ప్రగతినగర్ : వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇప్పించే విషయంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం నుంచి వారం పాటు నియోజకవర్గాల వారీగా శిబిరాలు నిర్వహించనున్నారు.వికలాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ విషయంలో జాప్యం జరుగుతుండడంపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ కాకపోవడం, జారీ అయిన వాటిలోనూ వైద్యుల సంతకాలు లేకపోవడం వంటి పొరపాట్లు దొర్లాయి. దీంతో వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీనిని గమనించిన కలెక్టర్.. నియోజకవర్గాల వారీగా సదరం ప్రత్యేక శిబిరాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారంనుంచి 16వ తేదీ వరకు శిబిరాలు కొనసాగుతాయి. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఆస్పత్రులలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే గతంలో మాదిరిగా నామమాత్రంగా కాకుండా పకడ్బందీగా క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈసారి సదరం క్యాంపులకు సూపర్‌వైజర్లను, క్యాంపు ఇన్‌చార్జి వైద్యుడిని, కోఆర్డినేటర్లును నియమించారు. క్యాంప్‌ల సూపర్‌వైజర్‌లు, ఇన్‌చార్జి వైద్యులు, కోఆర్డినేటర్లుగా నియమితులైనవారు తప్పనిసరిగా ఆయా క్యాంపులను సందర్శించాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
క్యాంపులు, అధికారులు వీరే..
నిజామాబాద్ మండలంలోని వికలాంగులకోసం జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపు ఏర్పాటు చేశారు. క్యాంపు సూపర్‌వైజర్‌గా జడ్పీ సీఈఓ రాాజారాం, క్యాంప్ ఇన్‌చార్జి వైద్యుడిగా రజనీకాంత్, కోఆర్డినేటర్‌గా ఐకేపీ ఏపీఎం మోహన్ వ్యవహరిస్తారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్ మండలం మినహా మిగిలిన మండలాల వికలాంగుల కోసం డిచ్‌పల్లి సీహెచ్‌సీలో శిబిరం ఏర్పాటు చేశారు. క్యాంప్ సూపర్‌వైజర్‌గా డీపీఓ కృష్ణమూర్తి, ఇన్‌చార్జి వైద్యుడిగా రాథోడ్, కోఆర్డినేటర్ రవీందర్ సేవలందిస్తారు.
బోదన్ నియోజకవర్గంలో బోధన్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లో మెప్మా పీడీ సత్యనారాయణ సూపర్‌వైజర్‌గా, ఇన్‌చార్జి వైద్యుడిగా భానుప్రసాద్, కోఆర్డినేటర్‌గా సాయిలు ఉంటారు.
బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. సూపర్‌వైజర్‌గా డీసీహెచ్‌ఎస్ శివదాస్, ఇన్‌చార్జి డాక్టర్‌గా శ్రీనివాస్, కోఆర్డినేటర్‌గా రవీందర్ సేవలందిస్తారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్‌లో ఏర్పాటుచేసిన క్యాంప్ సూపర్‌వైజర్‌గా డీఎంహెచ్‌ఓ గోవింద్ వాగ్మారే, ఇన్‌చార్జి వైద్యుడిగా నారాయణ, కోఆర్డినేటర్ నీలిమ వ్యవహరిస్తారు.
కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. సూపర్‌వైజర్‌గా డీఆర్‌డీఏ పీడీ వెంకటేశం, ఇన్‌చార్జి వైద్యుడిగా అజయ్‌కుమార్, కోఆర్డినేటర్‌గా సుధాకర్ ఉంటారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి సీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన క్యాంప్ కోఆర్డినేటర్‌గా మండల ప్రత్యేకాధికారి గంగాధర్, ఇన్‌చార్జి వైద్యుడిగా బాలోజీ, కోఆర్డినేటర్‌గా రచ్చయ్య వ్యవహరిస్తారు.
బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ సీహెచ్‌సీ క్యాంప్ సూపర్‌వైజర్‌గా డీఎంహెచ్‌ఓ గోవింద్ వాగ్మారే, ఇన్‌చార్జి డాక్టర్‌గా మోహన్‌బాబు, కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఉంటారు.
జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్ పీహెచ్‌సీలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. క్యాంప్ సూపర్‌వైజ ర్‌గా డీసీహెచ్‌ఎస్ శివదాస్, ఇన్‌చార్జి డాక్టర్‌గా బాల మురళి, కోఆర్డినేటర్‌గా రవీందర్ వ్యవహరిస్తారు.
నేటినుంచి ‘సదరం’
Published Mon, Dec 8 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM
Advertisement
Advertisement