హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని ప్రగతి నగర్లో శనివారం తెల్లవారుజామున సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు.
మృతులు సుదీప్, ఇట్యాగాలుగా పోలీసులు గుర్తించారు. నగరంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో వారిరువురు ఇంజినీర్లుగా పని చేస్తున్నారన్నారు. పోస్ట్మార్టం నిమిత్తం వారి మృతదేహలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.