ప్రగతినగర్ : ‘‘కలెక్టర్ నువ్వా.. నేనా! నేను సెలవులో వెళ్లకముందు ఇంటింటి సర్వేను వేగంగా పూర్తి చేయాలని, ముఖ్యంగా నిజామాబాద్ నగర పరిధిలో సమస్యలు వస్తాయని, అందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పాను. అయినా నా మాట పెడచెవిన పెట్టి ఇంత వరకు కొన్ని టీమ్‌లు.. అసలు సర్వే కూడా మొదలు పెట్టనట్లు తెలుస్తుంది.
ఇదంతా కమిషనర్‌గా నీ వైఫల్యం’’ అంటూ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంగతాయారుపై మండిపడ్డారు.మంగళవారం స్థానిక ప్రగతిభవన్‌లో ఆయన మున్సిపల్ అధికారులతో ఆహారభద్రత కార్డులు,సామాజిక పింఛన్ల సర్వేపై మాట్లాడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో 80 శాతం సర్వే పూర్తయినట్లు నివేదికలు అందుతున్నాయని,అయితే నిజామాబాద్ నగరంతో పాటు మూడు మున్సిపాలిటీలు సర్వేలో వెనుకబడ్డాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశా లు జారీ చేసిందని అన్నారు.
మున్సిపల్ సిబ్బంది మాత్రం సర్వేపై అంత సుముఖంగా లేరని సర్వే నివేదిక ద్వారా తెలుస్తుందన్నారు. ఏది ఏమైన ప్పటికీ ఈ నెల 6 నాటికి ముఖ్యంగా సామాజిక భద్రత పింఛన్ల సర్వేపూర్తి చేయాలని, 8వ తేదీ నుంచి ప్రభుత్వం పింఛన్లు అందిస్తుందన్నారు. మున్సిపల్ సిబ్బంది ప్రతి రోజు చేసిన సర్వే వివరాలు, ఇండ్ల వివరాలు క్యాంపు కార్యాలయంలో అందించాలన్నారు.
సర్వే పూర్తి అయిన వెంటనే ముందుగా నైపుణ్యం గల ఆపరేటర్లను నియమించుకొని వెంటనే సీడింగ్ మొదలు పెట్టాలన్నారు.ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే సీడింగ్‌కై ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు, హైస్పీడ్ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసి స్థానిక ఎన్‌ఐసీడీఎస్‌ఓ,రెవెన్యూభవన్,తహశీల్దార్ కార్యాలయంలో మీ-సేవ ట్రైనింగ్ సెంటర్‌లలో కంప్యూటర్‌లను ఏర్పాటు చేశారు.
‘కలెక్టర్’నువ్వా.. నేనా!
Published Wed, Nov 5 2014 3:49 AM | Last Updated on Mon, Oct 22 2018 7:36 PM
Advertisement
Advertisement