junior artists
-
బాలకృష్ణ బృందానికి రోడ్డు ప్రమాదం.. ఆర్టిస్టులకు తీవ్ర గాయాలు
సినిమా బృందం ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు జూనియర్ ఆర్టిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. జూనియర్ ఆర్టిస్టులు బాలకృష్ణ సినిమా షూటింగ్‌కు వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాచుపల్లికి వ్యాన్‌లో బయలుదేరగా ప్రగతి నగర్ చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
సీమ బిడ్డల సినిమా కథ.. 60 సినిమాలు, 100కు పైగా సీరియళ్లు.. ‘పోలీస్’ దావూద్
వారిది ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. సినిమా రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. అవకాశాలను అందిపుచ్చుకున్నారు. కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా వెరవక.. లక్ష్యం వైపు అడుగులు వేశారు. సన్నివేశం ఏదైనా అందుకు తగ్గ వేషం వేసి అందరినీ అలరిస్తున్న వారు కొందరు.. తమదైన కళతో నటీనటుల మోముకు అందాలు అద్దుతూ సంపూర్ణత్వాన్ని తెస్తున్న వారు మరొకరు. చలనచిత్ర రంగంలో రాణిస్తున్న సీమ బిడ్డల గురించి ప్రత్యేక కథనం.. మేకప్ బాద్షా.. జమ్మలమడుగు (వైఎస్సార్ కడప): మైలవరం మండలం దొమ్మరనంద్యాలకు చెందిన గోవిందపల్లె రోషన్ మహబూబ్‌బాషా సినిమా రంగంలో మేకప్‌మెన్‌గా మంచి గుర్తింపు పొందాడు. ఇతని సినీరంగ ప్రవేశం ఆసక్తికరంగా సాగింది. బాల్యంలో చదువు వంటబట్టకపోవడంతో మోటార్ మెకానిక్‌గా పని చేస్తున్న తన మామ గఫూర్ వద్ద పని నేర్చుకుందామని పులివెందుల వెళ్లాడు. రెండేళ్లపాటు అక్కడ పని నేర్చుకున్నాడు. ఆ సమయంలో పులివెందులకు చెందిన రమణబాబు అనే వ్యక్తి మద్రాసు నుంచి కొందరు సినీ నటులను పిలిపించి పులివెందులలో ఓ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ సినిమా రంగానికి చెందిన వారిని పరిచయం చేసుకుని వారి వెంట 1983లో మద్రాసు వెళ్లాడు. తొలుత నటుడు రంగనాథ్ వద్ద అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా చేరాడు. రెండేళ్ల తర్వాత ఏఎం రత్నం, విజయశాంతి వద్ద అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా పనిచేశాడు. దేవాలయం, వందేమాతరం, అరుణ కిరణం తదితర సినిమాల్లో విజయశాంతికి మేకప్ వేశారు. ముత్యాల సుబ్బయ్య ప్రోత్సాహంతో.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన సినిమాలకు చీఫ్ మేకప్‌మెన్‌గా పనిచేశారు. అందులో ప్రధానంగా పవన్‌కల్యాణ్‌తో నిర్మించిన గోకులంలో సీత, ఒకేమాట, దీవించండి, మామగారు తదితర సినిమాలకు మేకప్‌మెన్‌గా పనిచేశారు. బాలకృష్ణతో మహబూబ్‌బాషా.. సుమన్‌కు మేకప్ వేస్తున్న మహబూబ్‌బాషా (ఫైల్) బాలకృష్ణకు సైతం బాలకృష్ణ నటించిన పలు సినిమాలకు అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా పనిచేశారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, పవిత్రప్రేమ, కృష్ణబాబు, ఆదిత్య 369, భైరవద్వీపం, పట్టాభిషేకం, అనసూయమ్మగారి అల్లుడు, తిరుగబడ్డ తెలుగుబిడ్డ, అఖండ సినిమాలలో అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా పనిచేశారు. నటుడు రంగనాథ్‌తో ప్రారంభించిన మేకప్‌మెన్ ప్రస్థానంలో మొత్తం 250 సినిమాలకు మేకప్‌మెన్‌గా పనిచేశానని మహబూబ్‌బాషా తెలిపాడు. ప్రధానంగా బాలకృష్ణ, చిరంజీవి, సుమన్, విజయశాంతి వంటి ప్రముఖ నటీనటుల వద్ద మేకప్‌మెన్‌గా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని చెబుతున్నాడు. పోలీసు పాత్రలో దావూద్ పోలీసు పాత్ర.. దావూద్ ప్రత్యేకత ప్రొద్దుటూరు: ప్రముఖ హీరోలు నటించిన సినిమాల్లో, అన్ని తెలుగు ఛానళ్లలో వస్తున్న సీరియల్స్‌లో నటిస్తున్న నటుడు దావూద్ ప్రొద్దుటూరుకు చెందిన వాడు. ఈయన ఇప్పటి వరకు సుమారు 60 సినిమాలు, 100కు పైగా సీరియల్లలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నాడు. ప్రొద్దుటూరు పట్టణంలోని ఖాదర్ హుసేన్ మసీదు వీధికి చెందిన మహమూద్, అఫ్తాబ్‌ల కుమారుడు దావూద్ చిన్నప్పటి నుంచి సినిమా రంగంపై మక్కువ పెంచుకున్నాడు. 2011లో కడప మదీనా ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ పూర్తి చేశాడు. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌కు వెళ్లి చాలా కాలం ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ► 2013లో రిలీజైన చిరంజీవి సినిమా ఖైదీనంబర్ 150లో దుబాయి కూలి పాత్రలో దావూద్ రాణించాడు. ఈ ఏడాది దసరాకు రిలీజ్ కానున్న చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాలో ఎస్ఐ పాత్రలో, హీరో ఆది సాయికుమార్ క్రేజీ ఫెలో సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో, కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మీటర్ సినిమాలో సీఐ పాత్రలో, సుధీర్‌బాబు హీరోగా భవ్యా క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ఎస్ఐ పాత్రలో, నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న కుమారి శ్రీమతి సినిమాలో బ్యాంకు ఆఫీసర్ పాత్రలో దావూద్ నటించిన సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ► తాజాగా విడుదలైన విరాట పర్వం సినిమాలో మఫ్టీ పోలీసు పాత్రలో, శేఖర్ సినిమాలో ఎస్ఐ పాత్రలో, శ్యాంసింగరాయ్లో కానిస్టేబుల్ పాత్రలో, ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటిష్ పోలీసు పాత్రలో, రిపబ్లిక్ సినిమాలో రిపోర్టర్‌గా, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో జైలర్‌గా, శ్రీకారం సినిమాలో మేనేజర్‌గా నటించాడు. ► ప్రముఖ తెలుగు ఛానళ్లలో వస్తున్న ఊహలు గుసగుసలాడే, సూర్యకాంతం, జానకి కలగనలేదు, వైదేహి పరిణయం, మౌనపోరాటం తదితర సీరియల్స్‌లో పలు పాత్రలు దావూద్ పోషిస్తున్నాడు. హీరో, హీరోయిన్లకు సీన్ వివరిస్తున్న డైరెక్టర్, తదితరులు శభాష్.. మహేష్ పులివెందుల రూరల్: పులివెందుల మండలం తుమ్మలపల్లె గ్రామానికి చెందిన మహేష్ గాయకుడిగా, నటుడిగా సామాజిక మాధ్యమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటున్నాడు. బాబయ్య, ఇమాంబిల కుమారుడు మహేష్. డిప్లొమా పూర్తి చేసిన ఈ యువకుడు ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాం, యూట్యూబ్ చానెళ్లు, సీరియళ్లలో పాటలు పాడుతూ, నటిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఎంతోమంది అభిమానులను సైతం సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఇతను 25 లఘుచిత్రాలు, 30 సీరియల్స్‌తోపాటు స్పైడర్, నేనే రాజు – నేనే మంత్రి, నేను లోకల్, ద్వారక, మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలలో చిన్న పాత్రల్లో నటించినట్లు తెలిపాడు. సినిమా రంగంలో నటుడిగా స్థిరపడాలనేదే నా కోరిక’ అంటున్న ఈ యువ నటుడు మరింతగా రాణించాలనేదే ఈ ప్రాంత వాసుల ఆకాంక్ష. వారం ప్రవీణ్‌కుమార్ వేణుమాధవ్ మళ్లీ వచ్చాడు! కడప సిటీ: హాస్యనటుడిగా సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ తనువు చాలించి రెండేళ్లకు పైగా అయింది. అయితే అదే ముఖ కవళికలు, పోలికలతో కడపకు చెందిన వారం ప్రవీణ్‌కుమార్ వేణుమాధవ్‌ను మరిపిస్తున్నాడు. జూనియర్ వేణుమాధవ్‌గా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం శాంతకుమార్ దర్శకత్వంలో సాయికుమార్ హీరోగా నిర్మిస్తున్న నాతో నేను అనే సినిమాలో హాస్యనటుడిగా ప్రముఖ నటుడు భద్రం, సాయిశ్రీనివాస్‌ల సరసన నటిస్తున్నాడు. తొలుత టిక్‌టాక్ షోలలో కామెడీ సీన్లు చేసి యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ వచ్చాడు. అచ్చం వేణుమాధవ్ లాగే ఉన్నాడని కొన్ని ఛానళ్లు గ్రహించి టీవీ షోలలో కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల కాలంలో మృతి చెందిన సినీ నటులకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులతో హైదరాబాదులో ప్రముఖ ఛానల్లో షో నిర్వహించారు. ఆ షోలో ప్రవీణ్‌కుమార్ పాల్గొని అచ్చం వేణుమాధవ్‌లా హావభావాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు. కుటుంబ నేపథ్యం.. కడప విశ్వనాథపురానికి చెందిన వారం సుబ్బరాయుడు, శ్యామలాదేవి దంపతుల రెండో కుమారుడు వారం ప్రవీణ్‌కుమార్. ఇతను ఎంఏ బీఈడీ చదువుకున్నాడు. ప్రస్తుతం ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ‘నేను వేణుమాధవ్ పోలికలతో ఉండడం నిజంగా నా అదృష్టమని, దాంతోనే నాకు సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం దక్కుతోందని’ తెలిపాడు. తన సోదరి, బావ, సతీమణి సహకారంతోనే తాను రాణిస్తున్నాని చెప్పాడు. సినిమాల్లో అవకాశం రావడానికి ఆయన పోలికలు ఉండడమే ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు. కడపకు చెందిన ఈ జూనియర్ వేణుమాధవ్ భవిష్యత్తులో తన నటనా చాతుర్యంతో అందరి మన్ననలు పొందాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. -
హీరోలు పారితోషికం తగ్గించుకోవాలి: ఫైట్ మాస్టర్
చెన్నై సినిమా: గతంలో నటుడు ఎంజీఆర్ ఎక్కువలో ఎక్కువగా రూ.1.75 లక్షలు మాత్రమే పారితోషికం తీసుకున్నారని, కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా రోజుకు రూ. 2 లక్షలు పారితోషికం డిమాండ్ చేస్తున్నారని గిల్డ్ అధ్యక్షుడు, ఫైట్ మాస్టర్ జాగ్వర్ తంగం అన్నారు. పెరుందురై గుణ దర్శకత్వం, నిర్మాణం బాధ్యతలు నిర్వహించి కథా నాయకుడిగా నటించిన చిత్రం 'మగళీర్ మాంబు'. మాన్సీ హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి రవికిరణ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. రెండు రోజుల క్రితం చెన్నైలో జరిగి న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న జాగ్వర్ తంగం మాట్లాడుతూ రూ. 100 కోట్లు తీసుకుంటున్న హీరోల నుంచి చిన్న నటీనటుల వరకు పారితోషికం తగ్గించుకుంటేనే నిర్మాతలు బాగుంటారన్నారు. గీత రచయితగా అవకాశాల కోసం వచ్చిన పెరుందురై గుణ అవి రాకపోవడంతో తనే చిత్రాన్ని రూపొందించారన్నారు. వ్యవసాయం ప్రధానాంశంగా రూపొందిన ఈ చిత్రం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: చిన్నతనంలోనే వేశ్యగా మారిన యువతి బయోపిక్.. త్వరలో ఓటీటీలోకి.. బెడ్ సీన్‌ను ఎన్నిసార్లు షూట్ చేశారు.. హీరోయిన్ ఘాటు రిప్లై var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జూనియర్ ఆర్టిస్టుల పేరుతో 95 మంది దుబాయ్‌కి.. తీరా అక్కడకు వెళ్తే..
బెంగళూరు: విదేశాల్లో అధిక వేతనంతో ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగాలను ఇప్పిస్తామని మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. 7 మందితో కూడిన అక్రమ ముఠాను అరెస్ట్ చేశారు. కొప్పళ కంప్లివాసి బసవరాజశంకరప్ప కళసద్, మైసూరు నజరాబాద్ ఆదర్శ అలియాస్ ఆది, తమిళనాడు సేలం రాజేంద్రనాచి ముత్తు, చెన్నై మారియప్పన్, పాండిచ్చేరి అశోక్, తిరువళ్లువర్ రాజీవ్, జేపీనగర చందు నిందితులని నగర జాయింట్ పోలీస్‌కమిషనర్ రమణ్‌గుప్తా తెలిపారు. ఇప్పటివరకు కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి 95 మంది మహిళలను జూనియర్ ఆర్టిస్టుల పేరుతో పాస్‌పోర్టులు తయారుచేయించి దుబాయ్‌కి పంపించారు. అక్కడ యజమానులు వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఫిర్యాదులు రావడంతో గాలింపు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 17 పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: (ప్రేమించిన అత్త కూతురు కోసం దొంగతనానికి పాల్పడి..) -
‘బోగస్ ఓట్లున్నాయి... ‘మా’ ఎన్నికలు ఆపండి’
బంజారాహిల్స్: ఓటరు జాబితాలో ఉన్న బోగస్ ఓటర్లను తొలగించిన తర్వాతే ‘మా’ ఎన్నికలు నిర్వహించాలని జూనియర్ ఆర్టిస్ట్ సంఘం నేతలు డిమాండ్ చేశారు. అక్టోబర్ 10న (ఆదివారం) జరిగే ఎన్నికల్లో 3,609 మంది జూనియర్ ఆర్టిస్టులు ఓటు హక్కు కలిగి ఉన్నారని, అయితే ఓటరు జాబితాలోని పేర్లున్న వారికి ఫోన్లు చేస్తే చాలా మంది తాము యూనియన్ సభ్యులం కాదని చెబుతున్నారని, ఇంకొందరు సమాధానం చెప్పడానికి నిరాకరిస్తున్నారని జూనియర్ ఆర్టిస్ట్ సంఘం నేతలు రవీందర్ సంకూరి, రమావేణి, అశోక్ బెజవాడ తదితరులు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బైలాస్కు విరుద్ధంగా పని చేస్తున్న వల్లభనేని అనిల్‌కుమార్, స్వామిగౌడ్, సినీ పరిశ్రమకు సంబంధం లేని శేషగిరిరావు నామినేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓటరు లిస్ట్‌ను సరి చేసి ఎన్నికలు నిర్వహించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత సెప్టెంబర్ నెలలో జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగిందని అక్టోబర్ 10న ఎన్నికలు జరుపుతున్నట్లు ఆరోజు ప్రకటించలేదని ఎజెండా లేకుండానే కేవలం నాలుగు రోజుల ముందు నోటీస్ బోర్డుపై వివరాలు ఉంచారని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్కే.మల్లిక అనే జూనియర్ ఆరిస్ట్, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనియన్‌లో రికార్డులు అడిగితే ఇవ్వడం లేదని వాటిని ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి 1,600 కార్డులలో 720 కార్డుల సభ్యుల నుంచి ఒక్కొక్కరికి రూ. 25 వేలు కార్డు రెన్యువల్ పేరుతో సుమారు రూ.1.80 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారని బైలాస్కు విరుద్ధంగా ఎలా వసూలు చేశారని ఫిర్యాదులో ప్రశ్నించారు. ఓటరు జాబితా, లెడ్జర్లు, రిసిప్ట్ బుక్‌లు, మినిట్స్ బుక్‌లు, నెలవారీ ఆదాయ వ్యవహారాలు, అసోసియేట్ కార్డు మెంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆడిటింగ్ వివరాలు ఇవన్నీ తనిఖీ చేసుకునే అవకాశం జూనియర్ ఆర్టిస్ట్‌లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
చిరంజీవి ఇచ్చిన సరుకులే ఆసరా..
జూబ్లీహిల్స్: చీకట్లను చీల్చుకుంటూ వచ్చే కిరణాలు వెండితెరపై పడగానే ఆ తెర ఒక్కసారిగా వెలుగులీనుతుంది. అదే వెండి తెర ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు రెండు నెలవుతున్నా వెలుగుకు నోచుకోవడం లేదు. దాని వెనుకున్న జీవితాలు క్రమంగా చీకట్లోకి వెళ్తున్నాయి. జూనియర్ ఆర్టిస్ట్‌లకు అడ్డాగా ఉన్న కృష్ణానగర్, ఇందిరానగర్లలో తెల్లవారుజామున 4 గంటల నుంచే సందడి మొదలయ్యేది. ఆర్టిస్టులు వందలాదిగా యూనియన్ కార్యాలయాలకు చేరుకొని తమ షూటింగ్‌కు వెళ్తూ సాయంత్రం కాగానే ఇంటికి చేరుకునేవారు. బతుకుబండి కాస్త బాగానే నడిచేది. కరోనా దెబ్బకు సీన్ రివర్స్ అయింది. సినిమానే జీవితంగా బతికేవారికి ఇప్పుడు దిక్కుతోచడం లేదు. అప్పట్లో వయసులో ఉన్న వారికి సినిమా అవకాశాలు ఎక్కువగా దొరికితే 50 ఏళ్లు పైబడిన వారికి వారానికి రెండు రోజులైనా ఏదో ఒక షూటింగ్లో పని దొరికేది. కానీ ఇప్పుడు 50 ఏళ్లు దాటిన వారి పరిస్థితి దారుణంగా మారింది. సినిమా షూటింగ్‌లు ప్రారంభం అవుతాయని చెబుతున్నప్పటికీ తమకు పెద్దగా అవకాశాలు రావేమోననే భయం వారిని వెంటాడుతూనే ఉంది. అయినా పట్టు వదలకుండా ఏదైనా అవకాశం దొరుకుతుందేమోనని ఇప్పటికీ కూడా ప్రతిరోజూ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కార్యాలయం వద్దకు ఆర్టిస్ట్‌లు వస్తూనే ఉన్నారు. తమజీవితాల్లో వెలుగుల కోసం ఎదురుచూస్తున్నారు. చిరంజీవి ఇచ్చిన సరుకులే ఆసరా.. 40 ఏళ్ల నుంచి జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 67 సంవత్సరాలు. వయసు పైబడిందని మామూలు సమయాల్లోనే అవకాశాలు అంతంత మాత్రంగా వచ్చేవి. ఇప్పుడు అది కూడా లేదు. ఈ కష్టకాలంలో కూడా మెగాస్టార్ చిరంజీవి పంపిన సరుకులే దిక్కయ్యాయి. నాకు ఇల్లు లేదు. ఈ యూనియన్ కార్యాలయాల చుట్టూ నిత్యం తిరుగుతుంటాను. పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. – కె.ప్రభావతి, యూసుఫ్‌గూడ చావైనా.. బతుకైనా ఇక్కడే.. బీకాం చదివాను. చిన్నప్పుటి నుంచే సినిమాలంటే పిచ్చి. కుటుంబ సభ్యులకు కూడా దూరమయ్యాను. వయసు పైబడిందని అవకాశాలు సరిగ్గా ఇవ్వడం లేదు. బతుకైనా చావైనా సినిమానే. 45 ఏళ్లుగా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నాను. మొదట్లో రోజుకు రూ.7 పారితోషికం తీసుకునేవాడిని.. ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైంది. ఉపాధి కరువై ఇబ్బంది పడుతున్నా. ఇల్లు కూడా లేదు. – బీఎల్. నర్సింహ, యూసుఫ్‌గూడ -
పని ఉంటే మస్తు.. లేదంటే పస్తు
సినిమా ఒక అందమైన హరివిల్లు. హరివిల్లులోని ఏడు రంగులు తళతళలాడాలంటే దాని వెనక ఇరవై నాలుగు విభాగాల్లో కొన్ని వందల మంది గడియారంలా నిరంతరం శ్రమించాలి. ప్రేక్షకుడికి సినిమా కేవలం ఉల్లాసాన్నిచ్చే వినోదం కావొచ్చు. కానీ తెర వెనక.. కొన్ని వందల మంది ఉపాధి. ప్రస్తుతం కరోనా సినిమా ఇండస్ట్రీని పని చేయనీకుండా చేసింది. అంటే చాలామందికి పని లేకుండా చేసినట్టే. రీల్ (రెక్క) ఆడితే కానీ డొక్కాడని జీవితాలు కృష్ణానగర్ వీధుల్లో తారసపడుతూనే ఉంటాయి. ‘నేనింతే’ సినిమాలో ఓ పాటలో అన్నట్టు ‘పని (షూటింగ్) ఉంటే మస్తుర మావా.. లేదంటే పస్తుర మావా’ అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. స్పాట్బాయ్, లైట్‌మేన్, జూనియర్ ఆర్టిస్ట్‌లు, ఫైటర్స్, కాస్ట్యూమ్స్, ఆర్టిస్టుల అసిస్టెంట్స్, కెమెరా డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ టీమ్, డ్రైవర్లు, మహిళా వర్కర్స్.. ఇలా 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న చిన్న స్థాయి కార్మికుల మీద కరోనా ప్రభావం పడింది. స్టూడియోలు ఖాళీగా ఉంటున్నాయి. 24 క్రాఫ్ట్స్‌లో ఎక్కువ శాతం మంది ఏ రోజు జీతం ఆ రోజు తీసుకునేవాళ్లే. అనుకో కుండా వచ్చిన ఈ బ్రేక్ వల్ల ఎందరో బడ్జెట్ పద్మనాభాల ఆర్థిక ప్రణాళికను కుప్పకూల్చింది. చెప్పాపెట్టకుండా ఊడిపడ్డ ఈ ఇబ్బంది వల్ల ఇంటి బండిని లాగడానికి ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు పలువురు కార్మికులు. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమా పూర్తికావడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాలు పడుతుంది. ఒకరోజు షూటింగ్లో ఆర్టిస్ట్ మీద కెమెరా రన్ అయ్యే ముందు కొన్ని వందల మంది అటూఇటూ పరుగులు తీయాలి. ప్రొడక్షన్ వాళ్లు సెట్లో అడుగుపెట్టడంతో లొకేషన్ పొద్దు పొడుస్తుంది. ఆ తర్వాత లైటింగ్ డిపార్ట్మెంట్, సెట్ అస్టిస్టెంట్లు ఒకరి తర్వాత ఒకరు వస్తారు. సినీ సర్వీస్ సెంటర్లనుంచి కెమెరాలు వస్తుంటాయి. దర్శకుడు తన డైరెక్షన్ టీమ్‌తో ఆ రోజు తీయాల్సిన సన్నివేశాన్ని డిస్కస్ చేసుకుంటారు. ఈలోగా ఆర్టిస్టులు వచ్చి సన్నివేశానికి అనుగుణంగా తయారయి షాట్ రెడీ అయినప్పుడు క్యారవేన్ నుంచి బయటకు వస్తారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ ఒక కాల్షీట్, అదే సాయంత్రం 9 వరకూ షూటింగ్ చేస్తే ఒకటిన్నర కాల్షీట్ కింద లెక్క కడతారు. రాత్రి పన్నెండు వరకు షూటింగ్ కొనసాగితే రెండు కాల్షీట్ల కింద లెక్క పెడతారు. ఇలా ఒక్కరోజు షూటింగ్ కాల్షీట్‌ని బట్టి చాలా విభాగాల వారికి ఏ రోజు పారితోషికం ఆ రోజు అందుతుంటుంది. కుదరని పక్షాన వారం రోజులది ఒకేరోజు పే చేస్తారు. కరోనా కారణంగా లొకేషన్లు పొద్దు పొడవట్లేదు. సెట్లు కాంతివిహీనమయ్యాయి. లొకేషన్లు ఆకలి కేకలు పెడుతున్నాయి. సెట్లో ఎప్పుడూ ఉండే సందడి ప్రస్తుతం లేదు. మళ్లీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో సరిగ్గా తెలియదు. ఇండస్ట్రీ షూటింగ్స్‌నే బతుకు‘తెర’వుగా పెట్టుకున్న వాళ్లు విలవిలలాడుతున్నారు. ‘వైరస్‌తో పోతామనే భయం కంటే ఆకలి చావులతో పోకుండా ఉండాలి కదా?’ అని కొందరు పేర్కొన్నారు. మా ‘మహిళా వర్కర్స్ యూనియన్’లో మొత్తం 130 మంది ఉన్నాం. నెలకు పది పదిహేను రోజులు పని దొరుకుతుంది. గిన్నెలు కడగడం, అవసరమైతే వంట చేయడం, భోజనాలు వడ్డించడం, వాటర్ క్యాన్లు మోయడం మా పని. ఈ 130 మందిలో కొన్నేళ్లుగా పని చేసి చేసి అలసిపోయినవాళ్లు, ఆరోగ్యం బాగాలేక పని చేయలేనివాళ్లు ఉన్నారు. మిగతావారిలో కొందరికే పని దొరుకుతుంది. ఉదయం 6 గంటలకు మొదలయ్యే కాల్షీట్ రాత్రి 7 వరకూ ఉంటుంది. రోజుకి 785 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు షూటింగ్‌లు బంద్ కావడంతో అదీ లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యూనియన్ వైపు నుంచి ఏదైనా చేద్దామన్నా మా దగ్గర అంత ఫండ్ ఉండదు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే 5 నుంచి 10 వేలు వరకూ ఇవ్వగలుగుతాం. 130 మందిలో మరీ రోజు గడవని పరిస్థితుల్లో 10 మందికి పైనే ఉన్నారు. ఇప్పుడు పని లేక పరిస్థితి దారు ణంగా ఉంది. ఎప్పుడు షూటింగులు మొదలవుతాయా అని ఎదురు చూస్తున్నాం. – టి. లలిత సినీ మరియు టీవీ ప్రొడక్షన్ మహిళా కార్మికుల సంఘం అధ్యక్షురాలు షూటింగ్స్ ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాం 24 క్రాఫ్ట్స్‌కి చెందిన అందరికీ ఇబ్బందే. వీళ్లందరిలో చాలా మందికి సినిమా తప్ప వేరే పని తెలియదు.. రాదు. అనూహ్యంగా ఎదురైన ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో చాలామందికి అర్థం కావడంలేదు. మార్చి 31 వరకూ షూటింగ్స్ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అన్ని రోజులు అంటే అన్ని విభాగాల వారికీ ఇబ్బందే. అందుకే ఈ నెల 21 నుంచి షూటింగ్స్ని మళ్లీ జరుపుకునేలా పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నాం. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ, తక్కువమంది యూనిట్‌తో షూటింగ్ జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నాం. 20 రోజులు షూటింగ్స్ లేకుండా ఉంటే సినిమా తయారవడానికి పని చేసే ప్రతి ఒక్కరికీ నష్టమే. – కొమర వెంకటేష్ జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి మా యూనియన్‌లో దాదాపు 1300 మంది ఉన్నారు. నెలలో పదిహేను రోజులే మాకు పని ఉంటుంది. అదీ అందరికీ ఉండదు. రోజుల తరబడి పనిలేనివారు కూడా ఉంటారు. ఇప్పుడు కరోనా వల్ల షూటింగ్స్ ఆగిపోయాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు వేరే ఆదాయ మార్గం కూడా లేదు. ఒక సినిమా షూటింగ్ జరగాలంటే ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, లైట్‌మెన్స్.. ఇలా కనీసం రెండొందలమందైనా సెట్లో ఉండాలి. కరోనా వైరస్ కారణంగా గుంపులుగా ఉండి పని చేయకూడదని చెప్పారు. చేతిలో పని లేదు. ఊరికి వెళదామన్నా డబ్బులు లేవు. నిర్మాతలు మాత్రం ఏం చేస్తారు. షూటింగ్స్ అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల నిర్మాతలు కూడా డబ్బులు సర్దుబాటు చేయలేని పరిస్థితి. సినిమా షూటింగ్స్ ఈ నెల 31వరకు ఆగిపోయాయి. నాకు తెలిసి మా యూనియన్‌లో దాదాపు 75శాతం మంది అద్దెలు కట్టుకునేవారే. ఒకటో తారీఖు అద్దె, పాల బిల్లు.. ఇలా కట్టాల్సినవి చాలా ఉంటాయి. చాలామంది ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. – ఎ. శ్రీనివాస్ లైట్‌మెన్ యూనియన్ అధ్యక్షుడు -
మోడల్స్‌తో వ్యభిచారం.. ఆ ఖర్చులను మీరే భరించాలి..!
ముంబై: నగరంలో గత ఐదేళ్లుగా వ్యభిచార గృహాన్ని నడుపుతోన్న క్యాస్టింగ్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇండస్ట్రీకి అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. నవీన్ కుమార్ ప్రేమ్‌లాల్ ఆర్య (32) అనే వ్యక్తి బాలీవుడ్లో క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఆయన.. స్నేహితులు అజయ్ శర్మ, విజయ్‌లతో కలిసి వ్యభిచార దందాకు తెరలేపారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని యువతులకు వలవేసి.. వారితో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టారు. గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. నవీన్‌ను అరెస్ట్ చేయడానికి ప్లాన్ వేసిన పోలీసులు కస్టమర్లా నవీన్‌కు ఫోన్ చేశారు. ఇద్దరు అమ్మాయిలు కావాలని అడిగారు. దీనికి ఓకే చెప్పిన నవీన్.. ఇండస్ట్రీలో మోడల్‌గా, ఆర్టిస్ట్‌గా పనిచేస్తోన్న ఇద్దరు అమ్మాయిలను పంపుతానని మాటిచ్చారు. అయితే.. ఒక్కో మహిళకు రూ.60 వేల క్యాష్‌తోపాటు హోటల్ ఖర్చులను కూడా భరించాలని చెప్పారు. పోలీసులు అందుకు అంగీకరించడంతో అమ్మాయిలతో కలిసి హోటల్‌కు వచ్చిన నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సెలవుపై వెళ్లి... డూప్‌గా మారి
ఒకరు బాలయ్యలా భారీ డైలాగులతో ఈరగదీస్తే.. మరొకరు ఏఎన్నార్‌లా స్టెప్పులతో స్టేజీపై కేక పుట్టిస్తారు. వాళ్లను చూస్తే నిజంగా హీరోలని చాలామంది భావిస్తారు.. భ్రమిస్తారు. ఆ మేనరిజం, హావభావాలు అచ్చు అలాగే ఉంటాయి మరి! ఆయా హీరోలకు జిరాక్స్‌లుగా, తెరపై సూపర్ డూపర్‌గా నటించిన ‘డూప్’ క్యారెక్టర్లకు ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యం ఉండేది. అయితే టెక్నాలజీ నేపథ్యంలో, గ్రాఫిక్స్ మాయాజాలంతో డూప్ క్యారెక్టర్లకు ఆదరణ, అవకాశాలు రెండూ తగ్గాయి. ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు తదితరులతో మొదలైన డూపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్: కృష్ణానగర్ అంటే బట్టలు, సెట్టింగ్‌లు, కెమెరాలు, మెస్ తదితర సామాగ్రి మాత్రమే కాదు... మనుషులను పోలిన మనుషులూ ఇక్కడ అద్దెకు దొరుకుతారు. అసలైన హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా అభిమానులను అలరిస్తారు.. అచ్చంగా వారినే అనుకరిస్తారు. సినిమాల్లో హీరోలకు డూప్‌లుగా క్యారెక్టర్ వేసే వీరు... ఖాళీ సమయాల్లో స్టేజీ షోలు, ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొని అలరిస్తుంటారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్‌కల్యాణ్... ఇలా ప్రతి ఒక్కరీ డూప్‌లు ఇప్పుడు చాలామంది కనిపిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్.. భలే హిట్ బ్లాక్ అండ్ వైట్ సినిమా ప్రపంచంలో డూప్‌లకు భలే డిమాండ్ ఉండేది. ఫైటింగ్, జంపింగ్ తదితర సాహసోపేతర సన్నివేశాలకు డూప్‌లను ఆశ్రయించేవారు. ఇక డబుల్ యాక్షన్ సినిమాల్లో డూప్ పాత్రలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు సత్యనారాయణ డూప్‌గా చేయగా, కృష్ణానగర్‌లో నివసించే మూర్తి ఏఎన్నార్‌కు డూప్‌గా పని చేశాడు. చాలా సినిమాల్లోనూ వీరు ఆయా హీరోల పాత్రల్లో కనిపించారు. ‘మనం’ సినిమాలోనూ ఏఎన్నార్ డూప్‌గా మూర్తి చేశాడు. అదే విధం గా ఇక్కడే నివసిస్తూ అక్కినేనితో కాలేజీ బుల్లోడు, కలెక్టర్ గారి అబ్బాయి తదితర సినిమాల్లో నటించిన జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఏజెంట్ ఘంటసాల అందరికీ సుపరిచితమే. ఇక చిరంజీవిని పోలి ఉండే రాజ్‌కుమార్ ఆయన డూప్‌గా సుపరిచితం. అప్పట్లో ఒక్కో హీరో రోజుకు రెండు, మూడు సినిమాల్లో చేసేవారు. ఈ నేపథ్యంలోనే చిన్ని చిన్న సన్నివేశాల్లో డూప్‌లకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేవారు. టెక్నాలజీ వచ్చింది.. ఆదరణ తగ్గింది సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ కాలం మారిపోయి.. రంగుల ప్రపంచం రావడం, దానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డూప్‌లకు ప్రాధాన్యం తగ్గింది. ప్రధానంగా డబుల్ యాక్షన్ సినిమాల విషయంలో ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒకే హీరోను ఇద్దరిగా చూపిస్తున్నారు. దీంతో డూప్‌ల అవసరం తగ్గుతూ వచ్చింది. అలాగే సాహసోపేత సన్నివేశాలను గతంలో డూప్లతో చిత్రించేవారు. అయితే ఇప్పుడు పూర్తిగా గ్రాఫిక్స్ టెక్నాలజీ రావడంతో అలాంటి వారికీ అవకాశాలు తగ్గిపోయాయి. చాలా సినిమాల్లో ఇప్పుడు గ్రాఫిక్స్‌నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. దీంతో డూపులకు చాలా మేరకు అవకాశాలు లేకుండా పోయాయి. అక్కినేనితోఅనుబంధం.. అక్కినేని నాగేశ్వరరావుకి డూప్‌గా చాలాసార్లు చేశాను. ఓ సినిమాలో అయితే 10 రోజులు షూటింగ్లో పాల్గొన్నారు. రోజుకు రూ.400 చెల్లించారు. అక్కినేని నటించిన చివరి సినిమా ‘మనం’లోనూ ఆయనకు డూప్‌గా చేసినందుకు ఆనందంగా ఉంది. – మూర్తి, ఏఎన్నార్ డూప్ అవకాశాల్లేవ్... అప్పట్లో డూప్‌లకు చాలా అవకాశాలు ఉండేవి. కానీ టెక్నాలజీ మారడంతో అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. సినిమాల్లో డూప్లతో చేయించేందుకు ఆసక్తి చూపడం లేదు. అవసరమైతే టెక్నాలజీ ద్వారా ఆ ఖాళీని భర్తీ చేస్తున్నారు. నేను 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో స్టేజీ షోల్లో బాలకృష్ణ గారిలా అందరినీ అలరించాను. ‘ఆట’ సినిమాలో బాలయ్య వేషం వేశాను. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నాను. – దివాకర్, బాలకృష్ణ డూప్ ప్రేమతో ప్రజల్లోకి... మా నాన్న సూపర్‌స్టార్ కృష్ణ దగ్గర డ్రైవర్‌గా పనిచేశారు. అలా సినీ పరిశ్రమపై ప్రేమ పెరిగింది. దీనికి తోడు పవన్‌కల్యాణ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనలా వేషం వేసేవాడిని. ఈ క్రమంలో ‘అంతర్వేది టు అమలాపురం టైటానిక్ షిప్’ పేరుతోఈ మధ్య విడుదలైన సినిమాలో గబ్బర్ సింగ్ వేషం వేశాను. అలాగే చాలా స్టేజీ షోల్లో పాల్గొన్నాను. హీరోలపై ప్రేమతో మేము ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల ఆదరాభిమానాలు పొందగల్గుతున్నాం. – బాబీ, పవన్‌కల్యాణ్ డూప్ సెలవుపై వెళ్లి... డూప్‌గా మారి నేను కాకినాడ నగర పాలక సంస్థలో ఉద్యోగం చేసేవాడిని. సినిమాలంటే చాలా ఇష్టం. మోహన్‌బాబు సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఆయనలా డైలాగులు చెప్పడం, హావభావాలు పలికించడంతో అచ్చం మోహన్‌బాబులా చేస్తున్నానని అనేవారు. దీంతో నన్ను నేను మోహన్‌బాబులా మార్చుకున్నాను. ఉద్యోగానికి సెలవు పెట్టి, సినీ అవకాశాల కోసం ప్రయత్నించాను. అలా చెన్నైలో మోహన్‌బాబును కలుసుకున్నాను. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. రెండు, మూడు సినిమాల్లో డూప్‌గా మోహన్‌బాబు అవకాశం కల్పించారు. ఇక ఆయన కుమార్తె మంచు లక్ష్మీ తాను నిర్వహించిన ‘లక్ష్మీ టాక్ షో’ ద్వారా నన్ను మోహన్‌బాబు డూప్‌గా ప్రపంచానికి పరిచయం చేశారు. ఇవన్నీ మరిచిపోలేని సంఘటనలు. – చావలివిశ్వేశ్వర్రావు, మోహన్‌బాబు డూప్ -
రంగుల కల
-
పవన్ ఒక్కరికే ఫ్యాన్స్ ఉన్నారా..
-
పవన్ ఒక్కరికే ఫ్యాన్స్ ఉన్నారా..
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు పవన్ కల్యాణ్‌పై చేసిన ఆరోపణలకు మహిళా జూనియర్ ఆర్టిస్టులు క్షమాపణలు చెప్పారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’లపై మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ శృతి తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు వందల కోట్లతో అమరావతిలో ఇల్లు కడుతున్నారని, మసాజ్‌కు బెంగాళీ అమ్మాయిలు కావాలని, మహిళల సమస్యలను ఏమాత్రం పట్టించుకోరని పవన్‌పై ఘాటు విమర్శలు చేశారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. పవన్ ఒక్కరికే అభిమానులు ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఫ్యాన్స్‌ను అదుపులో ఉంచుకోవాలంటూ సూచించారు. సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడటానికి తాము ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నామని, అభిమానుల పేరుతో కొందరు బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానుల పేరుతో ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, కో ఆర్డినేటర్ల విధానాన్ని నిర్మూలించాలని, అప్పుడే మహిళా ఆర్టిస్టులకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. -
విశాఖలో జూనియర్ ఆర్టిస్టుల నిరసన
-
కృష్ణానగరే మామ..కష్టాల కడలే!
లైఫంతా సినిమా మామ సినిమాయే లైఫురా మామ...కళ్ల నిండా కలలతో జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్‌లో కనిపిస్తారు.ఇప్పుడు వారికి కలలొచ్చే పరిస్థితి లేదు. కంటి నిండా కునుకు లేదు. పెద్ద నోట్ల రద్దుతో షూటింగులు కుంటుపడి, పని లేక కిస్తులు, పస్తులతో సతమతమవుతున్న జూనియర్ ఆర్టిస్టులపై ఓ రిపోర్ట్. హైదరాబాద్‌లో సినీ శ్రమజీవులు ఉండే కృష్ణానగర్ - ఇందిరా నగర్ - గణపతి కాంప్లెక్స్... సినిమాల్లో బోల్డంత మంది జనాలు నిలబడే సీన్స్‌లో కనిపిస్తారే (జూనియర్ ఆర్టిస్టులు)...ఈ మూడు ఏరియాలూ వాళ్ల అడ్డా. ఎప్పుడూ ఈ ఆర్టిస్టులతో ఈ మూడు ఏరియాలూ కిటకిటలాడుతుంటాయ్. గత రెండు వారాలుగా కూడా జనం కిటకిటలాడుతున్నారు. కానీ, వారి మానసిక స్థితి మాత్రం మారిపోయింది. ఎవరి ముఖాల్లోనూ కళలేదు. ‘పెద్ద నోటు పోటు’ని తట్టుకోలేకపోతున్నారు. చాలావరకూ షూటింగ్స్ ఆగిపోయాయి. జరుగుతున్న కొద్ది షూటింగ్స్‌లోనూ... ఇంతమందికీ ఉపాధి లేదు. దాంతో, వీళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుటి సరదా మాటలు లేవు.. జోష్ లేదు. పెద్ద నోట్లు ఉపసంహరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చిన్న కార్మికులను ఇబ్బందుల్లో పడేసింది. సమస్య ఏంటంటే... ఇరకాటంలో చిన్నవాళ్లు పాత నోటు స్థానంలో కొత్త నోటు రావడం, పాత నోట్లను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, బ్యాంకులో డబ్బున్నా కావల్సినంత తీసుకోలేకపోవడంతో చిన్న నిర్మాతలు ఇరకాటంలో పడిపోయారు. డబ్బులు సర్దుబాటు చేయలేక షూటింగులు ఆపేశారు. వాస్తవానికి పెద్ద సినిమాలు ఆరేడు నిర్మాణంలో ఉంటే.. చిన్న సినిమాలు పదుల సంఖ్యలో సెట్స్‌పై ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులకు ఈ చిన్న, మధ్యశ్రేణి సినిమాలే కొండంత అండ. తీరా ఇప్పుడు దానికి గండి పడింది. అసలింతకీ ఈ జూనియర్ ఆర్టిస్టులకు అవకాశాలు ఎలా వస్తుంటాయి? మొన్నటి దాకా పరిస్థితి ఎలా ఉంది? ఆ విషయానికొస్తే... క్లాస్... మధ్యస్థం... మాస్! దాదాపు అన్ని ఉద్యోగాల్లోనూ గ్రేడులున్నట్లే.. ‘జూనియర్ ఆర్టిస్టు’లకు కూడా గ్రేడులుంటాయి. ‘ఎ’, ‘బి’, ‘సి’ అని మూడు గ్రేడ్లు. ‘ఎ’ అంటే క్లాస్, ‘బి’ అంటే మధ్యస్థం, ‘సి’ అంటే పక్కా లోకల్. వీళ్లల్లో ‘ఎ’ క్లాస్వాళ్లు భారీ సినిమాల్లో వచ్చే ఫంక్షన్ సీన్స్, ఇతరత్రా సన్నివేశాల్లో చేస్తారు. ఇక, కాలేజీ, కోర్టు వంటి సన్నివేశాలకు ‘బి’ గ్రేడ్వాళ్లు పనికొస్తారు. పక్కా ఊర మాస్ సీన్స్‌ని ‘సి’ గ్రేడ్ వాళ్లు చేస్తారు. ‘‘సినిమాల్లోని కథ, షూటింగ్ అవసరాన్ని బట్టి వీళ్లల్లో ఎ, బి గ్రేడ్లవాళ్లకు సగటున నెలలో 15 నుంచి 20 రోజులు షూటింగ్ ఉంటుంది. ‘సి’ వాళ్లకు 5 నుంచి 10 రోజులు ఉండడం గగనం’’ అని తెలుగు జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలుకూరి సత్యనారాయణ ‘సాక్షి’తో అన్నారు. తాజా నోట్ల మార్పు పరిణామం కారణంగా హైదరాబాద్‌లో ఇప్పుడు ఈ మూడు గ్రేడ్ల వాళ్లకూ సరిగ్గా పని లేదని తెలిపారు. బ్రేక్‌కి బ్రేక్ ఎప్పుడో? తెలుగు జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో సభ్యుల సంఖ్య దాదాపు 2,500. షూటింగ్‌లన్నీ జోరుగా జరు గుతూ ఫిల్మ్‌నగర్ కళకళలాడుతున్నప్పుడే వీళ్లందరికీ పని దొరకడం కష్టం. అలాంటిది... ఇప్పుడు షూటింగ్‌లకు ‘కరెన్సీ దెబ్బ’ పడ్డాక మరీ కష్టమైంది. హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్ ‘కాటమరాయుడు’, కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా, మరికొన్ని భారీ సినిమాలు మినహా మెజారిటీ ఛోటా సినిమా షూటింగులకు బ్రేకులు పడ్డాయి. పాత నోట్లు రద్దు చేసిన తర్వాత కొన్ని రోజులు ‘బాహుబలి-2’ షూటింగ్ జరిగింది. దాంతో సినిమా ప్రధాన షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాలో వేల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది ఇలా ఉంటే, కొన్ని సినిమాలు విదేశాల్లో షూటింగ్ జరుపుకొంటున్నాయి. సంక్రాంతి పండగకు వచ్చే సినిమాల్లో కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం మీద జూనియర్ ఆర్టిస్టులకు ఈ మధ్య ఎప్పుడూ రానంత ‘లాంగ్ బ్రేక్’ వచ్చింది. మరి.. ఈ బ్రేక్‌కి బ్రేక్ పడేదెప్పుడో? సిక్స్ టు సిక్స్ జాబ్ ఏ జాబ్ అయినా 9 టు 6 ఉంటుంది. కానీ, జూనియర్ ఆర్టిస్టులది మాత్రం పన్నెండు గంటల కాల్షీట్. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ చేయాల్సిందే. ఆరు దాటిందంటే మాత్రం ఆ రోజు వారీ వేతనానికి, అదనంగా మరో సగం చేర్చి మొత్తం చెల్లిస్తారు. రాత్రి తొమ్మిది గంటల వరకూ షూటింగ్ జరిగినప్పుడు భోజనం పెడతారు. భోజనం లేకపోతే వంద రూపాయలిస్తారు. ఒకవేళ రాత్రి తొమ్మిది గంటలు కూడా దాటితే అప్పుడు ‘డబుల్ కాల్షీట్’కి (డబుల్ పేమెంట్) ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, ‘కన్వేయన్స్’ (అంటే రానూ పోనూ ఛార్జీలు) కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ‘యూనియన్’ రూల్ ప్రకారమే జరగాలి. అయితే, ‘‘కన్వేయన్స్ విషయంలో కొన్ని కంపెనీలు ఫర్వాలేదు. కానీ, కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లు మాత్రం ఇవ్వడం లేదు. రూల్ ప్రకారంగా అయితే రూ. 150 ఇవ్వాలి’’ అని ఓ జూనియర్ ఆర్టిస్ట్ బాధ వెళ్లగక్కారు. అన్నం పెట్టే నిర్మాతను అర్థం చేసుకోవాలి! ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది కావడంతో షూటింగ్ పెట్టుకున్నా, ‘క్యాష్’ ఇవ్వలేని పరిస్థితిలో నిర్మాత ఉన్నాడు. దాంతో లావాదేవీలన్నీ ‘చెక్’ రూపంలోనే జరుగుతున్నాయ్. ఇచ్చిన చెక్ చెల్లిందా ఓకే. చెల్లకపోతే ఆ కంపెనీ చుట్టూ తిరగక తప్పదు. జూనియర్ ఆర్టిస్టుల విషయంలో ఈ బాధ్యత అంతా యూనియనే తీసుకుం టుంది. ఒకవేళ ఏ నిర్మాత అయినా షూటింగ్ పెట్టుకోవా లనుకుంటే, చెక్ తీసుకోవడానికి యూనియన్ అంగీకరి స్తోంది. యూనియన్ ఆమోదించింది కాబట్టి... ఒకటీ రెండు రోజులు దొరికే పనిని కాదనకుండా ఒప్పుకుంటు న్నారు చిన్న కళాకారులు. ‘‘అన్నం పెట్టే నిర్మాతను అర్థం చేసుకోవాలి. అందుకే ‘చెక్’ని ఆమోదిస్తున్నాం’’ అని తెలుగు జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలు కూరి సత్యనారాయణ తెలిపారు. వెరసి, మొన్న నవంబర్ 8 తర్వాత నుంచి చేతి నిండా పని లేక, చేతుల్లో డబ్బుల్లేక ఆర్థిక ఇబ్బందులతో చిన్న కళాకారులు బతుకు బండిని భారంగా లాగుతున్నారు. - ‘సాక్షి’ సినిమా డెస్క్ ‘‘మాదంతా క్యాష్ అండ్ క్యారీ. పాత నోట్ల రద్దుతో కొన్ని నిర్మాణ సంస్థలు చెక్కులిస్తామంటున్నాయి. ఒకవేళ ఆ చెక్కులు బౌన్స్ అయితే? సినిమా ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాలి. నెలకోసారి బిల్ చెల్లించే విధంగా కొన్ని మెస్‌లు షూటింగులకు టిఫిన్స్, మీల్స్ సప్లై చేస్తున్నాయి కానీ, షూటింగులు తగ్గడంతో వాళ్లకూ వ్యాపారం లేదు. మొత్తం మీద యాభై శాతం అమ్మకాలు తగ్గాయ్. ఇప్పుడు జనాల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. వంద నోటున్నోడు ఖర్చు పెట్టడానికి, తినడానికి కూడా ఆలోచిస్తున్నాడు. భారీ ఉద్యమాలు, బంద్‌లు కూడా మా వ్యాపారాలపై ఇంత ప్రభావం చూపలేదు’’ - రత్నం, ‘మంగా’ టిఫిన్ సెంటర్ ఓనర్, కృష్ణానగర్ ‘‘ఎక్కువగా చిన్న సినిమా షూటింగులకు నోట్లు బ్రేకులు వేశాయి. దాంతో చాలా మంది ఖాళీనే! ‘షెడ్యూల్ క్యాన్సిల్ అయితే నిర్మాత నష్టపోతాడు. లెక్కలు తర్వాత... ముందు షూటింగ్ చేయండి’ అని ప్రొడక్షన్ మేనేజర్లు అంటున్నారు. లేటైనా డబ్బులు ఇస్తారనే నమ్మకంతో మిగతావాళ్లు షూటింగులకు వెళ్తున్నారు. లేదంటే పాత నోట్లు తీసుకుంటున్నారు.’’ - నారాయణ, ఓ జూనియర్ ఆర్టిస్ట్ లోకల్ కన్నా ముంబై మోడల్స్‌కే ఎక్కువ జూనియర్ ఆర్టిస్ట్‌లు వేరు... మోడల్స్ వేరు. పబ్ సాంగ్స్, విదేశాల్లో తీసే పాటలకు, కాస్ట్లీ సీన్స్కూ జూనియర్ ఆర్టిస్టులకు కాకుండా మోడల్స్‌కే ప్రాధాన్యం ఇస్తారు. హైదరాబాద్ మోడల్స్కైతే రోజుకి రూ. 1,000 నుంచి 2,000 వరకూ ఉంటుంది. రానూ పోనూ ఛార్జీల కింద రూ. 150 నుంచి రూ. 200 వరకూ వస్తారు. అదే ముంబై మోడల్స్‌కి అయితే రూ. 5,000 వరకూ పారితోషికం ఉంటుంది. రానూపోనూ ఫ్లైట్ ఛార్జీలు, హోటల్లో బస - అన్నీ నిర్మాతే చూసుకోవాలని ఒక ప్రముఖ చిత్ర నిరా ్మణ సంస్థలో పనిచేస్తున్న మేనేజర్ వెంకట్ తెలిపారు. జూ.ఆర్టిస్ట్ పారితోషికం (ఒక కాల్షీట్కి) ఎ గ్రేడ్ రూ. 650 బి గ్రేడ్ రూ. 650 సి గ్రేడ్ రూ. 550 ఉదయం 6 గంటల కాల్షీట్ అయితే ‘ఏ’, ‘బి’ గ్రేడ్వారికి రూ. 650 ఇవ్వాలి, సాయంత్రం ఆరు దాటితే మరో సగం కాల్షీట్కి కూడా పే చేయాలి. ఒకవేళ రాత్రి తొమ్మిది కూడా దాటితే డబుల్ కాల్షీట్ పేమెంట్ ఇవ్వాలి. ఒకటిన్నర కాల్షీట్ కింద ‘ఏ’, ‘బీ’ గ్రేడ్ ఆర్టిస్ట్‌లకు రూ. 975, ‘సి’ గ్రేడ్ జూనియర్ ఆర్టిస్ట్‌లకు రూ. 825 దక్కుతుంది. కాస్ట్యూమ్ కాస్ట్! మామూలుగా సినిమాల్లో పెద్ద ఆర్టిస్టుల నుంచి చిన్న ఆర్టిస్టుల వరకు - ప్రతి ఒక్కరూ పాత్రను బట్టి వేసుకునే దుస్తులు నిర్మాతే సమకూర్చాలి. ఒక్కోసారి వాళ్లే తెచ్చుకుంటారు. జూనియర్ ఆర్టిస్టులు మాత్రం దాదాపు తమ సొంత బట్టలతోనే షూటింగ్స్‌లో పాల్గొంటారు. అందుకు గాను చిన్న నిర్మాత అయితే డ్రెస్‌కి రూ. 100, పెద్దవాళ్లైతే రూ. 200 వరకూ వాళ్ళకు ఇస్తారు. భోజనం ఖర్చు ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉదయం లొకేషన్‌కి వచ్చినప్పటి నుంచి షూటింగ్‌కి ప్యాకప్ చెప్పే వరకూ.. నిర్మాతే భోజన వసతి సమకూర్చాలి. రాగానే టీ లేక కాఫీ, ఆ తర్వాత టిఫిన్, మధ్యాహ్న భోజనం లోపు ఓ రెండు సార్లు టీలు, భోజనం తర్వాత సాయంత్రం టీ, స్నాక్స్ ఇలా అన్నీ ఇస్తారు. దీనికి గాను ఒక్కో జూనియర్ ఆర్టిస్ట్‌కి రోజుకి అయ్యే ఖర్చు రూ. 150 నుంచి రూ. 175 వరకూ ఉంటుంది. -
‘దేశం మారిందోయ్’ సినిమా షూటింగ్
పాలకొల్లు అర్బన్ : లక్ష్మీ చిత్రాలయ ప్రొడక్షన్ నెం.1 దేశం మారిందోయ్ చిత్రానికి సంబంధించి సన్నివేశాలను స్థానిక కృష్ణాజీ మల్టీప్లెక్స్‌లోనూ, మెయిన్‌రోడ్డులో ఆదివారం దర్శకుడు ఈశ్వరప్రసాద్ చిత్రీకరించారు. నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్లతో పాటు 105 పాత్రలున్న ఈ చిత్రంలో సగంమందికి పైగా నూతన నటీనటులే అని చెప్పారు. యముడు, మానవుడికి మధ్య జరిగే ఆసక్తికర సన్నివేశాలను ఈ నెల 27 నుంచి చిత్రీకరించనున్నట్టు తెలిపారు. దీనికోసం రూ.2 లక్షలతో కృష్ణాజీ మల్టీప్లెక్స్‌లో యమలోకం సెట్టింగ్ వేస్తున్నట్టు చెప్పారు. అలాగే వచ్చే నెల 4వ తేదీ నుంచి ఫిల్మ్ అండ్ యాక్టింగ్ స్కూల్ శిక్షణ తరగతులను స్థానికంగా ప్రారంభిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. కవురు రాంబాబు, కుక్కల అజయ్‌కుమార్, కవురు సత్యనారాయణ (గాంధీ), కడలి వెంకట నరసింహరావు, కడలి కృష్ణారావు, చిరంజీవి పాల్గొన్నారు. -
డిష్యుం డిష్యుం
-
జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్‌పై చీటింగ్ కేసు
తెలంగాణ సినిమా అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్స్ యూనియన్ కార్యదర్శి ఠాగూర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు... బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా జవహర్కాలనీలో గత ఏడాది తెలంగాణ సినిమా అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్స్ యూనియన్ను తెరిచారు. ఈ సంస్థలో చాలా మంది లక్షన్నర రూపాయలు చెల్లించి గుర్తింపు కార్డులు తీసుకున్నారు. ఈ సంస్థలో గుర్తింపు కార్డు తీసుకున్న వి.శ్రీనివాస్ అనే యువకుడి.. సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నించగా.. తన గుర్తింపు కార్డుకు విలువ లేదన్నారు. ఈ కార్డు చెల్లదని షూటింగుల వద్ద నుంచి వెనక్కి పంపివేశారు. దీంతో విషయం యూనియన్ కార్యదర్శి ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఠాగూర్ నుంచి ఎటువంటి స్పందన లేక పోవడంతో.. ఇదే యూనియన్ లో రిజిస్టర్ చేసుకున్న 83 మంది యువకులు ఇలాగే మోసపోయారని తెలుసుకున్నాడు. ఠాగూర్ తమను మోసం చేశాడని ఆరోపిస్తూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'సన్నివేశాలు చేసి, పక్కకు వెళ్లి భార్య కోసం ఏడ్చేవారు'
ఎమ్మెస్ నారాయణ మరణం జూనియర్ ఆర్టిస్టులకు తీరని లోటు. చిన్న ఆర్టిస్టులను అనుక్షణం ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆయన నాకు గురువుతో సమానం. ఆయనతో కలిసి 20 చిత్రాల్లో నటించాను. నేను హీరోగా నటిస్తున్న ‘పులిరాజా ఐపీఎస్’ చిత్రంలో సిన్సియర్ పోలీసు అధికారి పాత్రలో ఎమ్మెస్ నారాయణ నా తండ్రిగా నటిస్తున్నారు. ఈ నెల 25 నుంచి మన జిల్లాలో ఈ చిత్రం షూటింగ్ జరగాల్సి ఉంది. ఇంతలోనే ఆయన మరణించడం మమ్మల్ని తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. - పొట్టి రాంబాబు, కమెడియన్ ఆయనతో నటించిన తర్వాతే మంచి గుర్తింపు హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణతో కలిసి నటించిన తర్వాతే నాకు మంచి గుర్తింపు లభించింది. ఆయన మృతి యావత్ సినీజగత్తుకు తీరనిలోటు. ఆయన హాస్యానికి ఎంతటివారైనా దాసోహమవుతారు. నాకు పెళ్లయిన తర్వాత చాలా కాలం సినీరంగానికి దూరంగా ఉన్నాను. ఆ సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ మల్లేశ్వరి సినిమాలో ఎమ్మెస్ నారాయణతో నటించే అవకాశం ఇచ్చారు. ఆయనతో నటించేందుకు తొలుత సందేహాం వ్యక్తం చేస్తే.. నటించి చూస్తే నీకే తెలుస్తుందని త్రివిక్రమ్ నన్ను ఒప్పించారు. ఆ సినిమా ఒక రేంజ్లో నాకు గుర్తింపు తెచ్చింది. పెళ్లయిన తర్వాత నా కెరీర్‌కు మంచి పునాదిగా నిలిచింది. అప్పటినుంచీ ఎమ్మెస్ నారాయణ కాంబినేషన్‌తో నేను చేసిన ప్రతి సినిమా చాలా హిట్ అయింది. దుఃఖంలో ఉన్న సమయంలో కూడా హాస్య నటులు నవ్వుతూనే నటించాలని, అది మన వృత్తి అని ఆయన ‘దూకుడు’ చిత్రం షూటింగ్లో చెప్పారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయన భార్యకు ఆపరేషన్ చేస్తున్నారు. షాట్లో హాస్య సన్నివేశాలు చేసి, పక్కకు వెళ్లి భార్య కోసం ఏడ్చేవారు. మళ్లీ షాట్‌కు సిద్ధమయ్యేవారు. ఒక అన్నలా నాకు నటనలో సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలసివేసింది. - హేమ, ప్రముఖ సినీ నటి - రాజోలు పాఠాలు చెబుతూనే అందరినీ నవ్వించేవారు ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మాకు ఎమ్మెస్ నారాయణగారు తెలుగు లెక్చరర్. చేతిలో పాఠ్యపుస్తకం లేకుండానే పాఠం బోధిస్తూ తెలుగు గ్రామర్‌తో పాటు సినిమాల గురించి, కథల గురించి చెబుతూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. ఆయన క్లాస్ అంటేనే పక్క గ్రూపు వారు కూడా వచ్చి మావద్ద కూర్చొనేవారు. గది అంతా నిండిపోయేది. ‘ఎవరో మన గురించి అనుకుంటారని మనం అనుకోకూడదు. ముందుకు సాగాలి’ అని ఎమ్మెస్ నారాయణగారు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే. కళాశాలకు సెలవు పెట్టి ఆయన మద్రాసు వెళుతుంటే, ‘సినిమాపై మోజుతో భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాడు’ అని అప్పటి లెక్చరర్లు అనుకునేవారు. సినిమాల్లో నటించి ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారో, లెక్చరర్‌గా కూడా ఆయనకు అంతే పేరుండేది. కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయనే ఇన్చార్జిగా ఉండి, దేశభక్తియుత నాటకాలు ఎక్కువగా వేయించేవారు. ఆయన మృతి నిజంగా తీరనిలోటు. కళాశాల రోజులు తలచుకుంటే ఆయనే మొదట గుర్తుకు వస్తారు. - బి.సాయిరమేష్, ఇన్స్పెక్టర్, బొమ్మూరు పోలీస్ స్టేషన్, కేజీ ఆర్ఎల్ కళాశాల పూర్వ విద్యార్థి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా - రాజమండ్రి రూరల్ కోనసీమపై మక్కువ ఎమ్మెస్‌కు కోనసీమ అంటే చాలా ఇష్టం. రాజోలులో కబడ్డీ.. కబడ్డీ.. చిత్రం షూటింగ్ జరిగిన సమయంలో ఆయన తరచూ యూత్‌క్లబ్‌కు వచ్చేవారు. ‘దేవరాయ’ షూటింగ్ పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నప్పుడు రాజోలు వచ్చి కాయగూరలు కొనుక్కుని, స్వయంగా వంట చేసుకునేవారు. ‘దేవరాయ’ సినిమాలో తన క్యారెక్టర్ పేరును ‘అక్కిరాజు’గా పెట్టుకుని నాపై అభిమానం చాటుకున్నారు. ఆ సమయంలో నవ్వుతూ ‘అక్కిరాజుగారూ నేను పోయినా ఈ ‘దేవరాయ’ సినిమాలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అని అన్నారు.- ముదునూరి అక్కిరాజు, యూత్‌క్లబ్ అధ్యక్షుడు