‘దేశం మారిందోయ్’ సినిమా షూటింగ్
పాలకొల్లు అర్బన్ : లక్ష్మీ చిత్రాలయ ప్రొడక్షన్ నెం.1 దేశం మారిందోయ్ చిత్రానికి సంబంధించి సన్నివేశాలను స్థానిక కృష్ణాజీ మల్టీప్లెక్స్‌లోనూ, మెయిన్‌రోడ్డులో ఆదివారం దర్శకుడు ఈశ్వరప్రసాద్ చిత్రీకరించారు. నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్‌లతో పాటు 105 పాత్రలున్న ఈ చిత్రంలో సగంమందికి పైగా నూతన నటీనటులే అని చెప్పారు. యముడు, మానవుడికి మధ్య జరిగే ఆసక్తికర సన్నివేశాలను ఈ నెల 27 నుంచి చిత్రీకరించనున్నట్టు తెలిపారు. దీనికోసం రూ.2 లక్షలతో కృష్ణాజీ మల్టీప్లెక్స్‌లో యమలోకం సెట్టింగ్ వేస్తున్నట్టు చెప్పారు. అలాగే వచ్చే నెల 4వ తేదీ నుంచి ఫిల్మ్ అండ్ యాక్టింగ్ స్కూల్ శిక్షణ తరగతులను స్థానికంగా ప్రారంభిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. కవురు రాంబాబు, కుక్కల అజయ్‌కుమార్, కవురు సత్యనారాయణ (గాంధీ), కడలి వెంకట నరసింహరావు, కడలి కృష్ణారావు, చిరంజీవి పాల్గొన్నారు.