ఆలకిస్తూ.. ఆదేశిస్తూ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కొత్త కలెక్టర్ రొనాల్డ్ రాస్ ప్రజావాణి ద్వారా ఉన్నతాధికారులు, జిల్లా ప్రజలకు తన వాణిని, బాణిని తెలియజేశారు. గురువారం విధులలో చేరిన ఆయన ఆ మరుసటి రోజు సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. శనివారం జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ బాధ్యతలను ఇతర అధికారికి అప్పగించి జిల్లాకు చేరుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజావాణి’లో పాల్గొన్నారు.
కోర్టు కేసు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి కొండల్‌రావు మినహా అన్ని శాఖల అధికారులు ప్రజావాణికి హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న బదిలీ, మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమాల నేపథ్యంలో కొద్ది రోజులు ప్రజావాణి మొక్కుబడిగా సాగింది. యువ ఐఏఎస్ అధికారి, జీహెచ్‌ఎంసీలో మంచి అధికారిగా పేరు సంపాదించిన రొనాల్డ్ రాస్ కలెక్టర్‌గా వ చ్చారన్న ప్రచారంతో సోమవారం ఒక్కసారిగా ఫిర్యాదుల తాకిడి పెరిగింది. కలెక్టరేట్ ప్రాంగణంలోని ప్రగతిభవన్ సమావేశ మందిరం చాలా రోజుల తరువాత అర్జీదారులతో కిటకిట లాడింది.
ఓపికగా వింటూ
ప్రజావాణికి కొత్తై కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఫిర్యాదుల ను ఓపికతో విన్నారు. ఉదయం నుంచే జనం బారు లు తీరడంతో ప్రగతిభవన్ హాలు నిండిపోయింది. క లెక్టర్ నేరుగా ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు సా ధ్యమైనంత వరకు అక్కడిక్కడే పరిష్కారం చూపే ప్ర యత్నం చేశారు. ఒక్కొక్కరుగా వచ్చినవారి నుంచి ఫి ర్యాదులను స్వీకరిస్తూ, వారి గోడును ఆలకిస్తూ, పరి ష్కారం కోసం అధికారులను ఆదేశిస్తూ ప్రజావాణిని నిర్వహించారు.
జక్రాన్‌పల్లి మండలంలో దళిత స ర్పంచ్‌ను గ్రామ బహిష్కరణ చేశారన్న వివాదంపై ఇటు సర్పంచ్, అటు వీడీసీ ఆధ్వర్యంలో వచ్చిన ప్రజ లు కలెక్టర్‌ను కలిశారు. ఈ విషయమై పోలీసులు చ ట్టం ప్రకారం వ్యవహరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు గ్రామంలో విచారణ జరపాలని జడ్‌పీ సీఈఓను ఆదేశించారు. మొత్తం 268 ఫిర్యాదులందగా, అందులో చాలావరకు వ్య క్తిగతమైనవే కాగా, కొన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినవి.
బారులు తీరిన జనం
సుమారుగా ఆరు నెలల తర్వాత నిర్వహించిన ప్రజావాణికి పెద్ద సంఖ్యలో జనం బారులు తీరారు. ఫిర్యాదుల సంఖ్య కూడ గణనీయంగా పెరిగింది. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నా యకులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళ సంఘాల నేత లు కూడా కలెక్టర్‌ను కలిశారు. నిజామాబాద్ నగరం 22వ డివిజన్ అయోధ్యనగర్‌కు చెందిన ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వినతి పత్రం అందచేశారు.
మున్సిపాలిటీల పరిధిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పని చే స్తున్న తమను ఆదుకోవాలంటూ రిసోర్స్ పర్సన్‌లు క లెక్టర్‌ను కలిశారు. పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామకాలను వెంటనే చేపట్టాలని అభ్యర్థులు విన్నవించారు. ప్రజావాణిలో ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ యాదిరెడ్డి, జడ్‌పీ సీఈఓ రాజారాం, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు శి వలింగయ్య, వెంకటేశం, ఇతరఅధికారులు పాల్గొన్నారు.