మెదక్ జిల్లా నారాయణఖేడ్ గురుకుల బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేయాడానికి వచ్చిన కలెక్టర్ భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఏఈని సస్పెండ్ చేశారు.
మెదక్ జిల్లా నారాయణఖేడ్ గురుకుల బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేయాడానికి వచ్చిన కలెక్టర్ భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఏఈని సస్పెండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ గురుకుల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతన భవన పనులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను పర్యవేక్షి స్తున్న ఏఈ రఘు పనితీరును ఆయనను విధుల నుంచి తొలగించారు.