ప్రగతి నగర్లో ఎస్‌ఓటీ పోలీసులు గురువారం పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్లో ఎస్‌ఓటీ పోలీసులు గురువారం పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు . ఓ ఇంటి సెల్లార్ నిర్మించేందుకు అడ్డుగా ఉన్న బండరాళ్లను పగలగొట్టేందుకు పేలుడు వదార్ధాలు తీసుకుని వచ్చారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్ధలానికి చేరుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 70 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు, ఒక ఇటాచి వాహనం, రెండు కంప్రెషర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.