చెన్నై సినిమా: గతంలో నటుడు ఎంజీఆర్ ఎక్కువలో ఎక్కువగా రూ.1.75 లక్షలు మాత్రమే పారితోషికం తీసుకున్నారని, కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా రోజుకు రూ. 2 లక్షలు పారితోషికం డిమాండ్ చేస్తున్నారని గిల్డ్ అధ్యక్షుడు, ఫైట్ మాస్టర్ జాగ్వర్ తంగం అన్నారు. పెరుందురై గుణ దర్శకత్వం, నిర్మాణం బాధ్యతలు నిర్వహించి కథా నాయకుడిగా నటించిన చిత్రం 'మగళీర్ మాంబు'. మాన్సీ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి రవికిరణ్ సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. రెండు రోజుల క్రితం చెన్నైలో జరిగి న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న జాగ్వర్ తంగం మాట్లాడుతూ రూ. 100 కోట్లు తీసుకుంటున్న హీరోల నుంచి చిన్న నటీనటుల వరకు పారితోషికం తగ్గించుకుంటేనే నిర్మాతలు బాగుంటారన్నారు. గీత రచయితగా అవకాశాల కోసం వచ్చిన పెరుందురై గుణ అవి రాకపోవడంతో తనే చిత్రాన్ని రూపొందించారన్నారు. వ్యవసాయం ప్రధానాంశంగా రూపొందిన ఈ చిత్రం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి: చిన్నతనంలోనే వేశ్యగా మారిన యువతి బయోపిక్.. త్వరలో ఓటీటీలోకి..
బెడ్ సీన్‌ను ఎన్నిసార్లు షూట్ చేశారు.. హీరోయిన్ ఘాటు రిప్లై
Comments
Please login to add a commentAdd a comment