ పత్రాలు దాఖలు చేసి టెండర్ లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. బ్లాక్‌లిస్టులో ఉన్న ఏజెన్సీలు, క్రిమినల్ కేసులు నమోదైనవారు, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపులు జమచేయని, సరైన ధ్రువపత్రాలు లేని ఏజెన్సీలు టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. తీవ్ర పోటీ ఒకేసారి వెయ్యి పోస్టుల నియామకాలు జరుపుతుండడంతో ఏజెన్సీల మధ్య పోటీ తీవ్రమైంది. ఈసారి గతంలో కంటే ఎక్కువ ఏజెన్సీలు టెండర్ దాఖలు చేశాయి. మొత్తం 33 మంది ఏజెన్సీ నిర్వాహకులు దరఖాస్తులు తీసుకువెళ్లగా 27 మంది ఈఎండీ చెల్లించి టెండర్లో పాల్గొన్నారు. వీరిలో ప్రస్తుతం జిల్లాలోని కొన్ని శాఖల్లో ఔట్ సోర్సింగ్ నడుపుతున్న ఏజెన్సీ నిర్వాహకులతో పాటు కొత్తవారు ఉన్నారు. ఈనెల 20న అదనపు జేసీ శేషాద్రి తన చాంబర్లో టెండర్‌దారుల సమక్షంలో బాక్స్ ఓపెన్ చేసి ఏజెన్సీలు నమోదు చేసిన ‘కోట్’ను చదివి విని పించారు. వాస్తవానికి ఏజెన్సీల ఎంపికలో తక్కువ కోట్తో సంబంధం లేకుండా ఏజెన్సీలకు ఉన్న అర్హతలు, అనుభవం, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపులు, పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వానికి టీడీఎస్ (టాక్స్ డిడ క్షన్ సోర్స్) 2.64 శాతం చెల్లించిన అర్హత కూడా ఉండాలి. ఈ ప్రకారం టెండర్ వేసిన 27 ఏజెన్సీల అర్హతలు అదే రోజు రాత్రి పదిగంట వరకు అధికారులు పరిశీలించారు. బినామీ పత్రాలు సమర్పించి వీటిలో కొన్ని ఏజెన్సీలు బినామీ అర్హత పత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ముందు తక్కువ కోట్ చేసిన ఏజెన్సీల ఒరిజినల్ అర్హత పత్రాలు పరిశీలించాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్యాంసుందర్, ఉపాధి కల్పానాధికారి మోహన్‌లాల్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సీల ఎంపికలో ఎక్కడ కూడ నిబంధనలు ఉల్లంఘించకుండా అర్హత కలిగిన పది ఏజెన్సీలను ముందు గుర్తించి ఫైల్ తనదగ్గరకు పంపాలని సూచించారు. అధికారులు పరిశీలించిన ఏజెన్సీ జాబి తాను ఈనెల 13 కలెక్టర్ పరిశీలించనున్నట్లు అధికారికి వర్గాలు చెబుతున్నా యి. స్క్రూటినీ చేసి ఏఏ ఏజెన్సీలకు అర్హత ఉందో కలెక్టర్ అదేరోజు ఫైనల్ చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తం పది ఏజెన్సీలకు ఒక్కో ఏజెన్సీకి వంద చొప్పున పోస్టుల భర్తీ కోసం ఉద్యోగుల నియామకాలకు సంబంధించి అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓ ఏజెన్సీ నిర్వాహకుడు దరఖాస్తు తప్ప మిగితావన్నీ ఇతర ఏజెన్సీల అర్హత పత్రాలే సమర్పించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. 2012 ఆగస్టులో జరిపిన అవుట్ సోర్సింగ్ నియామకాలలో ఓ ఏజెన్సీకి 70 పోస్టుల భర్తీ అప్పగించారు. అయితే, ఆ ఏజెన్సీ 30 మందికి మాత్రమే ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లిం చినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. -
‘కలెక్టర్’నువ్వా.. నేనా!
ప్రగతినగర్ : ‘‘కలెక్టర్ నువ్వా.. నేనా! నేను సెలవులో వెళ్లకముందు ఇంటింటి సర్వేను వేగంగా పూర్తి చేయాలని, ముఖ్యంగా నిజామాబాద్ నగర పరిధిలో సమస్యలు వస్తాయని, అందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పాను. అయినా నా మాట పెడచెవిన పెట్టి ఇంత వరకు కొన్ని టీమ్‌లు.. అసలు సర్వే కూడా మొదలు పెట్టనట్లు తెలుస్తుంది. ఇదంతా కమిషనర్‌గా నీ వైఫల్యం’’ అంటూ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంగతాయారుపై మండిపడ్డారు.మంగళవారం స్థానిక ప్రగతిభవన్‌లో ఆయన మున్సిపల్ అధికారులతో ఆహారభద్రత కార్డులు,సామాజిక పింఛన్ల సర్వేపై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో 80 శాతం సర్వే పూర్తయినట్లు నివేదికలు అందుతున్నాయని,అయితే నిజామాబాద్ నగరంతో పాటు మూడు మున్సిపాలిటీలు సర్వేలో వెనుకబడ్డాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశా లు జారీ చేసిందని అన్నారు. మున్సిపల్ సిబ్బంది మాత్రం సర్వేపై అంత సుముఖంగా లేరని సర్వే నివేదిక ద్వారా తెలుస్తుందన్నారు. ఏది ఏమైన ప్పటికీ ఈ నెల 6 నాటికి ముఖ్యంగా సామాజిక భద్రత పింఛన్ల సర్వేపూర్తి చేయాలని, 8వ తేదీ నుంచి ప్రభుత్వం పింఛన్లు అందిస్తుందన్నారు. మున్సిపల్ సిబ్బంది ప్రతి రోజు చేసిన సర్వే వివరాలు, ఇండ్ల వివరాలు క్యాంపు కార్యాలయంలో అందించాలన్నారు. సర్వే పూర్తి అయిన వెంటనే ముందుగా నైపుణ్యం గల ఆపరేటర్లను నియమించుకొని వెంటనే సీడింగ్ మొదలు పెట్టాలన్నారు.ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే సీడింగ్కై ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు, హైస్పీడ్ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసి స్థానిక ఎన్ఐసీడీఎస్ఓ,రెవెన్యూభవన్,తహశీల్దార్ కార్యాలయంలో మీ-సేవ ట్రైనింగ్ సెంటర్లలో కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. -
పిల్లల నమోదుకు చర్యలు తీసుకోండి
ప్రగతినగర్ : అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల నమోదును పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలలో మూడేళ్లు నిండిన పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎన్నిక చేయబడిన కేంద్రాలలో ఆంగ్లమాధ్యమంలో పిల్లలకు చదువు చెప్పడానికి కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాలలో కనీస వసతులు కల్పించాలని, మంజూరు చేసిన కేంద్రాలలో త్వరలో పూర్తిచేయడానికి తిరిగి టెండర్లు పిలవాలని సూచించారు. సొంతభవనాల కోసం ప్రతిపాదనలు పంపించండి పట్టణ కేంద్రాలలో అద్దెకు గదులు లభించని పరిస్థితుల్లో పాఠశాలల పరిధిలో ఒక గదిని కేటాయించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉన్న శిశు కేంద్రానికి అవసరమైన నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 989 కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలన్నారు. భవనాలు పూర్తి చేయడానికి ఇంటర్ డిపార్ట్మెంట్ సమన్వయ కమిటీ సమావేశాలలో సమస్యలు తెలుపాలన్నారు. పిల్లలకు, గర్భిణులకు ఐరన్ ఫోలిక్ మాత్రలు సమపాళ్లలో పంపిణీ చేయాలని, ఇందుకు అవసరమైన ఇండెంట్‌ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారికి పంపించాలని సూచించారు. పౌష్టికాహారం అందించి పిల్లలు ఆ రోగ్యంగా ఎదగడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఐసీడీఎస్ పీడీ రాములు, డీఈఓ శ్రీనివాసాచారి, అదనపు డీఎంహెచ్ఓ బసవేశ్వరి, ఎంపీడీఓ గీతారాణి, పీఆర్ రాజేంద్రప్రసాద్, వైద్యాధికారి నాగరాజు, సీడీపీఓ ఝూన్సీరాణి, ఏపీఆర్ఓ రాంమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీకి అర్హులను గుర్తించండి మద్నూర్ : రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారుల వివరాలను అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆదేశించారు. మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల గది, కంప్యూటర్ గది, తహశీల్దార్ చాంబర్‌ను పరిశీలించారు. అనంతరం బ్యాంకు అధికారులు,వీఆర్వోలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రుణమాఫీకి ఆధార్ అనుసంధానం, బ్యాంకు ఖాతాల పరిశీలన, ఒకే కుటుంబంలో పంట రుణాలు పొందిన వారిని గుర్తించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. 2014-15 సంవత్సరానికి గాను పహాణీ తయారు చేశారా అని వీఆర్వోలను అడిగారు. పంట వివరాలను తప్పకుండా పహాణీలో పొందుపరచాలని కలెక్టర్ సూచించారు. జమాబందీ వివరాలను వచ్చే నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆధార్ అనుసంధానం వంద శాతం పూర్తిచేయాలన్నారు. లెండి ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని..ఇక్కడి నుంచి ఎంత దూరం ఉందని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జుక్కల్ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలను ఆయన మ్యాప్‌ను పరిశీలించారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
- కట్టుకున్న వాడే కడతేర్చాడంటున్న బాధితులు నెల్లూరు (క్రైమ్) : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మూలాపేట పాత పోలీసు క్వార్టర్స్ సమీపంలో ఓ ఇంట్లో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి, సోదరి, స్థానికుల సమాచారం మేరకు.. నగరంలోని ప్రగతినగర్‌కు చెందిన ఎస్కే మాబున్నీ, ఖాలేషా దంపతుల పెద్ద కుమార్తె ఫామిదా (20)కు మూలాపేట పోలీస్క్వార్టర్స్ సమీపంలో నివసిస్తున్న ఫాతిమా, ఇమాముల్లా కుమారుడు మౌలాలితో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి 16 నెలల కుమారుడు ఆసీఫ్ ఉన్నాడు. మౌలాలి గూడూరులో వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. మద్యానికి బానిసైన మౌలాలి భార్యను నిత్యం వేధించేవాడు. అత్తమామలు కూడా వేధించ సాగారు. పలు దఫాలు వారి మధ్య తీవ్ర స్థాయిలో ఘ ర్షణలు జరిగాయి. అత్తింటి వేధింపులపై ఆమె తన తల్లిదండ్రులకు తెలిపి విలపిం చేది. సర్దుకోమని సూచించడంతో వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చింది. 15 రోజు లుగా మౌలాలి పనులకు వెళ్లడం మానివేశాడు. శనివారం ఉదయం మాబున్నీ చిన్న కుమార్తె షాహిదా తన సోదరి ఫామిదాను ఫోన్లో పరామర్శించింది. అయితే సమాధానం చెప్పకుండా రోదిస్తూ ఫోన్ పెట్టేసింది. అదే సమయంలో దంపతుల నడుమ వాగ్వివాదం చోటు చేసుకుంది. ఫామిదా పడక గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన భర్త తలుపులు పగులగొట్టి ఆమెను కిందకు దించాడు. 108కు సమాచార ం ఇవ్వడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా ఫామిదా అప్పటికే మృతి చెందినట్లు చెప్పి వెళ్లిపోయారు. దీంతో మౌలాలి మృతురాలి సోదరి షాహిదాకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలిపాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఫామిదాను అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. తాను ఫోన్ చేసినప్పుడు ఫామిదా రోదిస్తూ ఉం దని మృతురాలి సోదరి వాపోయింది. కొద్దిసేపటికే మౌలాలి తమకు ఫోన్ చేసి ఫామి దా మృతి చెందిందని చెప్పడం బట్టి చూస్తే ఆమె భర్త, అత్తింటివారే హత్య చేసి ఉంటారని ఆమె ఆరోపించారు. చిన్నారి ఆసీఫ్‌ను చూసి కన్నీరుమున్నీరయ్యారు. రంజాన్‌కు బట్టలు కొనివ్వలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని భర్త మౌలాలి శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాల్గో నగర పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సౌమ్యదీప్కు లుకౌట్ నోటీసులు జారీ
-
సోమదీప్‌కు లుకౌట్ నోటీసులు జారీ
హైదరాబాద్ : నాలుగు రోజుల క్రితం కూకట్పల్లి ప్రగతి నగర్ కారు ప్రమాదం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కారు నడిపిన సోమదీప్ బసు అమెరికాకు పరారీ అయ్యాడు. దాంతో పోలీసులు అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుదీప్ (26), ఉత్యా (23), సౌరవ్ మైథీ (30), నిలాద్రి (29)లు కొండాపూర్‌లో నివాసముంటున్నారు. సుదీప్ , ఉత్యా, సౌరవ్లు సాప్ట్వేర్ ఇంజనీర్లు కాగా... నిలాద్రి ఫార్మ కంపెనీలో పని చేస్తున్నాడు. బాచుపల్లిలో ఉండే తన స్నేహితుడు బసు శుక్రవారం రాత్రి విందు ఇస్తానంటే నలుగురూ కారులో వెళ్లారు. విందు ముగించుకొని శనివారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా ప్రగతినగర్ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. సుదీప్, ఉత్యా అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలకు గురైన సౌరవ్, నిలాద్రిలను పోలీసులు కేపీహెచ్‌బీ కాలనీలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా తన అమెరికా ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రమాదం జరిగిన సమయంలో సుదీప్ కారును నడిపినట్లు సోమదీప్ పోలీసులను తప్పుదారి పట్టించాడు. సుదీప్ చనిపోవటంలో ఆ నేరం తనపైకి రాదని భావించాడు. అయితే పోలీసులు లోతుగా విచారణ జరపటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సోమదీప్ కోసం గాలిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని ప్రగతి నగర్లో శనివారం తెల్లవారుజామున సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు సుదీప్, ఇట్యాగాలుగా పోలీసులు గుర్తించారు. నగరంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో వారిరువురు ఇంజినీర్లుగా పని చేస్తున్నారన్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం వారి మృతదేహలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు