![Old Man Commits Suicide In Pragathi Nagar Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/1/old-man.jpg.webp?itok=XTYwbzu0)
సాక్షి, నిజాంపేట్: ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రాణం తీసుకోవాలనుకున్న ఓ వృద్ధుడు మొదట తన శరీరాన్ని బ్లెడ్‌తో కోసుకుని చనిపోవాలనుకున్నాడు. అయితే ఎంతకూ ప్రాణం పోకపోవడంతో చివరకు అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రగతినగర్‌లోని అదిత్య లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నెంబర్ 302లో కె.రామలింగేశ్వర్‌రావు(70), హైమవతి భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. రామలింగేశ్వర్‌రావుకు రెండుసార్లు బైపాస్ సర్జరీ అయింది. బీపీ, షుగర్‌తో పాటు ఆహారం సరిగా తినలేకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి.
చదవండి: దారుణం: కుటుంబంపై కత్తులతో దాడి.. ముగ్గురి మృతి
నెల రోజులుగా ఆహారం సరిగా తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోయి సోమవారం రాత్రి సుమారు 8.45 గంటలకు టెర్రస్ పైకి వెళ్లాడు. అక్కడ తన శరీరంపై బ్లెడ్‌తో గాట్లు పెట్టుకున్నాడు. అప్పటి నుంచి పైనే ఉన్న రామలింగేశ్వర్‌రావు అర్ధరాత్రి సుమారు 12.45 గంటలకు అపార్ట్‌మెంట్ పైనుంచి దూకాడు. మంగళవారం ఉదయం అపార్ట్‌మెంట్ వాచ్‌మెచ్ ద్వారా సమాచారం తెలుసుకున్న అపార్ట్‌మెంట్ వాసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు రామలింగేశ్వర్‌రావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
చదవండి: ఆమెలాగా అతగాడి పరిచయం.. అశ్లీల వీడియోలను పంపించాలని..
ఒంటరి తనం కూడా కారణామా?
రామలింగశ్వేరావు, హైమవతి ఇద్దరే ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కుమారుడు స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమార్తెలు మాత్రం నగరంలోనే ఉంటున్నారు. వీరందరూ ఉన్నత స్థితిలోనే ఉన్నారు. అప్పడప్పుడూ వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్లేవారు.
Comments
Please login to add a commentAdd a comment