
సినిమా బృందం ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు జూనియర్ ఆర్టిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. జూనియర్ ఆర్టిస్టులు బాలకృష్ణ సినిమా షూటింగ్‌కు వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాచుపల్లికి వ్యాన్‌లో బయలుదేరగా ప్రగతి నగర్ చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.