
ముంబై: నగరంలో గత ఐదేళ్లుగా వ్యభిచార గృహాన్ని నడుపుతోన్న క్యాస్టింగ్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇండస్ట్రీకి అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. నవీన్ కుమార్ ప్రేమ్‌లాల్ ఆర్య (32) అనే వ్యక్తి బాలీవుడ్‌లో క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఆయన.. స్నేహితులు అజయ్ శర్మ, విజయ్‌లతో కలిసి వ్యభిచార దందాకు తెరలేపారు.
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని యువతులకు వలవేసి.. వారితో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టారు. గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. నవీన్‌ను అరెస్ట్ చేయడానికి ప్లాన్ వేసిన పోలీసులు కస్టమర్‌లా నవీన్‌కు ఫోన్ చేశారు. ఇద్దరు అమ్మాయిలు కావాలని అడిగారు. దీనికి ఓకే చెప్పిన నవీన్.. ఇండస్ట్రీలో మోడల్‌గా, ఆర్టిస్ట్‌గా పనిచేస్తోన్న ఇద్దరు అమ్మాయిలను పంపుతానని మాటిచ్చారు. అయితే.. ఒక్కో మహిళకు రూ.60 వేల క్యాష్‌తోపాటు హోటల్ ఖర్చులను కూడా భరించాలని చెప్పారు. పోలీసులు అందుకు అంగీకరించడంతో అమ్మాయిలతో కలిసి హోటల్‌కు వచ్చిన నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment