సాక్షి, అవరావతి: ఇసుక మైనింగ్‌పై టీడీపీ అసత్య ఆరోపణలను గనులశాఖ ఖండించింది. నిబంధనల ప్రకారమే ఇసుక మైనింగ్‌కు అనుమతులు ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ.. '' జేపీ పవర్ వెంచర్స్‌కు మాత్రమే ఓపెన్ రీచ్‌ల్లో ఇసుక మైనింగ్‌కు అనుమతి ఇచ్చాం. టీడీపీ నాయకులు ఫోర్జరీ డాక్యుమెంట్లను విడుదల చేశారు. మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోదావరిలో ఇసుక డ్రెడ్జింగ్‌కు అనుమతి ఇచ్చిందన్నది అవాస్తవం. సుధాకర ఇన్‌ఫ్రాకు ఇసుక డ్రెడ్జింగ్ అనుమతి ఇవ్వాలంటూ సీఎంవో నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. సుధాకర ఇన్‌ఫ్రా పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. అని తెలిపారు.
చదవండి: విశాఖకు చంద్రబాబు అనుకూలమా?.. కాదా?: మంత్రి అవంతి
Comments
Please login to add a commentAdd a comment