ప్రగతినగర్ : జిల్లాలో ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్ పర్య టించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎస్పీ తరుణ్‌జోషిలు సోమవారం ఏర్పాట్లను పరి శీలించారు. జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్‌లో ఉన్న ఎమ్మెల్సీ రాజేశ్వర్ ఇంటిని, విజయలక్ష్మి గార్డెన్ పరిశీలించారు.
ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మంచినీటి పథకాన్ని శంకుస్థాపన చేయనున్నందున అందుకువసరమైన పనులకు సత్వరమే పూర్తిచేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు.అందుకు ఆర్ అండ్‌బీఅతిథి గృహాన్ని సందర్శించి, ముఖ్యమంత్రి బస చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయించాలని అధికారులను ఆదేశించారు.
అతిథి గృహంలో ఏర్పాట్లు చేయండి
బాల్కొండ : ముఖ్యమంత్రి ఈనెల 7న రాత్రికి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అతిథి గృహంలో బస చేసే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ తరుణ్ జోషితో కలిసి ఆయన ఎస్సారెస్పీ అతిథి గృహాన్ని పరిశీలించారు. వీఐపీ సూట్‌ను, ఇతర సూటులను పరిశీలించారు. ఏసీలు పని చేస్తున్నాయా లేదా అని ప్రాజెక్ట్ ఈఈ రామారావును అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి స్థాయి వీఐపీ బస చేయడానికి అతిథి గృహం అనువుగా ఉంటుందా.. లేదా అని ప్రాజెక్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అతిథి గృహంలో ఉన్న పురాతన సోఫా సెట్‌లను తొలగించాలని సూచించారు. డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. భద్రత దృష్ట్యా ఎస్పీ పోలీస్‌లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ఎస్సారెస్పీలో బస చేసేది ఇం కా నిర్ణయం కాలేదన్నారు. అధికారులు మాత్రం సి ద్ధంగా ఉండాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ యాది రెడ్డి, తహశీల్దర్ పండరీనాథ్, ఎంపీడీఓ కిషన్, ఆ ర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డి తదితరులు ఉన్నారు.
ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పట్టణంలో సీఎం బహిరంగ సభ నిర్వహించనున్న జావీద్‌భాయ్ మినీ స్టేడియాన్ని కలెక్టర్, ఎస్పీలు తనిఖీ చేశారు. సభాస్థలి ఏర్పాటు, మీడియా గ్యాలరీ, ప్రవేశమార్గాలు, ప్రజలు కూర్చునే స్థలాల గురించి ఆరా తీశారు. డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, తహశీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ సునంద, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ అంజయ్య, ఆర్‌ఐ రవీందర్‌తో తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. అంగడి బజార్‌లో వాహనాల పార్కిం గ్‌ను, బాలుర పాఠశాల మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకవేళ సీఎం రోడ్డు మార్గం ద్వారా వస్తే ఆయా రహదారులలో మరమ్మత్తులు, ట్రాఫిక్ క్లియరెన్సు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో సీఎం ప్రారంభించనున్న శిలాఫలకం, పైలాన్, కాకతీయ కళాతోరణ నిర్మాణ పనులను పరిశీలించారు.
అంకాపూర్‌లో రైతులతో సీఎం ముఖాముఖి
ఆర్మూర్ అర్బన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ తరుణ్ జోషి సోమవారం పరిశీలించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని సీ ఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఖరారు చేశారు. దీంతో ఎస్పీ మండపా న్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చే శారు. సభా స్థలి, రైతులు, అధికారులు, మీ డియా విభాగాలు కూర్చునేందుకు వేరువేరుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా భద్రత చర్యలపై సమీక్షించారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంతో పాటు వచ్చే వాహనాల పార్కింగ్‌ను పరిశీలించారు. ముఖాముఖి సందర్భంగా గందరగోళం జరకుండా గ్రామస్తులను మాత్రమే అనుమతించాలన్నారు. వారిని గుర్తించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం వచ్చిపోయే మార్గంలో తీసుకునే చర్యలను గ్రామస్తులతో చర్చించారు.
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
Published Tue, Aug 5 2014 12:54 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement
Advertisement