raghu
-
Gudivada Amarnath: ఎన్నికలకు ముందు మావోడు.. ఓడిపోయాక పరాయివాడా..?
-
రవి తేజ కు, నాకు దేవుడు ఇచ్చిన వరం అదే
-
భద్రాద్రి పవర్ ప్లాంట్ కాపాడుకోవడం కష్టమే: కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేసిందన్నారు తెలంగాణ జన సమతి చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్. విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయన్నారు. కేంద్రం చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు.కాగా, విద్యుత్ కొనుగోళ్లపై నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డితో కోదండరాం, విద్యుత్ శాఖ అధికారి రఘు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ కొనుగోలుపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు అందజేశారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.అనంతరం, కోదండరాం మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం ప్రజల నెత్తిన నష్టాల భారాన్ని మోపింది. విద్యుత్ శాఖను రూ.80వేల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను ఎలా కాపాడుకోవడం అనేది అనుమానమే. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కేసీఆర్ తొందర పాటు నిర్ణయం వల్ల ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు చేసుకున్నారు.వెయ్యి మెగావాట్ల అదనపు విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్‌గఢ్‌తో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తర్వాత ఈ ఒప్పందం రద్దు చేసుకుంది. ఒప్పందం రద్దు కారణంగా ప్రభుత్వంపై రూ.250కోట్ల అదనపు భారం పడింది. విద్యుత్ కొనుగోలుకు ఈఆర్సీ అనుమతి ఉందనేది అబద్ధం. విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ అనుసరిస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరోవైపు విద్యుత్ శాఖ అధికారి రఘు మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి అంశాలపై మా వద్ద ఉన్న సమాచారాన్ని ఇచ్చాం. కమిషన్ ముందు పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒప్పందం ఎంఓయూ రూట్ కాకుండా కాంపిటేటివ్ రూట్‌కు ఎందుకు వెళ్లారనే సమాచారం ఇచ్చాం. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా చేయలేదు. ఈ ఒప్పందం వల్ల రూ.2600 కోట్ల నష్టం జరిగింది. వెయ్యి మెగావాట్ల ఒప్పందం జరిగితే సప్లై చేయలేదు. అదనంగా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కోసం ఒప్పందం చేసుకున్నారు. తర్వాత తప్పు తెలుసుకుని రద్దు చేసుకోవాలనుకుంటే కుదరలేదు.ఇరు రాష్ట్రాల డిస్కంల ఒప్పందాల ద్వారా ఎంఓయూ చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందలేదు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఛాయిస్ కాదు. బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వంపై సబ్జెక్టుకల్ టెక్నాలజీని రుద్దారు. 2010లో తయారు చేసుకున్న పలు యంత్రాలను టెక్నాలజీని బీహెచ్ఈఎల్.. ప్రభుత్వంపై ఆరేళ్ల తర్వాత బలవంతంగా రుద్దారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం వాడిన యంత్రాలు సరైనవి కావు అని మా అభిప్రాయం. గోదావరిలో ఫ్లడ్ ఎక్కువైతే భద్రాద్రిపై ప్రభావం పడే అవకాశం ఉంది. సాంకేతికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా భద్రాద్రి నిర్మాణం చేయడమే కాదు.. సరైన లొకేషన్ కూడా కాదు.యాద్రాద్రీ పవర్ ప్లాంట్ లోకేషన్ వల్ల రవాణా చార్జీల భారం ఎక్కువగా పడుతుంది. పర్యావరణ అంశాలను లెక్క చెయ్యకుండా భద్రాద్రి నిర్మాణం మొదలు పెట్టారు. కాంపిటేటివ్ బిడ్డింగ్‌లో రేటు తక్కువ అయ్యే అవకాశం ఉండేది. కానీ అప్పటి ప్రభుత్వం అలా చెయ్యలేదు. 2016లోనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. మా అభ్యంతరాలను రెగ్యులేటరీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం అప్పుడే కమిషన్ పీపీఏ చేయమంటే ఏడేళ్లుగా చెయ్యలేదు. ఈ ఒప్పందం వల్ల మూడు రకాల నష్టాలు జరిగాయి. రూ.635 కోట్ల నష్టం వచ్చింది. విద్యుత్ సరిగ్గా సరఫరా చేయనందుకు భద్రాద్రి ప్లాంట్ 25 ఏళ్లలో తొమ్మిది వేలు, యాదాద్రి రవాణా వల్ల రూ.1600 కోట్లకు పైగా నష్టం జరుగుతోంది. పర్యావరణ అనుమతులు లేకుండా భద్రాద్రి ప్లాంట్ మొదలు పెట్టారు’ అని చెప్పుకొచ్చారు. -
ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు సాక్ష్యాలు బట్టబయలైన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. ఆయన శాసనమండలి సభ్యత్వాన్ని రద్దుచేస్తూ, ఆ స్థానం ఖాళీ అయిందని పేర్కొంటూ సోమవారం మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలను ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించారు. ప్రత్యర్థి పార్టీ టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్సీపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపైన, పార్టీ నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.స్వయంగా హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని నాలుగుసార్లు నోటీసులు పంపించినా రఘురాజు డుమ్మాకొట్టారు. మూడునెలల కిందటే రఘురాజు భార్య, ఎస్.కోట వైస్ ఎంపీపీ ఇందుకూరి సుబ్బలక్ష్మి అలియాస్ సుధారాజు టీడీపీ నేత లోకేశ్ సమక్షంలో ఆ పార్టీ కండువా వేయించుకున్నారు. టీడీపీ ఎస్.కోట అభ్యర్థి కోళ్ల లలితకుమారితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. రఘురాజు దంపతుల నివాసంలోనే టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు.మరోవైపు కోళ్ల లలితకుమారికి, ఎస్.కోట టికెట్ కోసం విఫలయత్నం చేసిన గొంప కృష్ణకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు హైదరాబాద్‌లో లోకేశ్ సమక్షంలో జరిగిన పంచాయితీలో మండల టీడీపీ నాయకులతో కలిసి రఘురాజు పాల్గొన్నారు. ఇలా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయన శాసనమండలి సభ్యత్వాన్ని రద్దుచేయాలని ప్రభుత్వ విప్ విక్రాంత్ ఫిర్యాదు చేశారు. రఘురాజు 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 వరకు పదవీకాలం ఉన్నా పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడటంతో ఆయన సభ్యత్వం రద్దయింది. -
ఎమ్మెల్సీ రఘు రాజుపై అనర్హత వేటు
-
ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు పై అనర్హత వేటు
సాక్షి, అమరావతి: రాజకీయ ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై వైఎస్సార్సీపీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు.లోకేశ్ సహా టీడీపీ నాయకులతో అంటకాగుతున్న రఘురాజు తెరచాటు, వెన్నుపోటు రాజకీయా గుట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీతో కుమ్మకై ఎస్.కోటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్‌సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు తేటతెల్లమయ్యాయి. ఈ నేపథ్యంలో రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్సార్సీపీ విప్ పాలవలస విక్రాంత్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు తాఖీదులు పంపినా రఘురాజు డుమ్మా కొట్టేశారు. ఈనెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇవ్వగా విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రి డ్రామా ఆడారు. ఈ క్రమంలో తాజాగా రఘురాజుపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. -
తప్పించుకోవడానికి రఘురాజు ఎత్తుగడ
-
ఎమ్మెల్సీ రఘురాజు కొత్త డ్రామా..
-
పాత కక్షలు.. తల్లిని దూషించాడని..
కరీంనగర్: పాత కక్షలతో పాటు తన తల్లిని దూషిస్తున్నాడన్న విషయాన్ని మనసులో పెట్టుకుని వాసాల రఘు గురువారం సాయంత్రం అనుమల్ల వెంకటరమణ(54)పై దాడి చేసి కత్తితో పొడిచి చంపాడని కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతంలో వాసాల రఘుపై అనుమల్ల వెంకటరమణ పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టించాడని కక్ష కట్టినట్లు తెలిపారు. దీంతో పాటు వెంకటరమణ కొద్దిరోజులుగా రఘు కుటుంబంతో పాటు అతడి తల్లి విషయంలో తప్పుగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య కక్షలు పెరిగి హత్యకు దారితీశాయి. నిందితుడు రఘును అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు టూవీలర్ మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. ఇవి చదవండి: అనుమతిస్తారా.. చావమంటారా? -
కోరుట్లలో దారుణ హత్య!
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో అనుమల్ల వెంకటరమణ (54) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో నివాసముండే అనుమల్ల వెంకటరమణ డైలీ ఫైనాన్స్ నిర్వహిస్తాడు. పట్టణ శివారులోని అర్బన్ కాలనీలోనూ వెంకటరమణకు ఓ ఇల్లు ఉండటంతో అక్కడి వాళ్లకు ఇచ్చిన రుణాల వసూలుకు ప్రతిరోజూ సాయంత్రం కాలనీకి వెళ్తాడు. ఎప్పటిలాగే గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కాలనీలో డబ్బులు వసూలు చేసుకుని మోటార్ సైకిల్‌పై వెళుతుండగా, అదే కాలనీలో ఉంటున్న వాసాల రఘు (32) అనే యువకుడు వెంటపడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఛాతీ, వీపు భాగాల్లో గాయాలతో వెంకటరమణ కింద పడిపోయాడు. కిందపడిపోయిన వెంకటరమణపై రఘు మరోసారి కత్తితో దాడిచేయడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం రఘు మోటార్‌సైకిల్‌పై పరారయ్యాడు. దాడికి పాల్పడిన సమయంలో రఘును అడ్డుకోవాలని వెంకటరమణ స్థానికులను ప్రాధేయపడినా.. రఘు బెదిరింపులతో వారు దగ్గరకు రాలేకపోయారు. కాగా, హత్యకు గురైన వెంకటరమణకు కాలనీలో ఉన్న ఓ మహిళతో పరిచయం ఉన్నట్లు సమాచారం. అనంతరం సదరు మహిళ బంధువుతోనూ సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేసినట్టు.. ఈ క్రమంలోనే వెంకటరమణకు, రఘుకు మధ్య గతంలో పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వెంకటరమణను హత్యచేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'ఉడుమును పట్టుకున్నారా'.. అయితే మీరు సరాసరి జైలుకే..!
మహబూబాబాద్: మూగజీవి ఉడుమును పట్టుకుని ఉన్న ఓ యువకుడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు.. ఆ యువకుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు గురువారం అటవీ శాఖ మహబూ బాబాద్ రేంజ్ కార్యాలయంలో డోర్నకల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రేణుక కేసు వివరాలు వెల్లడించారు. కురవి మండలానికి చెందిన జీ రఘు తన చేతిలో ఓ ఉడుమును పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలను ‘ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ సభ్యుడు గౌతమ్ అటవీ శాఖ ఉన్నతాధికారులకు పంపించి ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు డోర్నకల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రేణుక, సెక్షన్ అధికారి శ్రీనివాస్.. రఘును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. -
క్రికెటర్ కాదు.. కోచ్? ఫిజియో? కానే కాదు.. ట్రోఫీ ఎత్తాడుగా! సచిన్, ద్రవిడ్ వల్ల
Who's The Man Who Lifted Asia Cup Trophy?: మ్యాచ్‌కు వర్ష సూచన.. ఒకవేళ ఫలితం తేలకుంటే రిజర్వ్ డే వరకు ఆగాలా? ఏమో.. ఏదేమైనా ఈసారి టీమిండియా గెలవాల్సిందే..! కప్పు కొట్టాల్సిందే.. ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా- శ్రీలంక ఫైనల్‌కు ముందు సగటు అభిమాని మదిలో మెదిలిన భావాలు.. కానీ వరణుడు ‘కరుణించాడు’... కాస్త ఆలస్యమైనా మ్యాచ్ జరిగేందుకు వీలుగా తానే వెనక్కి వెళ్లిపోయాడు.. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌కు రాగా.. టీమిండియా ఆటగాళ్లంతా మైదానంలో దిగారు.. ఆ తర్వాత ఏం జరిగిందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ఏకంగా ఆరు వికెట్లతో అదరగొట్టాడు. ఈ హైదారాబాదీ దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు క్యూ కట్టగా.. హార్దిక్ పాండ్యా వచ్చి మిగిలిన మూడు వికెట్లు తీసి లాంఛనం పూర్తి చేశాడు. 51 పరుగుల లక్ష్యంతో బరిలోగి దిగిన టీమిండియా 6.1 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. ఎనిమిదోసారి ఆసియా కప్ భారత్ కైవసమైంది. ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ట్రోఫీ ప్రదానోత్సవం.. గత కొంతకాలంగా ఏదైనా సిరీస్ గెలిస్తే.. సెలబ్రేషన్స్ సమయంలో జట్టులోకి కొత్తగా అడుగుపెట్టిన వాళ్లు.. లేదంటే అందరికంటే వయసులో చిన్నవాళ్లకు ట్రోఫీని అందజేయడం ఆనవాయితీగా వస్తోందన్న విషయం తెలిసిందే. తిలక్ వర్మకే ఆ అదృష్టం ఈసారి హైదరాబాదీ బ్యాటర్ 20 ఏళ్ల తిలక్ వర్మకు ఏకంగా ఆసియా కప్ రూపంలో ఆ అదృష్టం దక్కింది. ఆ తర్వాత వెంటనే మరో వ్యక్తి ట్రోఫీని ఎత్తాడు. ఫొటోలు క్లిక్‌మన్నాయి.. అతడు ఎవరు? టీమిండియా ప్లేయర్ కాదు.. అలా అని కోచ్ లేదంటే ఫిజియో.. వీళ్లెవరూ కాదు.. మరెవరు.. జట్టుకు సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న వ్యక్తుల్లో అతి ముఖ్యమైనవాడు. హి ఈజ్ రఘు రాఘవేంద్ర అతడి పేరు రఘు రాఘవేంద్ర.. త్రో డౌన్ స్పెషలిస్టు. బ్యాటర్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు వాళ్లకు స్లింగర్ నుంచి బంతులు రిలీజ్ చేసేది ఇతడే. నిజానికి బౌలర్ల కంటే మన బ్యాటర్లు ఇతడినే ఎక్కువసార్లు నెట్స్‌లో ఎదుర్కొంటారు. బ్యాటర్ల స్టైల్‌ను బట్టి.. మైదానంలో వాళ్లు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావడంలో త్రో డౌన్ స్పెషలిస్టు కీలకంగా వ్యవహరిస్తాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు.. ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లోనూ రఘుదే కీలక పాత్ర. అతడికి తోడుగా మరో ఇద్దరు త్రో డౌన్ స్పెషలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరి సిఫారసుతోనే! అయితే, టీమిండియా మొట్టమొదటి త్రో డౌన్ స్పెషలిస్టు మాత్రం రఘు రాఘవేంద్రనే! టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సిఫారసుతో భారత జట్టుతో చేరాలన్న అతడి కోరిక నెరవేరింది. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన రఘు 2011లో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ సిబ్బందిలో ఒకరిగా అడుగుపెట్టాడు. సచిన్, ధోని వంటి బ్యాటర్లకు త్రో డౌన్స్ ఇవ్వటమే కాదు.. జట్టుకు అవసరమైనపుడు అన్నీ తానై వ్యవహరించడంలో రఘు ముందుంటాడు. అన్నింట్లో ముందే ఉంటాడు ఈ విషయాన్ని గతంలో టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ట్వీట్ ద్వారా వెల్లడించాడు. ‘‘టీమిండియాలో అత్యంత కఠిన శ్రమకోచ్చే రఘు. కేవలం త్రో డౌన్స్ ఇవ్వడమే కాదు.. మ్యాచ్ టిక్కెట్ల దగ్గర నుంచి హోటల్స్, లాజిస్టిక్స్, భోజనం.. ఇలా ఏ విషయాల్లోనైనా సాయానికి తానున్నాంటూ ముందుకు వస్తాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక టీమిండియాకు అతిపెద్ద చీర్ లీడర్ అయిన రఘు.. గతేడాది టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా.. ఆటగాళ్లతో పాటు అభిమానుల మనసు గెలుచుకున్నాడు. టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్ చూసిన వారికి ఈ సంగతి గుర్తుండే ఉంటుంది. షూస్ తుడుస్తూ.. మనసులు గెలిచాడు లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. వర్షం పడింది. కాసేపటి తర్వాత వాన తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆట మొదలుపెట్టగా.. అవుట్ ఫీల్డ్ కాస్త తడిగా ఉండటంతో టీమిండియా ప్లేయర్లు ఎక్కడ ఇబ్బంది పడతారోనని బ్రష్ పట్టుకుని రంగంలోకి దిగాడు రఘు. ఫీల్డర్లు పట్టుజారి పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. బౌండరీ లైన్ దగ్గరికి వచ్చి.. వారి షూస్‌కు అంటిన మట్టిని బ్రష్‌తో క్లీన్చేస్తూ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు. అప్పుడు అతడి ఫొటో నెట్టింట వైరల్ కాగా.. ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా ఆసియా కప్ విజయం నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు అతడికి ట్రోఫీ అందించి కృతజ్ఞతాభావం చాటుకోవడంతో పాటు సముచిత గౌరవం కల్పించడంతో మరోసారి ఇలా వార్తల్లోకెక్కాడు. చదవండి: అంతా బాగానే ఉంది కానీ.. అప్పట్లో కోహ్లి, ద్రవిడ్: రోహిత్‌కు వార్నింగ్ Team india @BCCI s most hard working guy RAGHU in th team management from giving throw downs in the nets to match tickets,hotel,logistics,food or anything..always ready to help the team.keep up the good work and by the way how can u sit like this man?On one leg👌can anyone copy👇 pic.twitter.com/Ot1wjjRprf — Harbhajan Turbanator (@harbhajan_singh) December 7, 2018 Introducing the Super11 Asia Cup 2023 Champions! 💙🇮🇳#AsiaCup2023 pic.twitter.com/t0kf09xsCJ — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 Introducing the Super11 Asia Cup 2023 Champions! 💙🇮🇳#AsiaCup2023 pic.twitter.com/t0kf09xsCJ — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 Off field hero of Indian team.👏 He is India's sidearm thrower Raghu who is running around the ground with a brush in hand to clean the shoes of Indian players to avoid the possibility of them sleeping.#T20Iworldcup2022 #INDvsBAN #ViratKohli𓃵 #Rain #KLRahul𓃵 #T20WorldCup pic.twitter.com/d3BdJkHn5M — Rajan Rai (@RajanRa05092776) November 2, 2022 -
మిస్టర్ ఇడియట్ వస్తున్నాడు
హీరో రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రాన్ శర్మ హీరోయిన్. గౌరీ రోణంకి దర్శకత్వంలో జేజేఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం మాధవ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘మిస్టర్ ఇడియట్’లోని మాధవ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ‘‘మిస్టర్ ఇడియట్’ ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు గౌరీ రోణంకి. ‘‘నవంబరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత జేజేఆర్ రవిచంద్. -
కమెడియన్ రఘు కూతుళ్లను చూశారా?
టాలీవుడ్లో చాలా మంది కమెడియన్లు ఉన్నారు. వారిలో కొద్ది మంది మాత్రమే తమదైన కామెడీ టైమింగ్‌తో జనాల్లో క్రేజీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో రఘు కారుమంచి ఒకరు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. డిఫరెంట్ మేనరిజంతో అందరికి దగ్గరయ్యాడు. ఆది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రఘు.. అదుర్స్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. (చదవండి: విజయ్ దేవరకొండ డ్రస్.. అంత కాస్ట్ లీ!?) అయితే రఘు సినీ ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి సినిమాల కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. డైరెక్టర్ వి.వి వినాయక్‌తో ఉన్న స్నేహబంధం కారణంగా ఎన్టీఆర్ చిత్రాల్లో అవకాశం లభించింది. అదుర్స్‌లో మంచి పాత్ర లభించడంతో రఘు పేరు అందరికి రిజిస్ట్రర్ అయింది. అలాగే జబర్దస్త్ కామెడీ షో కూడా రఘుకి మంచి గుర్తింపు తెచ్చ పెట్టింది. ఇప్పటివరకు దాదాపు 200పైగా చిత్రాల్లో నటించాడు. లిక్కర్ దందా వరుస సినిమాలు చేసినప్పటికే రఘుకి సరైన గుర్తింపు రాలేదు. ఒకనొక దశలో సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో రఘు లిక్కర్ దందాలోకి దిగాడు. రెండేళ్ల కింద తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వైన్ షాపుల వేలంలో నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ బైపాస్ సమీపంలో ఎండు దుకాణాలు చేజిక్కించుకున్నారు. రఘునే స్వయంగా పూజలు నిర్వహించి, మద్యం అమ్మకాన్ని ప్రారంభించారు. బిజినెస్‌లో భారీ నష్టం ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రఘు పలు రకాల వ్యాపారాలు చేశాడు. అతనికి స్టాక్ మార్కెట్‌పై మంచి పట్టు ఉంది. ఒక సమయంలో షేర్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున నష్టపోయారు.‘షేర్ మార్కెట్లో భారీ నష్టం రావడంతో మూడు నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. టెన్షన్‌తో ఇంట్లో ఉన్నకంప్యూటర్, ల్యాప్‌టాప్‌ని పగులగొట్టాను’అని ఓ ఇంటర్వ్యూలో రఘు చెప్పుకొచ్చాడు. కూతుళ్ల ఫోటోలు వైరల్ రఘు స్వస్థలం తెనాలి. అతను హైదరాబాదులో పుట్టి పెరిగాడు. ఇక్కడే ఎంబీఏ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేరాడు. ఆ సమయంలోనే అతని పెళ్లి జరిగింది. రఘుకు ఇద్దరు ఆడ పిల్లలున్నారు. పెద్ద కూతురు పేరు స్వప్నిక, చిన్న కూతురు పేరు తేజస్వీ. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రఘు తాజాగా తన చిన్న కూతురు ఫోటోలను షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. దీంతో రఘు కూతుర్ల ఫోటోలు నెట్టంట వైరల్‌గా మారాయి. రఘు ఇద్దరు కూతుళ్లు ఇంజనీరింగ్ చదువుతున్నారు. View this post on Instagram A post shared by Raghu Karumanchi (@raghukarumanchi) -
కామ్రేడ్స్ పేరుతో బెదిరించి రూ.2 కోట్లు డిమాండ్
కైకలూరు: ఓ ఆక్వా రైతును నెల రోజులుగా కామ్రేడ్స్ పేరుతో సెల్ ఫోన్ల ద్వారా బెదిరించి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న డ్రైవర్ల గ్యాంగ్‌ను ఏలూరు జిల్లా కైకలూరు టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. టౌన్ స్టేషన్లో సీఐ ఆకుల రఘు, ఎస్ఐ జ్యోతిబసు వివరాలు వెల్లడించారు. కైకలూరుకు చెందిన ఐబీకేవీ ప్రసాదరాజు (వజ్రం రాజు) ప్రముఖ ఆక్వా రైతు. నెల రోజులుగా రెండు నంబర్ల నుంచి ‘కామ్రేడ్స్ మాట్లాడుతున్నాం.. మాకు రూ.2 కోట్లు ఇవ్వకపోతే నీతో పాటు నీ కొడుకును చంపేస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు. పదే పదే ఫోన్లు రావడంతో ప్రసాదరాజు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సీఐ ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను కనిపెట్టారు. మండవల్లి మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తోకల ఏసేబు (36), చిన్నం బారంబాసు (51), హైదరాబాదు, ఏజీ కాలనీ, ఎర్రగడ్డకు చెందిన శీలం హేమంత్‌కుమార్ (33), హైదరాబాదు, హిమాయత్‌నగర్‌కు చెందిన దారా మాణిక్యరావు (44)గా వారిని గుర్తించారు. వీరిలో ఏసేబు, మాణిక్యరావు కైకలూరులో ప్రసాదరాజు దగ్గర గతంలో కారు డ్రైవర్లుగా పనిచేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మాణిక్యరావు హైదరాబాదులోని తన స్నేహితుడు, కారు డ్రైవర్ హేమంత్‌కుమార్‌తో రెండు సిమ్ కార్డులు కొనుగోలు చేయించాడు. హైదరాబాదు శివారు రింగురోడ్డు నుంచి ఫోన్లు చేసి ప్రసాదరాజును డబ్బు కోసం బెదిరించారు. నిందితుల్లో ఏసేబు, బారంబాసు, హేమంత్‌కుమార్ అరెస్టు చేశారు. మాణిక్యరావును పట్టుకోవాల్సి ఉంది. -
జూనియర్ ఎన్టీఆర్ నా బాడీలో ఓ పార్ట్: కమెడియన్ రఘు
కమెడియన్ రఘు కారుమంచి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రోలర్ రఘుగా అభిమానుల్లో గుర్తింపు పొందారు. నటనకు కొద్దిగా బ్రేక్ ఇచ్చిన ఆయన అదుర్స్, లక్ష్మి, కిక్, నాయక్, ఊసరవెల్లి వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో అలరించారు. మంచి కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రఘు దాదాపు 150 చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్ల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన రఘు జూనియర్ ఎన్టీఆర్‌పై ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. రఘు మాట్లాడుతూ 'నా కెరీర్ ఇంతవరకు రావడానికి కారణం రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల లాంటి గొప్ప వ్యక్తి దొరకడం గొప్ప విషయం. జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే. వారిద్దరంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ ఏది చేయమన్నా నేను సిద్ధం. ఆయన కోసం ఏం చేయడానికైనా వెనకాడను. నా బాడీలో ఆయనొక పార్ట్‌గా మిగిలిపోయారు. ఆయన నన్నెప్పుడు పెద్దన్న అని పిలిచేవారు. మేం ఎప్పుడు కలవలేదు అనుకుంటారు. మేం కలిశామని పబ్లిక్కు ఎందుకు తెలియాలి. ప్రస్తుతం నా జీవితంలో చాలా ప్రశాంతంగా ఉన్నా. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్‌తో సినిమాలు చేశా. తారకరత్న మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. పిల్లలంటే ఆయనకు ప్రాణం. నిషిక అప్పుడప్పుడు సెట్‌కు కూడా వచ్చేది. నాకు ఎలాంటి ఆస్తు లేవు. ఉన్నవే పోగొట్టుకున్నా. కానీ ఇప్పుడు సంపాదించుకున్నా. లైఫ్ అంటే ఔటర్ రింగ్ రోడ్డు కాదు. సిటీ రోడ్లు. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయని తెలుసుకున్నా. నేను ఇంతవరకు సుకుమార్, త్రివిక్రమ్, రాజమౌళి దగ్గర పని చేయలేదు. ఈ ఏడాది కలిస్తోందేమో వేచి చూడాలి.' అని అన్నారు. కాగా.. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌లో కామెడీ స్కిట్స్ చేయడమే కాదు టీం లీడర్‌గా వ్యవహరించాడు. అనంతరం వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు సైతం గుడ్‌బై చెప్పేశారు రఘు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం సాధారణ వ్యక్తిగా జీవితం సాగిస్తున్న రఘు లాక్డౌన్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే తక్కువ కాలంలోనే ఓ లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నారు. -
మూడు పువ్వులు ఆరు కాయలుగా నా వ్యాపారం వృద్ధి చెందాలి
Comedian Raghu Entered Into Liquor Business: కమెడియన్ రఘు ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై బాగా ఫేమస్ అయిన వ్యక్తి. సినిమాల్లో నవ్వులు పూయించే కామెడీ విలన్ పాత్రల్లో ఆకట్టుకున్న రఘు ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అతడికి ఆఫర్లు రావడం లేదా? సినిమాలు కాకుండా రఘు ఇప్పుడేం చేస్తున్నాడు? అతడి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం.. కమెడియన్ రఘుకు అడపాదడపా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. దీంతో అప్పుడప్పుడూ షూటింగులకు వెళ్తున్నాడు. కానీ మిగతా సమయంలో ఖాళీగా ఎందుకుండటం అని వ్యాపారం మీద దృష్టి పెట్టాడు. కొత్తగా లిక్కర్ బిజినెస్‌లో అడుగుపెట్టాడు. నాలుగు దుకాణాల కోసం టెండర్లు వేస్తే రెండు రఘుకే వచ్చాయట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాతో చెప్పుకొచ్చాడు. దుకాణంలో కౌంటర్ మీద కూర్చున్న రఘు తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలని కోరుతున్నాడు. రెండు మద్యం దుకాణాలకు ఓనర్ అంటే రఘు ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా ఉండదన్నమాటే! మొత్తానికి అటు సినిమాలతో పాటు బిజినెస్‌లోనూ రఘు దూసుకుపోతున్నాడు. -
సర్ది చెప్పడానికి వెళ్లాడు.. శవమై వచ్చాడు!
కోదాడ: మద్యం దుకాణం వద్ద జరుగుతున్న గొడవను ఆపి సర్దిచెప్పడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని వైన్స్ సిబ్బంది కర్రలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఏపీ సరిహద్దులోని రామాపురం క్రాస్‌రోడ్‌లో హనుమాన్ వైన్స్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి ఏపీలోని కృష్ణాజిల్లా షేర్ మహ్మద్‌పేటవాసి కావడంతో గ్రామానికి చెందిన పలువురు అక్కడి చేరుకొని మృతదేహంతో ధర్నాకు దిగారు. దీంతో వైన్స్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. షేర్‌మహ్మద్‌పేటకు చెందిన రైతు నాగయ్య మద్యం కోసం రామాపురం వద్ద వైన్స్‌కు వచ్చాడు. అప్పటికే షేర్‌మహ్మద్‌పేటకు చెందిన ఇద్దరు వ్యక్తులతో వైన్స్ సిబ్బంది గొడవ పడుతున్నారు వారిని వారించడానికి నాగయ్య అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో వైన్స్ సిబ్బంది కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో నాగయ్య తలపైబలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వైన్స్‌ముందు గ్రామస్తుల ధర్నా వైన్స్ సిబ్బంది దాడిలో తమ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న షేర్‌మహ్మద్‌పేట వాసులు, బంధువులు పెద్ద ఎత్తున రామాపురం క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకొని వైన్స్ ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కోదాడ టౌన్ సీఐ నరసింహారావు, రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఇదిలా ఉండగా నాగయ్య మృతి చెందగానే వైన్స్‌ను మూసివేసి సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని బంధువుల ఫిర్యాదు అందిన తరువాత పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
జిల్లా జైలునుంచి జర్నలిస్టు రఘు విడుదల
సాక్షి, నల్లగొండ: ఇటీవల అరెస్ట్ అయిన జర్నలిస్టు రఘు మంగళవారం నల్లగొండ జిల్లా జైలునుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వేనంబర్‌లో గల భూమి విషయంలో ఫిబ్రవరి 7న బీజేపీ ఆధ్వర్యంలో గిరిజన భరోసా యాత్రలో జరిగిన వివాదంలో అక్కడి పోలీసులు జర్నలిస్టు రఘును ఈ నెల 3న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అతనికి సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు ఆయన మంగళవారం విడుదలకాగా, కాంగ్రెస్, బీజేపీ నాయకులు జైలు వద్ద స్వాగతం పలికారు. అక్రమంగా తనను అరెస్టు చేశారని, కనీసం నా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వలేదని రఘు ఆరోపించారు. చదవండి: నేడు నల్లగొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన -
రఘుపై ఉన్న కేసుల వివరాలివ్వండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టు రఘుపై నమోదైన కేసుల వివరాలు వారి కుటుంబ సభ్యులకు ఈనెల 14లోగా ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతున్నారని, ఈ నేపథ్యంలో రఘుపై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పేలా ఆదేశించాలని కోరుతూ ఆయన భార్య గంజి లక్ష్మీ ప్రవీణ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. ఒక కేసులో బెయిల్ తీసుకుంటే మరో కేసులో ఆయన అరెస్టును చూపించి ఎక్కువ కాలం జైలులో ఉంచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది రజినీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో అన్ని కేసుల వివరాలను తెలియజేస్తే బెయిల్ కోసం ఆయా కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. కేసుల వివరాలివ్వాలని వినతిపత్రం సమర్పిస్తే ఇస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది నివేదించారు. అయితే వినతిపత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఈనెల 14లోగా రఘుపై ఎక్కడెక్కడ కేసులు నమోదు చేసింది తెలియజేయాలని డీజీపీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 16కు వాయిదావేశారు. చదవండి: చేతబడి కలకలం: ఉదయం లేచి చూస్తే మనిషి అదృశ్యం! -
కిడ్నాప్ తరహాలో జర్నలిస్ట్ అరెస్టా?: సంజయ్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ లోపాలను ఎండగడితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా?’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. హుజూర్నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండాలోని గిరిజన భూముల కబ్జా బాగోతాన్ని మీడియాలో కవర్ చేసినందుకు జర్నలిస్ట్ రఘుపై కేసు పెట్టారని తెలిసిందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక జర్నలిస్ట్‌ను కిడ్నాప్ తరహాలో అరెస్టు చేస్తారా అని నిలదీశారు. జర్నలిస్ట్ రఘు అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తడమే మీడియా బాధ్యత అని, అక్రమ కేసులతో మీడియా గొంతును మూయించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో ఉందన్న విషయాన్ని మరిచిపోవద్దని సంజయ్ హితవు పలికారు. హుజూర్నగర్ జైలుకు జర్నలిస్ట్ రఘు.. 14 రోజుల రిమాండ్ హుజూర్నగర్: హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ రఘును సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు సబ్‌జైలుకు తరలించారు. హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా 540 సర్వే నంబర్లో ఫిబ్రవరి 7న బీజేపీ ఆధ్వర్యంలో గిరిజన భరోసా యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఆరోజు చోటుచేసుకున్న ఘటనలపై నమోదైన కేసులో జర్నలిస్ట్ రఘు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మఠంపల్లి పోలీసులు అతడిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని హుజూర్నగర్ కోర్టులో జడ్జి ముందు హాజరు పరిచారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో వెంటనే హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించారు. -
బిగ్‌బాస్ 4: రఘు మాస్టర్ అవుట్!
బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఈ షో వస్తుందంటే చాలు, ఆ సమయంలో ప్రసారమయ్యే ఇష్టమైన సీరియళ్లను కూడా త్యాగం చేసేందుకు వెనుకాడరు. అలాంటి బిగ్‌బాస్ షో ఈ ఆదివారం నుంచి అందరి ఇళ్లలో తిష్ట వేయనుంది. కాగా ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ అనేకమంది పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పాల్గొననున్నాడని ప్రచారం జరగ్గా ఆయన దాన్ని కొట్టిపారేశాడు. ఆ తర్వాత రఘు మాస్టర్ పేరు వినిపించింది. (కరోనా వార్తలను కొట్టిపారేసిన నోయల్) అంతేకాదు, రఘు మాస్టర్‌తో పాటు ఆయన భార్య ప్రణవి కూడా జంటగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లనున్నాడని ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా రఘు మాస్టర్ ఈ వార్తలను కొట్టిపారేశాడు. "బిగ్‌బాస్ 4కు రావాల్సిందిగా నాకు ఆఫర్ వచ్చినమాట వాస్తవమే. కానీ వ్యక్తిగత కారణాల వల్ల షోలో పాల్గొనడం లేదు" అని స్పష్టం చేశారు. అయితే రఘు మాస్టర్ మొదట బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆఖరు నిమిషంలో అతను నిర్ణయాన్ని మార్చుకుని బిగ్‌బాస్‌కు హ్యాండ్ ఇచ్చాడని చెప్తున్నారు. దీంతో ఇప్పుడు అతని స్థానంలో ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్లో కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ ఉంటారో? లేదో? చూడాలి! (బిగ్‌బాస్ 4 ఎంట్రీ: కొట్టిపారేసిన నటి) -
వ్యాక్సిన్ అంటే ఆషామాషీ కాదు..
సాక్షి, హైదరాబాద్: వైరస్‌లను కట్టడి చేసే వ్యాక్సిన్లను తయారుచేయడం అంత ఆషామాషీ కాదని, సాధారణ పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ తయారీకి ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాధిని నయం చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని అంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ రఘు డీకే. అన్నీ నిర్ధారించుకోకుండా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి పంపితే అది కరోనా కంటే ప్రమాదకారిగా మారుతుందని అంటున్నారాయన. ఉదర సంబంధ వ్యాధులున్న వారు ఈ కరోనా వైరస్‌కు గురయ్యే అవకాశాలు తక్కువేనని, అయితే, కరోనా ప్రాథమిక లక్షణాలతో పాటు కడుపునొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడమే మంచిదంటున్నారు ఈ యూఎస్ ఫెలోషిప్ వైద్యుడు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, ఉదర సంబంధిత వ్యాధులున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వాటితో పాటు అవి ఉంటే...! వాస్తవానికి... దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోలేకపోవడం లాంటివే కరోనా ప్రాథమిక లక్షణాలు. కానీ, పాజిటివ్ వచ్చిన కొన్ని కేసుల్లో కడుపునొప్పి, డయేరియా, ఆకలి మందగించడం లాంటివి కూడా కనిపించాయి. అంటే కరోనా ప్రాథమిక లక్షణాల్లో ఏ ఒక్కదానితో అయినా ఉదర సంబంధిత కడుపునొప్పి, డయేరియా, ఆకలి తగ్గిపోవడం లాంటివి కనిపిస్తే పరీక్ష చేయించుకోవడమే మంచిది. ఎందుకంటే కరోనా వైరస్ పేగులపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వాటికేం సంబంధం ఉండదు.. కడుపులో మంట, అజీర్తి, గ్యాస్, అల్సర్ ఇలాంటి లక్షణాలున్న వారికి కరోనా వైరస్ సోకితే పెద్ద ప్రమాదం ఉంటుందని చెప్పలేం. ఈ వ్యాధులకు కరోనాకు సంబంధం ఉండదు. కానీ, షుగర్, బీపీ, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వయసు పైబడిన వారు అసలు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. వారికి వైరస్ సోకితే చాలా ప్రమాదకరం. క్వారంటైన్లో ఉన్నప్పుడు జాగ్రత్త వైరస్ సోకిన వారికి ఉదర సంబంధిత వ్యాధులు ముదురుతాయా లేవా అన్న దానిపై శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ క్వారంటైన్లో ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్వారంటైన్లో ఉన్నవారు సమయానికి పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగాలి. వ్యాయామం చేయాలి. ఆల్కహాల్ తీసుకోవద్దు. ఉదరసంబంధ వ్యాధులున్న వారు (గ్యాస్ట్రో సమస్యలు) క్వారంటైన్లో జాగ్రత్త తీసుకోకపోతే అవి ముదిరే అవకాశం మాత్రం ఉంది. ఎలక్ట్రొలైట్స్ తగ్గిపోతే గుండెకు ముప్పు లాక్డౌన్ కారణంగా మద్యం మానేసిన వారికి ఉదర సంబంధ సమస్యలేవీ రాకపోవచ్చు. మద్యం తాగకపోవడం కాలేయం, మూత్రపిండాలకు మంచిదే. కానీ, మానసిక సమస్యలు మాత్రం వస్తాయి. వీటితో పాటు శరీరంలో ఎలక్ట్రొలైట్స్ (సోడియం, పొటాషియం, ఫాస్పరస్ లాంటి మూలకాలు) హెచ్చు తగ్గులు వస్తే మాత్రం గుండెకు ముప్పు ఉంటుంది. మన ప్రభుత్వాల చర్యలు భేష్ కరోనా వైరస్ నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయి. మిగిలిన దేశాలన్నింటికన్నా ముందే మనం సురక్షిత చర్యలు ప్రారంభించాం. లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేయాలన్నది ఇదమిత్థంగా చెప్పడం కష్టం. మన దేశంలో రోజురోజుకూ కేసుల లోడ్ పెరుగుతోంది. లాక్డౌన్ ఎత్తేసే అంశానికి ఒకటే ప్రాతిపదిక ఉండాలి. కనీసం వారం నుంచి 10 రోజుల పాటు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కావద్దు. లేదంటే కనీస సంఖ్యలో రావాలి. అప్పుడు లాక్డౌన్ ఎత్తివేత గురించి ఆలోచించాలి. ఉన్నట్టుండి లాక్డౌన్ ఎత్తేస్తే ప్రజలు మళ్లీ కలసిపోవడం వలన పెద్ద స్థాయిలో వైరస్ లోడ్ అయ్యే అవకాశముంది. అందుకే అప్పుడు కూడా హాట్స్పాట్లను మినహాయించాలి. అక్కడ లాక్డౌన్ కొనసాగిస్తూనే మిగిలిన ప్రాంతాల్లో దశల వారీగా ఎత్తేయడమే మంచిది. సాధారణంగా రెండేళ్లు పడుతుంది వైరస్ నియంత్రించే వ్యాక్సిన్లను కనుగొనడం ఆషామాషీ కాదు. అసలు వైరస్ జీనోమ్ ఏంటన్నది గుర్తించాలి. దానిపై అధ్యయనం చేయాలి. జంతువులు, మనుషులపై ప్రయోగాలు జరపాలి. వాటినీ అధ్యయనం చేయాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అన్నది నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే వ్యాక్సిన్‌ను విడుదల చేయాలి. అలాంటిది జరగకుండా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తే కరోనా వైరస్ కన్నా అది ప్రమాదకారి అవుతుంది. ఇదంతా జరగడానికి సాధారణ పరిస్థితుల్లో అయితే రెండేళ్లు పడుతుంది. కానీ, ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది కాబట్టి ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు. పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వనరులు, ప్రయోగశాలలు అనుకూలిస్తాయి కనుక ఎక్కువగా అక్కడే పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా అన్ని సౌకర్యాలున్నాయి. మంచి శాస్త్రవేత్తలున్నారు. వ్యాక్సిన్ కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నారు. సీసీఎంబీ లాంటి సంస్థలు వర్కవుట్ చేస్తున్నాయి. ఈ ఏడాది చివరి కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనేది నా అభిప్రాయం. ‘పాజిటివ్’రావద్దంటే నెగెటివ్‌గానే.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నింటి కన్నా ముఖ్యమైనది భౌతిక దూరం పాటించడం. ఇంట్లోనే ఉండటం. పని ఉంటే తప్ప ఎవరూ ఇంట్లోంచి బయటకు రావద్దు. ఎవరిని చూసినా వైరస్ ఉందేమో అనే భావనతోనే మెలగాలి. ఇది నెగెటివ్ మైండ్‌సెట్ కాదు. ప్రస్తుతం ఇదే పాజిటివ్. కరోనా పాజిటివ్ రావద్దంటే ఇదే మైండ్‌సెట్ ఉండాలి. అవసరం లేని మందులు వాడే ప్రయత్నం చేయకండి. క్వారంటైన్ ప్రోటోకాల్ తప్పకుండా పాటించండి. వయసు మీద పడిన వారికి మరింత జాగ్రత్త అవసరం. -
షావోమి చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా రఘురెడ్డి
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ భారత వ్యాపార విభాగానికి చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా రఘురెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన సంస్థకు చెందిన అన్ని విభాగాలకు, ఆన్లైన్ అమ్మకాలకు హెడ్‌గా వ్యవహరిస్తుండగా.. ఈ బాధ్యతలతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ నిర్వహిస్తున్న పలు కీలక బాధ్యతలను నూతనంగా తీసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చరిత్రలోనే అతి పెద్ద ఇంజనీరింగ్ తప్పిదమని, తప్పు డు పునాదులపై దీన్ని నిర్మిస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కె.రఘు ఆరోపించారు. ఇది ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల పథకమని విమర్శించారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పేర్కొన్న నీటి లభ్యత గణాంకాలను తప్పుగా అన్వయించుకుని ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారన్నారు. మేడిగడ్డ వద్ద 415 టీఎంసీల లభ్యత ఉందని డీపీఆర్‌లో పేర్కొనడం తప్పని, నీటి లభ్యతను లెక్కించడంలో ప్రాణహిత, మధ్య గోదావరి, మానేరు నదుల నుంచి వచ్చే నీటిని పరిగణనలోకి తీసుకోవడం భారీ తప్పిదమన్నారు. మధ్య గోదావరి నుంచి వచ్చే నీరంతా ఎల్లంపల్లిని దాటి వచ్చే నీరేనని, ఆ నీటిని ఎల్లంపల్లి బ్యారేజీ వద్ద నుంచే పంపింగ్ చేసుకోవచ్చని చెప్పారు. మానేరు నుంచి గోదావరిలోకి చేరే నీటిని మధ్య మానేరు రిజర్వాయర్ వద్దనే ఎత్తిపోసుకోవచ్చన్నారు. ప్రాణహిత నది గోదావరిలో కలసే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత కేవలం 182 టీఎంసీలు మాత్రమేనన్నారు. ‘కాళేశ్వరం రీ ఇంజనీరింగ్–ఇంజనీరింగ్ భారీ తప్పిదం’అనే అంశంపై ఆదివారం ఆయన అఖిలపక్షాల నేతలు, రిటైర్డు ఇంజనీర్ల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రీ ఇంజనీరింగ్ పేరిట ఎక్కువ ఎత్తు నుంచి కిందికి ప్రవహించే నీటిని తిరిగి అదే ప్రాంతానికి ఎత్తిపోసే తప్పుడు అవగాహనతో ఈ ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన చేశారన్నారు. మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంతో ప్రయోజనాలేవీ ఉండవని, వేల కోట్ల అదనపు పెట్టుబడి వ్యయం, విద్యుత్, ఇతర నిర్వహణ వ్యయాన్ని వృథా చేయాల్సి ఉంటుందన్నారు. చిన్న మార్పులతో ఎల్లంపల్లికి తరలించొచ్చు తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, 152 మీటర్ల ఎత్తులో అక్కడ బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు సమస్య ఉంటుందని, మేడిగడ్డ వద్ద ఏకంగా 415 టీఎంసీల లభ్యత ఉందనే తప్పుడు కారణాలు చూపి ప్రభుత్వం ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చిందని రఘు ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీలను ఎత్తిపోయలేమని సీడబ్ల్యూసీ ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం మేరకు 148 మీటర్ల బ్యారేజీ నుంచి పూర్తి స్థాయిలో నీటిని ఎల్లంపల్లికి తరలించవచ్చని చెప్పారు. కాలువ వెడల్పు, లోతు, పంపుల సామర్థ్యం లాంటి చిన్న చిన్న మార్పులతో మొత్తం 160 టీఎంసీలను తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి తరలించడం సాధ్యమేనని రఘు తెలిపారు. మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్లే: శ్యాంప్రసాద్‌రెడ్డి తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్లే ప్రాజెక్టును మేడిగడ్డకు ప్రభుత్వం తరలించిందని రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి సమర్థించారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని పునరుద్ఘాటించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్, నాగం జనార్దన్‌రెడ్డి, అద్దంకి దయాకర్, టీడీపీ నేత ఎల్.రమణ, సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. -
ముప్పై ఏళ్ల వెలుగు
గొల్లపూడి మారుతీరావు రచించిన కథ ఆధారంగా ఎం.వి. రఘు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కళ్లు’. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రానికి ఎం.వి.రఘు ఛాయాగ్రాహకుడిగా, సీతారామశాస్త్రి గీతరచయితగా పనిచేశారు. అప్పటి నుంచి సీతారామశాస్త్రితో ఎం. వి. రఘు స్నేహం పల్లవించి, సౌరభాలు వెదజల్లింది. ‘కళ్లు’ నాటకాన్ని చిత్రంగా మలచాలనుకున్న ఆలోచన మనసులో మెదలగానే, ఆ చిత్రంలో పాటలను సీతారామశాస్త్రి చేత రాయించాలనుకున్నారు రఘు. ఆగస్టు 12కు ‘కళ్లు’ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రంలో సీతారామశాస్త్రి రచించి, గానం చేసిన ‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో’ పాటకు సంబంధించిన అంశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు చిత్ర దర్శకుడు ఎం.వి. రఘు. ఒక కన్ను ఎస్.డి. బర్మన్ ‘‘కాలేజీలో చదువుకునే రోజుల్లో హిందీ చలన చిత్ర సంగీత దర్శకుడు ఎస్. డి.బర్మన్ పాటలు వింటుండేవాడిని. ఆయన చేసిన పాటలలో ఆయనే స్వయంగా పాడిన పాటలలో ఏదో ఒక అనుభూతి కలిగేది నాకు. ఇటువంటి పాటలను ఫిలసాఫికల్‌గా, మనసు పెట్టి వినాలి, అనుభూతి చెందాలి. అదే అనుభవం సీతారామశాస్త్రి అప్పుడప్పుడు వాడుకలో ఉన్న పల్లెపదాలను బల్ల మీద డప్పులా వాయిస్తూ పాడుతున్నప్పుడు కలిగేది. ఆయన పాట పాడే విధానంలో వినిపించిన వేదాంతం, నా మనసులో చిత్తరువులా నిలిచిపోయింది. ఇంకో కన్ను సీతారామశాస్త్రి ‘కళ్లు’ చిత్రం తీయాలనుకున్నప్పుడు, అటువంటి పాటను రాయించి, పాడించాలని మనసులో అనుకున్నాను. ఈ చిత్రానికి ఎస్.పి. బాలు సంగీతం సమకూర్చారు. ఈ పాటను సీతారామశాస్త్రితో పాడించాలనుకుంటున్న నా ఆలోచనను బాలుతో చెప్పగానే, తన మనసులో మాట కూడా అదేనని ఆయన అనడంతో ఆ పాటను సీతారామశాస్త్రితో పాడించాం. ఈ పాట ఉద్దేశం.. ‘కళ్లు వచ్చిన తరవాత కళ్లతో కాకుండా మనసుతో చూడండి’ అని ఒక వేదాంతం చెప్పడం. ‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో.. మంచాలింక దిగండోయ్ కొక్కొరోకో.. ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట సెట్టు ఇడిచింది.. మూసుకున్న రెప్పలిడిసి సూపులెగరనీయండి..’ అంటూ సాగుతుంది ఈ పాట. కళ్ల నిండా జ్ఞాపకాల తడి ఈ చిత్రం షూటింగ్ 1988 జనవరి ఎనిమిదో తేదీన విశాఖపట్టణంలో పూర్తయింది. యూనిట్లో అందరినీ వెనక్కి పంపడానికి చేతిలో ఒక్క పైసా లేదు. మేం దిగిన హోటల్ యజమానితో అప్పటికే స్నేహం ఏర్పడింది. ఆయన దగ్గరకు వెళ్లి, ‘మా దగ్గర ఉన్న ఈ సామాను మీ దగ్గర ఉంచుకుని, పది వేలు ఇవ్వండి’ అని అడిగి తీసుకుని, అందరినీ రైలు ఎక్కించాను. నాటి సంఘటన నేటికీ నా మనసులో ఇంకా తడి జ్ఞాపకంగానే ఉంది. నా మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఆ రోజున అత్తారింటికి కూతురిని పంపిస్తున్న తండ్రిలా నేను ఏడుస్తుంటే, తండ్రిని విడిచి వెళ్తున్న పిల్లల్లా వారంతా బాధపడ్డారు. కంటికి కనిపించిన పాట అందరూ వెళ్లాక... నేను, నా కెమెరా, సత్యానంద్, నా కో–డైరెక్టర్‌గా పనిచేసిన ఇవివి సత్యనారాయణ మిగిలాం. మేమంతా ఒక వ్యానులో బయలుదేరి, దారిలో చిన్న కుక్కపిల్ల, గట్ల వెంట ఆడపిల్లలు, గోతులలో లీకైన కుళాయిలు... ఇలా దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేలా కనపడినవన్నీ నా కెమెరాతో బంధించాను. దారిలో పనిచేస్తున్న కార్మికులను చూడగానే ‘చెమట బొట్టు సమురుగా సూరీణ్ని ఎలిగిద్దాం / వెలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం’ అనే వాక్యానికి తగిన సన్నివేశం కనిపించిందని సంతోషపడ్డాను. ఆ వాక్యాలకు అనుకూలంగా అక్కడ పనిచేస్తున్న పనివారూ, ఆ సంధ్య ఎరుపు.. నూనె చారలాగ వచ్చింది. కంటిని నడిపించిన పాట మద్రాసులో ఉండే అనిల్ మల్నాడ్తో ఎడిటింగ్ చేయించేవరకు అసలు సినిమాలో ఏ సన్నివేశాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. సినిమా పూర్తయ్యాక థియేటర్లలో విడుదలైంది. సినిమాకు పెద్దగా ప్రేక్షక ఆదరణ రాలేదు. అదేం చిత్రమో కాని, ఈ పాట ప్రారంభం కాగానే, ఆపరేటర్ సహా బయట ఉన్నవారంతా లోపలకు వచ్చేవారు. థియేటర్ ఫుల్ అయిపోయేది. పాట అయిపోగానే క్లాప్స్ కొట్టి వెళ్లిపోయేవారు. ఇంతకాలం తర్వాత ఇటీవల ఈ పాటను యూ ట్యూబ్‌లో పెట్టాలనిపించింది. అలా పెట్టిన వారానికే ఐదు లక్షల హిట్స్ దాటాయి. ఈ చిత్రం విడుదలయిన 30 సంవత్సరాల తరవాత మళ్లీ ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారు. ఈ చిత్రంలో నటించిన చిదంబరం ‘కళ్లు చిదంబరం’గా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచితుడయ్యాడు. (‘కళ్లు’ చిత్రంలోని ఓ దృశ్యం) – సంభాషణ: వైజయంతి పురాణపండ -
9 లక్షల ఎకరాలు మించదు
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద ఏడాదికి గరిష్టంగా 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి సాగునీరు అందదు. ఈ లెక్కన ఎకరా పంటకు నీటి సరఫరా కోసం ఏటా రూ. లక్షా 54 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి రుణాల చెల్లింపులు, విద్యుత్ చార్జీలు, ఇతర నిర్వహణ వ్యయాలు కలిపి ప్రాజెక్టుకు ఏటా రూ.17,876.7 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది’అని తెలంగాణ జేఏసీ చైర్మన్ కె.రఘు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగితే ఈ వ్యయం రెట్టింపు అవుతందన్నారు. ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణకు లాభమా? నష్టమా?’అంశంపై ఆదివారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో రఘు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణకు ఎత్తిపోతల పథకాలే ఆధారమని నొక్కిచెబుతూనే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం తగ్గించుకోవాల్సిన అవసరముందన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి ఈ ప్రాజెక్టులు పెనుభారమయ్యే ప్రమాదముందన్నారు. తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రాజెక్టు పెట్టుబడి వ్యయంతో పాటు వార్షిక నిర్వహణ వ్యయ భారాలూ తగ్గించుకోవచ్చన్నారు. డీపీఆర్ అశాస్త్రీయం: బిక్షం గుజ్జ వ్యాప్కోస్ సంస్థ రూపొందించిన కాళేశ్వరం డీపీఆర్ అశాస్త్రీయంగా ఉందని అంతర్జాతీయ జల నిపుణుడు బిక్షం గుజ్జ మండిపడ్డారు. ఈ డీపీఆర్ లెక్కల ప్రకారమే ఎకరా సాగుకు ఏటా రూ. 42 వేల నిర్వహణ వ్యయం అవుతుందన్నారు. కాళేశ్వరం నిర్మిస్తే ఎకరా మిర్చి పంట సాగు ద్వారా రైతుల ఆదాయం రూ. 12 వేల నుంచి రూ. 1.56 లక్షలకు పెరుగుతుందంటూ అడ్డగోలు లెక్కలేశారని తప్పుబట్టారు. ప్రభుత్వం తప్పించుకుంటోంది: కోదండరాం ప్రాజెక్టుల వ్యయం తగ్గించుకోవాలని సూచిస్తున్న వారిని, రీ డిజైనింగ్‌లోని మార్పులను ప్రశ్నించిన వారిని ప్రాజెక్టుల వ్యతిరేకులని ముద్ర వేసి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వ ఇంజనీర్లు, నిపుణులకు బదులు కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల డిజైన్లు రూపొందించే దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. అనవసర ప్రాజెక్టులు కట్టుకుంటూ తెలంగాణను ఉద్దరిస్తున్నామంటూ.. ఇంత తొందరగా అంత తొందరగా అవుతున్నాయంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. సీఎం వాదన తప్పవుతుందని..: కాంగ్రెస్ తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే నీటి లభ్యత ఉండదని గతంలో సీఎం కేసీఆర్ చేసిన వాదన తప్పవుతుందనే ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజీని ఎగువనున్న వార్ధా వద్ద నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్, షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ప్రాణహిత–చెవేళ్ల రీ డిజైనింగ్ చేసి కాళేశ్వరం నిర్మిస్తున్నారని మండిపడ్డారు. రూ. 36 వేల కోట్ల వ్యయంతో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాదని, రూ. 86 వేల కోట్లతో 36 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు కాళేశ్వరం నిర్మించడంలో అర్థం లేదన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 273 టీఎంసీల నీరు ఉందని సీడబ్లూసీ గతంలో అంగీకరించిందని, ఇప్పుడు అక్కడ నీటి లభ్యతలేదని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించడం ప్రజా ధనాన్ని దుబారా చేయడమేనన్నారు. కాళేశ్వరం నిర్మాణం పూర్తయ్యే సరికి పెట్టుబడి వ్యయం రూ. 2లక్షల కోట్లుకు పెరుగుతుందని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీర్ల మధ్య వాగ్వాదం కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాల్వలకు బదులు పైపుల సాయంతో ఆయకట్టుకు నీరు సరఫరా చేయాలని సీఎం పరిశీలిస్తున్నారని, దీంతో టీఎంసీతో 20 వేల ఎకరాలు సాగు చేయడానికి వీలు కలుగుతుందని రిటైర్డు ఇంజనీర్ వెంకట రామారావు తెలిపారు. ఏఎంఆర్ ఎత్తిపోతల తరహాలోనే కాళేశ్వరం లిఫ్టు కూడా విజయవంతమవుతుందని మరో రిటైర్డు ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అయితే కొందరు రిటైర్డు ఇంజనీర్లు ప్రభుత్వ తప్పులను సమర్థిస్తున్నారంటూ మరికొందరు ఇంజనీర్లు వాగ్వాదానికి దిగారు. ప్రాజెక్టు వ్యయం తగ్గించుకోడానికి సూచించిన అంశాలు ♦ తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించడంతో ఏటా రూ. 1,000 కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల భారం పడనుంది. ఎల్లంపల్లి బ్యారేజీకి నీటి తరలింపునకు విద్యుత్ చార్జీలు 5 రేట్లు పెరుగుతాయి. ♦ తుమ్మిడిహెట్టి నుంచి ఏడాది పొడుగునా తక్కువ ఖర్చుతో నీరు తరలించుకునే అవకాశం ఉండగా దీనికి బదులు అవసరం లేని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నవరం బ్యారేజీల నిర్మాణానికి రూ. వేల కోట్ల ఖర్చులు చేయడం సమర్థనీయం కాదు. ♦ తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. కానీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మిస్తుండటంతో ఈ అవకాశం లేకుండా పోయింది. ♦ తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించినా 152 మీటర్ల ఎత్తుకు సమానంగా నీటిని తరలించుకోవచ్చు. దీనికోసం డిజైన్లలో మార్పులు చేసుకోవాలి. ♦ మల్లన్నసాగర్ వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం అవసరం లేదు. ఇమామాబాద్ దగ్గర 0.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్ ద్వారా 156 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉండగా, ఇక్కడినుంచి 120 రోజుల్లో 90 టీఎంసీల నీరే తరలించే అవకాశం ఉంది. ఈ నీళ్లు సాగునీటి అవసరాలకే సరిపోవు. తాగునీరు, పరిశ్రమలకు నీళ్లు రావు. భవిష్యత్‌లో ఇమామాబాద్ బ్యారేజీ సామర్థ్యం పెంచితే నిర్మాణ వ్యయం భారీగా పెరగనుంది. కాబట్టి మల్లన్నసాగర్ వద్ద 5 టీఎంసీల రిజర్వాయర్ సరిపోతుంది. ♦ దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద లినమెంట్ మల్లన్నసాగర్‌కు అనుకుని ఉంది. అక్కడ భారీ డ్యాం నిర్మిస్తే భూకంపాలొచ్చే ప్రమాదముంది. ♦ కాళేశ్వరం కింద 200 టీఎంసీలతో 18.5 లక్షల కొత్త ఆయకట్టు, 18.80 లక్షల పాత ఆయకట్టు స్థిరీకరణ కలిపి మొత్తం 37.30 లక్షల ఆయకట్టుకు నీటి సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. టీఎంసీతో 16 వేల ఎకరాలకు నీరు అందిస్తామని పేర్కొంటున్నా ఇంతవరకు ఎక్కడా టీఎంసీతో 10 వేల ఎకరాలకు మించి సాగు జరగలేదు. ఈ లెక్కన కాళేశ్వరం కింద ఏటా 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి నీరందదు. -
అర్ధరాత్రి ఉద్రిక్తత.. పాత గుంటూరులో 144 సెక్షన్
-
పాత గుంటూరులో భీభత్సం, పీఎస్‌పై దాడి
సాక్షి, గుంటూరు : బాలికపై అత్యాచారయత్నం ఘటనతో పాత గుంటూరులో అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన పాత గుంటూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుడు రఘును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద భీభత్సం సృష్టించారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడమే కాకుండా, అక్కడున్న వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత గుంటూరు 144 సెక్షన్ విధించారు. పోలీస్ స్టేషన్ దాడిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అత్యాచారయత్నం చేసిన నిందితుడు రఘును అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. గుంటూరులో మరో దారుణం -
టీజేఏసీ చైర్మన్‌గా కంచర్ల రఘు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ (టీజేఏసీ) నూతన చైర్మన్‌గా కంచర్ల రఘు, కన్వీనర్‌గా ప్రొఫెసర్ పురుషోత్తం ఎన్నికయ్యారు. నగరంలో ఆదివారం జరిగిన టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకు జేఏసీ కన్వీనర్‌గా రఘు, కో–చైర్మన్‌గా పురు షోత్తం ఉన్నారు. అంతకుముందు ప్రొఫెసర్ కోదండరామ్, ఇతర కార్యవర్గ సభ్యుల రాజీనామాలను సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా పలువురు టీజేఏసీ నేతలు, తెలంగాణ జన సమితి నాయకులు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో టీజేఏసీ పాత్ర కీలకమైందని అభివర్ణించారు. రాజకీయాల్లో మార్పు కోసమే వైదొలిగాను రాజకీయాల్లో మార్పు కోసమే తాను టీజేఏసీ నుంచి వైదొలిగానని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ పేర్కొన్నారు. జేఏసీ బలోపేతం కావాలని, బలమైన ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. జేఏసీని వీడుతున్నందుకు బాధగా ఉందని, అయితే ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తప్పడం లేదన్నారు. రాష్ట్ర సాధనలో టీజేఏసీ పాత్ర మరువలేనిదన్నారు. టీజేఏసీ నిర్ణయాలు తీసుకున్నా ప్రజలు సంఘటితంగా ఉద్యమం చేశారన్నారు. సమష్టి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పని చేయాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అందుకోసం టీజేఏసీ కృషి చేయాలన్నారు. అనుకున్నంత ఈజీగా రాజకీయాలు మారవని, పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ మనం అనుకున్నది కచ్చితంగా ప్రజలకు చెప్పాలన్నారు. కోదండరామ్ లేని జేఏసీని ఊహించలేము తెలంగాణ సమాజానికే కోదండరామ్ ఒక ప్రతీక అని, ఆయన లేని జేఏసీని ఊహించలేమని జేఏసీ చైర్మన్ రఘు పేర్కొన్నారు. రకరకాల వ్యక్తిత్వాలను ఒక వేదికపైకి తీసుకురావడంతోపాటు ఎంతో ఓపిక, సహనంతో పని చేశారన్నారు. త్వరలోనే టీజేఏసీ సమావేశం ఏర్పాటు చేసి, స్టీరింగ్ కమిటీ ప్రకటనతోపాటు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. జేఏసీ కన్వీనర్‌గా తనను ఎన్నుకున్నందుకు ప్రొఫెసర్ పురుషోత్తం ధన్యవాదాలు తెలిపారు. -
నంబర్ ప్లేట్లులో సెక్యూరిటీ!
కర్నూలు నగరానికి చెందిన రఘు తన వాహనానికి బిగించుకున్న హై–సెక్యూరిటీ నంబరు ప్లేటు ఆరు నెలల్లోనే విరిగిపోయింది. నంబరు ప్లేటు లేదనే కారణంగా రూ.135 చలానా భారం పడింది. దీంతో విధిలేక సాధారణ నంబరు ప్లేటును సొంత ఖర్చుతో బిగించుకున్నాడు. ఒక్క రఘునే కాదు..జిల్లావ్యాప్తంగా చాలామంది వాహనదారులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: హై–సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు నాణ్యత లేకపోవడంతో వాహన దారుల జేబులు గుల్లవుతున్నాయి. వాటిని బిగించుకున్న ఆరు నెలల్లోపే విరిగిపోతున్నాయి. విరిగిన ప్లేట్లతో తిరుగుతున్న వాహనదారులపై అధికారులు చలానాల రూపంలో బాదుతున్నారు. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు చాలామంది తిరిగి కొత్తగా సాధారణ నంబర్ ప్లేట్లను బిగించుకోవాల్సి వస్తోంది. హై–సెక్యూరిటీ నంబర్ ప్లేటు కోసం ఒక్కొక్కరు ఇప్పటికే రూ.250 మేర ఖర్చు చేశారు. విరిగిన ప్లేటుతో తిరుగుతూ ఒక్కసారి పట్టుబడితే చలానా రూపంలో రూ.135 వరకూ బాదుతున్నారు. ఈ భారాన్ని తప్పించుకునేందుకు చాలామంది సొంత ఖర్చుతో సాధారణ నంబరు ప్లేట్లను బిగించుకుంటున్నారు. ఇది వారికి మరింత భారంగా మారుతోంది. హై–సెక్యూరిటీ పేరుతో నాణ్యతలేని నంబరు ప్లేట్లను సరఫరా చేసిన ప్రైవేటు ఏజెన్సీపై చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖ అధికారులు వెనకాడుతున్నారు. ఆ ఏజెన్సీకి అధికార పార్టీకి చెందిన ఎంపీ అండదండలు ఉండటమే ఇందుకు కారణం. ఆది నుంచి విమర్శలే... హై –సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల సరఫరా ఏజెన్సీ మీద మొదటి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు టెండర్లు పిలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ టెండర్లు తామే పిలుచుకుంటామంటూ అక్కడ ఆందోళన జరిగింది. దీంతో ఏపీలో మాత్రమే ఈ పథకం అమలు ప్రారంభమయ్యింది. మొదట్లో ఆర్టీసీకి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ప్రైవేటు ఏజెన్సీకి కట్టబెట్టారు. ఢిల్లీకి చెందిన లింక్ ఆటోటెక్ అనే సంస్థ హై–సెక్యూరిటీ పేరుతో ఎటువంటి ప్రత్యేకతలూ లేని నంబరు ప్లేట్లను వాహనాలకు బిగిస్తోంది. రవాణా శాఖ అధికారులు సదరు ఏజెన్సీ కార్యాలయానికి ప్రత్యేక గది ఇచ్చి మరీ సహాయం చేస్తున్నారు. ఇక నంబరు ప్లేట్లను కూడా సదరు సంస్థ సకాలంలో సరఫరా చేయలేకపోతోంది. సాధారణ నంబర్ ప్లేట్ల మాదిరిగానే ఉన్న ఇవి మరీ నాసిరకంగా ఉంటున్నాయి. జిల్లాలో రోజుకు సగటున 150 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఒక్కో నంబరు ప్లేటుకు రూ.250 చొప్పున ప్రతిరోజూ వాహనదారులు రూ.37,500 ఖర్చు చేస్తున్నారు. అంటే ఏడాదికి రూ.1.37 కోట్ల మేర కేవలం నంబరు ప్లేట్ల కోసమే వెచ్చిస్తున్నారు. ఈ నంబరు ప్లేట్లు కాస్తా త్వరగా విరిగిపోతుండటంతో.. సాధారణ నంబర్ ప్లేట్లకు మరో రూ.కోటి మేర అదనపు భారం పడుతోందని అంచనా. అధికార పార్టీ అండదండలు ఢిల్లీకి చెందిన ఈ ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులకు అధికార పార్టీ నేతలతో సంబంధబాంధవ్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కాస్తా ఈ సంస్థను వెనకేసుకొస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఎటువంటి నాణ్యత లేకుండా నంబరు ప్లేట్లను సరఫరా చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు జిల్లా రవాణాశాఖ అధికారులు ఇప్పటికే విన్నవించారు. ఈ ఏజెన్సీని మార్చి.. ఆర్టీసీకి కాంట్రాక్టు అప్పగించాలని ఉన్నతాధికారులు కూడా సిఫారసు చేసినట్టు సమాచారం. ఇందుకు ప్రభుత్వ పెద్దలు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. దీంతో సదరు ప్రైవేటు ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. -
‘ఎక్సో’లెంట్ వైద్యం!
మన శరీరంలో కోట్ల సంఖ్యలో ఉండే కణాల్లో డీఎన్ఏ, జన్యువులు ఉంటాయని తెలిసిందే. మరి ఎక్సోసోమ్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక్కొక్కరిలో కనీసం వెయ్యి లక్షల కోట్ల వరకు ఉండే అతిసూక్ష్మమైన కొవ్వు తిత్తులివి. వీటివల్ల కలిగే ప్రయోజనం మాత్రం ఇప్పటికీ మిస్టరీనే! ఈ విషయాన్ని ఛేదిస్తే కేన్సర్ సహా అనేక వ్యాధులకు మెరుగైన చికిత్స లభిస్తుంది. ఇదే లక్ష్యంగా ఎక్సోసోమ్‌లపై ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్త రఘు కల్లూరి. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ సెల్ బయాలజీ’కి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ఆయన పరిశోధనల వివరాలను పంచుకున్నారు. ప్రశ్న: ఎక్సోసోమ్‌ల గురించి వివరిస్తారా? రఘు: కణాలన్నీ విడుదల చేసే అతిసూక్ష్మమైన తిత్తుల్లాంటి నిర్మాణాలు ఇవి. సుమారు 30 ఏళ్ల కిందే వీటిని గుర్తించారు. తొలుత ఇవి కణవ్యర్థాలే అని భావించేవారు. గత పదేళ్లలో ఎక్సోసోమ్‌లకు సంబంధించి వివరాలు అర్థమవుతున్న కొద్దీ వీటిపై ఆసక్తి పెరుగుతోంది. ఇవి కొన్నిసార్లు ఇతర కణాల్లోకి చొచ్చుకుపోగలవని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. వీటి ఆధారంగా ఎక్సోసోమ్‌లు వేర్వేరు కణాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉపయోగపడతాయని అంచనా. వీటిని నియంత్రించగలిగితే వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. ప్ర: వ్యాధులకు, వీటికి సంబంధం ఏంటి? రఘు:అన్ని ఎక్సోసోమ్‌లు ఒకేలా ఉండవు. కణాల స్థితికి అనుగుణంగా డీఎన్ఏ, ఆర్ఎన్ఏలు మారిపోతుంటాయి. కేన్సర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారి రక్తాన్ని పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. అందుకే ఇవి భవిష్యత్తులో వ్యాధి నిర్ధారణకు సాధనంగా వాడుకోవచ్చని భావిస్తున్నాం. ఇతర కణాల్లోకి సులువుగా చొచ్చుకుపోగలవు కాబట్టి శరీరంలోని వివిధ భాగాలకు మందులు నేరుగా చేరవేయొచ్చు. నేను పనిచేస్తున్న ఎండీ యాండర్సన్ కేన్సర్ సెంటర్ ఎక్సోసోమ్‌లలోకి మందులు చేర్చడంలో ఇప్పటికే విజయం సాధించింది. ప్ర: ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? రఘు:రక్తం నుంచి ఎక్సోసోమ్‌లను వేరు చేసి.. వ్యక్తుల తాలూకూ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయొచ్చు. డీఎన్ఏ మార్పులు, ప్రొటీన్లను విశ్లేషించే అవకాశం ఉంటుంది. దీంతో కచ్చితమైన వైద్యం సాధ్యమవుతుంది. జన్యుమార్పులన్నింటినీ గుర్తించి కేన్సర్ చికిత్స పద్ధతులను అభివృద్ధి చేయొచ్చు. మధుమేహం, నాడీ సంబంధిత వ్యాధులను కూడా గుర్తించే అవకాశముంది. ప్ర: మీరు కోడియాక్ అనే సంస్థను స్థాపించారు. అందులో ఏ రకమైన పరిశోధనలు జరుగుతున్నాయి? రఘు:కేన్సర్ తీరుతెన్నులు, అవయవాలకు విస్తరించే తీరు తదితరాలపై పరిశోధనలు చేస్తున్నాం. ఎక్సోసోమ్‌లను పూర్తిస్థాయిలో అర్థం చేసుకునేందుకు తద్వారా సరికొత్త చికిత్స విధానాలను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్ర: కడుపు, పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు కూడా ఎక్సోసోమ్‌లను విడుదల చేస్తూంటాయా? రఘు:విడుదల చేసే అవకాశం ఉంది. మన కణాలు విడుదల చేసేవి బ్యాక్టీరియాలోకి.. అలాగే బ్యాక్టీరియా ఎక్సోసోమ్‌లు మన కణాల్లోకి ప్రవేశిస్తుండవచ్చు. జీవశాస్త్రంలో ఎక్సోసోమ్‌లు తాజా సంచలనం. ప్రస్తుత పరిశోధనలను, ఎప్పటికప్పుడు మెరుగవుతున్న టెక్నాలజీలను దృష్టిలో పెట్టుకుంటే వచ్చే ఐదేళ్లలో ఎక్సోసోమ్‌ల ద్వారా వ్యాధుల నిర్ధారణ గానీ.. చికిత్స గానీ పూర్తిస్థాయిలో సాధ్యమవుతుంది. ప్ర: ఇవి సాధారణ రసాయనాలకు స్పందిస్తాయా? హోమియో వంటి వైద్యవిధానాలు సూక్ష్మస్థాయి రసాయనాలపైనే ఆధారపడి ఉంటాయి కదా? వాటి ప్రభావం ఏంటి? రఘు: హోమియో మందులు ఎక్సోపోమ్లపై ప్రభావం చూపుతాయని భావిస్తు న్నాను. ఆయుర్వేద మందులు మొక్కల నుంచి తయారవుతాయి కాబట్టి మొక్క ల ఎక్సోసోమ్‌లు కచ్చితంగా మన ఎక్సోసోమ్‌లపై ప్రభావం చూపుతాయి. – సాక్షి హైదరాబాద్ -
అత్యుత్సాహం ఖరీదు ఒక ప్రాణం
జయలలిత అధికారంలో ఉండగా ఫుట్‌పాత్‌లపై హోర్డింగ్‌లను తొలగించినందుకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిపై కేసు నమోదైంది. కోయంబత్తూర్‌లో హోర్డింగ్‌ల ఏర్పాటుపై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోలేదు. మున్సిపల్ మంత్రి ఎస్పీ వేలుమణి స్వయంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించడం గమనార్హం. ఆ ప్రాంతంలో వేలుమణి బలమైన నాయకుడు కూడా. హోర్డింగ్ ఏర్పాటుకు ఆదేశించిన వారిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీని గురించి విపక్ష డీఎంకే మాత్రమే నిరసన ప్రకటిస్తున్నది. తమిళనాడు సీఎం ఇంతవరకూ నోరు విప్పలేదు. ‘రఘును ఎవరు చంపారు?’ తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక రోడ్డు మీద ఈ ప్రశ్న రాశారు. మొన్న శుక్రవారం ఉదయం రఘుపతి అనే ముప్పయ్ సంవత్సరాల యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రమాదానికి గురై మరణించిన చోటు సరిగ్గా అదే. కడుపు మంటతో, తీవ్ర నిరాశా నిస్పృహలకు గురైన ఇద్దరు అబ్బాయిలు చొరవ చేసి రోడ్డుకు అడ్డంగా ఆ అక్షరాలు రాశారు. ఇలాంటి దుర్ఘటన గురించి తమిళనాడు, కోయంబత్తూరు మరచి పోలేదని గుర్తు చేయడానికీ, దీని మీద సమాజంలో తగినంత కదలిక తెచ్చేందుకు ఆ అబ్బాయిలు ఇద్దరూ ఆ ప్రయత్నం చేశారు. అన్నాడీఎంకే అత్యుత్సాహం ముందు ఈ దుర్ఘటన గురించి తెలుసుకుందాం. అమెరికాలో ఉంటున్న రఘు భావి జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ వచ్చాడు. ఇదే సందర్భంలో కోయంబత్తూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పళని అనే పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి ఉదయాన్నే బయలుదేరాడు. మోటార్ బైక్ మీద మొదట బస్టాప్ దాకా వెళ్లాలని అనుకున్నాడు. అక్కడ నుంచి బస్సు మీద పళని వెళ్లాలని ఆయన ఆలోచన. అయితే ఒక లారీ రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా తప్పు దారిలో రఘు మీదకు దూసుకు వచ్చింది. దానిని తప్పించుకోవడానికి రఘు అనివార్యంగా ఎడమ వైపునకు బైకును తిప్పవలసి వచ్చింది. కానీ ఆ దిశలోనే భారీ హోర్డింగులు వేలాడదీయడం కోసం పాతిపెట్టిన కర్రలు ఉన్నాయి. ఆ వేకువ చీకటిలో అతడు వాటిని గమనించుకోలేదు. డిసెంబర్ 3వ తేదీన జరిగే అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎమ్జీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలలో హోర్డింగులు తగిలించడం కోసం వారం ముందే ఆ కర్రలను ఆ పార్టీ కార్యకర్తలు పాతిపెట్టారు. పనివాడు పందిరి వేస్తే పిచ్చుకలు కూలగొట్టాయన్న సామెత చందంగా ఏ మాత్రం పటిష్టంగా లేని ఆ కర్రల ఏర్పాటు అక్కడి రోడ్డును నలభై శాతం ఆక్రమించింది. పైగా రోడ్డు ఆక్రమణ గురించి వాహన చోదకులను హెచ్చరించే రిఫ్లక్టర్స్ వంటి ఎలాంటి సాధనాలను అక్కడ ఏర్పాటు చేయలేదు. ఈ కర్రలకే రఘు గుద్దుకుని రోడ్డు మీద పడిపోయాడు. అతడి మీద నుంచి లారీ వెళ్లిపోయింది. అసలు అక్కడ ఆ కర్రలను అలా పాతిపెట్టడమే చట్ట విరుద్ధమైతే, ఈ దుర్ఘటన పట్ల అన్నాడీఎంకే స్పందించిన తీరు మరింత వికృతంగా ఉంది. రఘు మద్యపానం మత్తులో వాహనాన్ని నడుపుతున్నాడని నమ్మించడానికి వారు ప్రయత్నించారు. మరికొందరైతే రఘు మీద నుంచి లారీ దూసుకుపోవడంతోనే మరణించాడు తప్ప, హోర్డింగ్ కర్రలకు, ఆ దుర్ఘటనకు ఎలాంటి సంబంధం లేదని దబాయిస్తున్నారు. అయితే అది ఆరు లేన్ల రహదారి. అనివార్యంగా రఘు బైకు తిప్పిన ఎడమ వైపున హోర్డింగ్ లేకుంటే అతడు సులభంగా తనవైపు దూసుకొచ్చిన లారీని తప్పించుకునేవాడనే విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. న్యాయం వైపు నిలిచినందుకు శిక్ష రఘు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మరికొందరు తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాదనలో కొంత హేతుబద్ధత ఉన్నా అన్నాడీఎంకే కార్యకర్తలు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చలేరు. దారుణ ఘటనకు బాధ్యులను గుర్తించి, శిక్షించాల్సిన కార్పొరేషన్ అధికారులు చోద్యం చూస్తుంటే, తమ రాతలతో వ్యవస్థను నిలదీసిన యువకులనే పోలీసులు తీసుకుపోయి ప్రశ్నించడం గమనార్హం. ఆ అబ్బాయిలిద్దరికీ ఏమైనా రాజకీయ పార్టీలతో సంబంధం ఉందా అని ఆరా తీసిన పోలీసులకు అలాంటిదేమీ లేదనే సమాచారం లభించింది. రాజకీయ హంగామా కోసం బహిరంగ ప్రదేశాలను, రహదారులను ఆక్రమించి ప్రచార ఆర్భాటాలతో రెచ్చిపోవడం అన్నా డీఎంకేకు అలవాటేననే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. డిసెంబర్ 2015లో జనరల్ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా చెన్నై నగరాన్ని ఆ పార్టీ హోర్డింగ్‌లతో ముంచెత్తింది. నగరంలోని పేవ్‌మెంట్స్‌ను సయితం ఆక్రమించుకున్నారు. పాదచారులకు ఇబ్బందికరంగా ఉన్న హోర్డింగ్‌లను తొలగించేందుకు ప్రయత్నించిన అరప్పోర్ ఇయకం(అవినీతిపై పోరాడే ఎన్జీవో) కార్యకర్తలను ఏఐఏడీఎంకే కార్యకర్తలు అడ్డుకుని దాడులకు దిగడం మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనలో దాడికి దిగిన పార్టీ కార్యకర్తలను విడిచిపెట్టి ముగ్గురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేసి చెన్నై సెంట్రల్ జైలుకు తరలించడం, పార్టీ కార్యకర్తలపై ఈగ వాలనీయకపోవడం విస్మయం కలిగించింది. ఇక జయలలిత అధికారంలో ఉండగా ఫుట్‌పాత్‌లపై హోర్డిం గ్లను తొలగించినందుకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిపై కేసు నమోదైంది. కోయంబత్తూర్‌లో హోర్డింగ్‌ల ఏర్పాటుపై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోలేదు. మున్సిపల్ మంత్రి ఎస్పీ వేలుమణి స్వయంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించడం గమనార్హం. ఆ ప్రాంతంలో వేలుమణి బలమైన నాయకుడు కూడా. హైకోర్టు ఆదేశాలు గాలికి! హోర్డింగ్ ఏర్పాటుకు ఆదేశించిన వారిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీని గురించి విపక్ష డీఎంకే మాత్రమే నిరసన ప్రకటిస్తున్నది. రాజకీయ పక్షాలు రాచరిక వ్యవస్థను తలపించేలా అహంభావపూరితంగా వ్యవహరించరాదని డీఎంకే స్పష్టం చేసింది. అయినా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఈ దారుణోదంతం గురించి ఇప్పటివరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జీవించి ఉన్న వ్యక్తుల కటౌట్లు ఏర్పాటు చేయరాదని నెల కిందట మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పళనిస్వామి, పన్నీర్‌సెల్వంల నిలువెత్తు కటౌట్ల స్థానంలో వారి రూపాలను ముద్రించిన పెద్ద పెద్ద బెలూన్లు ఆకాశమంతా దర్శనమిచ్చాయి. మంత్రికి వంత పాడుతున్న పోలీసులు రఘు దుర్మరణం పాలైన కొద్దిరోజుల్లోనే తేని జిల్లాలోనూ ఇటువంటి భారీ హోర్డింగ్‌లు దర్శనమిచ్చాయి. ‘అడ్డంకిగా, ప్రమాదకరంగా’ ఉండే హోర్డింగులను ఏర్పాటు చేయడంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తున్నదని తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎం.కె. స్టాలిన్ ఆరోపించారు. ఇటీవలకాలంలోనే రాజకీయాలలోకి వచ్చినట్టు ప్రకటించిన ప్రముఖ చలనచిత్ర నటుడు కమల్‌హసన్ కూడా ఈ దుర్ఘటన గురించి ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ ట్వీట్ చేశారు. ‘ఏ ప్రభుత్వమైనా సరే, జీవితాలను బలితీసుకుని అధికారాన్ని, కీర్తిని నిలబెట్టుకోవా లని అనుకుంటే, అలాంటి ప్రభుత్వం పతనం కాక తప్పదు’ అని కమల్‌హసన్ హెచ్చరించారు. కానీ ఈ విమర్శలు ఏవీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి మార్పును తీసుకురాలేదు. మున్సిపల్ పరిపాలనా వ్యవహారాల మంత్రి వేలుమణి కోయంబత్తూరులో రోడ్డు మీద పాతిన కర్రల వ్యవహారం చట్టవిరుద్ధమేమీ కాదని నిస్సంకోచంగా చెప్పారు. ఇందుకు సంబంధించి విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎదురుదాడికి కూడా దిగారు. కోయంబత్తూరు పోలీసులు కూడా మంత్రి వాదం వైపు మొగ్గు చూపుతున్నారు. లారీ వచ్చి డీకొనడం వల్లనే ఆ ప్రవాస భారతీయ ఇంజనీర్ మరణించాడని వారు కూడా చెప్పారు. పాలకవర్గం ధోరణి కేవలం ప్రజలపట్ల సానుభూతిరాహిత్యం, జవాబుదారీతనం లోపించిన వైనాన్నే ప్రతిబింబిస్తున్నది. ఒక నిర్లక్ష్యం ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య వివాదంగా మిగిలిపోవడం ఆశ్చర్యకరం. రఘు విషాదం మీద ప్రజలలో నిరసన పెల్లుబుకుతోంది. ఈ విషాదం గురించి ప్రచారం చేసేందుకు, బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు ఒత్తిడి పెంచేలా ఛేంజ్.ఓఆర్జీలో పిటిషన్లపై ఉద్యమ స్ఫూర్తితో సంతకాలు జరుగుతున్నాయి. ఈ తరహా దారుణ ఘటనలకు చరమగీతం పాడాలని, రఘు వంటి అమాయకుల ప్రాణాలను ఇక తమిళనాడు త్యాగం చేయబోదనే గట్టి సందేశం బలంగా వినిపించాలనే ఆకాంక్ష తమిళనాడు రాష్ట్రమం తటా వ్యక్తమవుతోంది. - టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
రఘుపై చర్యలు వద్దు
-
రఘుపై చర్యలు వద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతిపరులైన అధికారులకు ప్రభుత్వమే దన్నుగా ఉంటే అడ్డేముంది. అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టుబడ్డ గోళ్ల వెంకట రఘు విషయంలో చంద్రబాబు సర్కారు తీరు ఇలానే ఉంది. ఆయనపై గత కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విజిలెన్స్ విచారణ నివేదికపై చర్యలు నిలుపుదల చేస్తూ చంద్రబాబు సర్కారు గత నెల 21న ఏకంగా ప్రత్యేకంగా జీవోనే జారీ చేసింది. తద్వారా రఘుపై చర్యలు తీసుకోకుండా మోకాలడ్డింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఒక కీలక నేత చక్రం తిప్పారని సమాచారం. అయితే ఏసీబీ ఆకస్మికంగా రఘుపై దాడులు చేయడంతో ఆయన అవినీతి వెలుగుచూసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగంపై ఆంధ్రప్రదేశ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రఘు ఏసీబీకి పట్టుపడ్డ సంగతి తెల్సిందే. రఘు, ఆయన బినామీల ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.550 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో పనిచేసిన ఆయన అన్ని చోట్ల బినామీలను ఏర్పాటు చేసుకొని అక్రమ సంపాదనే లక్ష్యంగా పనిచేశారనే అభియోగాలు ఉన్నాయి. గతంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సిటీ ప్లానర్‌గా పనిచేసిన కాలంలో బహుళ అంతస్తుల భవనానికి అక్రమంగా అనుమతులు ఇవ్వడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తు జరిపింది. ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని నిర్ధారించి ఆయనతోపాటు మరో ముగ్గురు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ గత కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే దిగువస్థాయి ముగ్గురు అధికారులకు మినహాయింపు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రఘుపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని 2013, ఫిబ్రవరి 12న ఉత్తర్వులు ఇచ్చింది. నివేదికను బుట్టదాఖలు చేసిన టీడీపీ ప్రభుత్వం రఘుపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన నివేదికపై చంద్రబాబు అధికారం చేపట్టిన మూడేళ్లలో ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. మరీ విచిత్రం ఏమిటంటే.. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరున రఘు పదవీ విరమణ చేయనుండటంతో ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ అదే నెల 21న చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా జీవో నెంబర్ 662ను జారీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఆఘమేఘాలపై జీవో జారీ చేయడం వెనుక ఒక కీలక నేత చక్రం తిప్పారని సమాచారం. అంతటి అవినీతిపరుడికి క్లీన్‌చిట్టా?: మధు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కిన అవినీతి తిమింగిలం, రాష్ట్ర టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ జీవీ రఘుకు మున్సిపల్ శాఖ క్లీన్ చిట్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఆదాయానికి మించి వందల కోట్ల ఆస్తులున్నట్టు, గతంలోనే ఆయనపై దాడులు జరిగిన సంఘటనలు ఉన్నా మంచివాడని కితాబు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. పరిపాలనలో నిజాయితీ, పారదర్శకత అంటూ నిత్యం మాట్లాడుతున్న ప్రభుత్వం ఈ తరహా క్లీన్ చిట్ ఎలా ఇచ్చిందో తేల్చాలని ప్రజలు కోరుతున్నారన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేసే ఒక ఉన్నతాధికారి ప్రభుత్వ పెద్దల అండ లేకుండానే వందల కోట్ల రూపాయలు సంపాయించడం ఎలా సాధ్యం అని నిలదీశారు. ఈ విషయమై విచారించి వాస్తవాలు ప్రకటించాలని, రఘుకి క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. -
రఘు అత్త పేరుతో ‘అనంత’లో 75 ఎకరాలు
సాక్షి, అమరావతి : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటరఘుకు సంబంధించిన బినామీ ఆస్తులు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. రఘు బినామీ పేరుతో అనంతపురం జిల్లాతో పాటు తెలంగాణలో ఉన్న పొలాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్‌కు ఆనుకుని మెదక్ జిల్లా పటాన్చెరు ప్రాంతంలోని పాటి గ్రామంలో ఆరెకరాల పొలం ఉన్నట్టు నిర్ధారించారు. అలాగే అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో 75 ఎకరాల పొలం పత్రాలు రఘు అత్త బసివిరెడ్డి కళావతమ్మ పేరుతో లభ్యమయ్యాయి. వీటిని ఆమె పేరుతోనే ఎస్పీఎస్ ఇన్ఫ్రా అనే బోగస్ కంపెనీలో పెట్టుబడులుగా చూపించినట్లు తేలిందని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా, మరిన్ని వివరాలు రాబట్టేందుకు రఘును నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు.. విశాఖ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘు బినామీలు నల్లూరి శివప్రసాద్, ఆయన భార్య గాయత్రిని కూడా 4 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పిటిషన్ వేశారు. -
భరత్ చాలా సరదాగా ఉండేవాడు
భరత్ నాకు వెరీ క్లోజ్. చాలా సరదాగా ఉండేవాడు. స్నేహితుల్లా ఉండేవాళ్లం. మంచీ చెడూ చెప్పుకునేవాళ్లం. కొన్ని విషయాలు తన లైఫ్‌ని డిస్ట్రబ్ చేశాయి. వాటికి దూరంగా మామూలు మనిషిలా ఉండాలనుకునేవాడు. ఏం చేస్తాం? జరగరానిది జరిగిపోయింది. భార్యతో తను ఓ పదిహేను– పదహారేళ్లు కలిసి ఉండుంటాడు. ఆ తర్వాత విడిపోయారు. పిల్లలు కూడా లేరు. బాధ, సంతోషం ఏదైనా మాతోనే. నాకిద్దరు కొడుకులు. నా చిన్న కొడుకు, రవి అన్నయ్య అబ్బాయికి భరత్ బాగా క్లోజ్. పిల్లలందరితోనూ బాగుండేవాడు. మూడ్ బాగా లేకపోతే నవ్వించడానికి ట్రై చేసేవాడు. భరత్ పోయిన బాధలో మేం ఉంటే.. ఎవరూ లేనివాడిలా తనను సాగనంపామని రాశారు. బాధ అనిపించింది. ఓ ఇంట్లో జరగకూడనిది జరిగినప్పుడు ఇంటిల్లిపాదీ బాధలో ఉంటారు. ఇలాంటి సమయంలో అసత్యాలు రాయడం బాధ అనిపించింది. – రఘు జరిగింది ఒకటి...రాసింది మరొకటి! నింద.. నేను.. భరత్ -
రగ్బీ జాతీయ జట్టులోకి గోరంట్ల యువకుడు
సోమందేపల్లి (పెనుకొండ) : దక్షిణ భారతదేశపు రగ్బీ క్రీడా పోటీల్లో గోరంట్లకు చెందిన మదాని ఆర్మీ అకాడమిలో శిక్షణ పొందుతున్న యువకుడు రఘు ప్రతిభ చాటినట్లు శిక్షకుడు మిలటరీ ఫకృద్దీన్ సోమవారం తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో భాగంగా ఆదివారం చెన్నైలో జరిగిన రగ్బీ పోటీల్లో సత్తా చాటి భారత జట్టుకు ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువకుడిని పలువురు అభినందించారు. -
నా మాటలు సాఫ్ట్వేర్..రూపం హార్డ్‌వేర్..
-స్నేహమే సినిమాల్లోకి రప్పించింది – హాస్యనటుడు రఘు కారుమంచి రాయవరం(మండపేట) : ఆయన ఆంధ్రాకు చెందిన వాడైనా..పెరిగింది తెలంగాణలోనే. అందుకే డైలాగులు పూర్తిగా తెలంగాణ యాసతో చెపుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాఫ్ట్వేర్ మార్కెటింగ్ ఇంజనీర్‌గా పనిచేస్తూ..అనుకోకుండా సినీ నటుడిగా మారానంటున్నారు ప్రముఖ హాస్య నటుడు రఘు కారుమంచి. స్నేహమే తనను సినీ ఫీల్డ్ వైపు అడుగులు వేయించిందంటున్న రఘు నటుడికి ట్రిపుల్ ‘టి’తో ప్రోత్సాహం ఉండాలంటున్నారు. రాయవరం సాయితేజా విద్యానికేతన్ 20వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఆయన విద్యానికేతన్ కరస్పాండెంట్ కర్రి సూర్యనారాయణరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సినీ ఫీల్డ్‌కు వస్తానని ఊహించలేదు.. ఎంబీఏ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివి చీఫ్ మార్కెటింగ్ ఇంజనీర్‌గా పనిచేసేవాడిని. హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ అపార్ట్మెంట్లో ఆఫీస్ నిర్వహిస్తుండేవాడిని. వీవీ వినాయక్, సురేందర్‌రెడ్డి అసిస్టెంట్ దర్శకులుగా ఉంటూ అదే అపార్ట్మెంట్లో ఉండేవారు. ప్రతి రోజూ కలుసుకోవడంలో మా మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతోనే సినీ ఫీల్డ్ వైపు అడుగులు వేశాను. ‘నేను దర్శకుడినయ్యాక నీకు వేషమిస్తా’నన్న వినాయక్ ‘ఆది’ సినిమాతో ఆ మాట నిలబెట్టుకున్నారు. ‘అదుర్స్’ తర్వాత ఉద్యోగానికి రాజీనామా.. ‘అదుర్స్’ సినిమా నా సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. 2010 వరకు జాబ్ చేస్తూనే నటిస్తుండేవాడిని. అప్పటి వరకు 30–40 సినిమాల్లో నటించాను. 2010 జనవరి తర్వాత 2016 వరకు 110 సినిమాలు చేశాను. ‘ఆది’ రిలీజయ్యాక ఏ రోజూ వేషం కావాలని ఎవ్వరినీ అడగలేదు. జాబ్ చేసుకుంటుండగానే ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. వృత్తిపరంగా నా మాటలు సాఫ్ట్‌వేర్‌గా ఉన్నా..నా రూపం హార్డ్‌వేర్‌గా ఉంటుంది. అదే ప్రేక్షకులకు దగ్గర చేసింది. ప్రతి వృత్తిలోనూ స్ట్రగుల్ ఉంటుంది.. ప్రతి వృత్తిలోనూ జాబ్ స్ట్రగుల్ అనేది ఉంటుంది. సినిమా రంగం మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. ఈ రంగంలోకి వచ్చినందుకు గర్వపడుతున్నాను. ఇప్పటి వరకు 170కి పైగా సినిమాల్లో నటించాను. టీవీ రంగంలో 1500 వరకు ఎపిసోడ్లు చేశాను. తెలుగు భాషతో పాటు తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో నటించాను. ట్రిపుల్ ‘టి’తో పాటు ప్రోత్సాహం అవసరం.. నటుడికి టాలెంట్, టైమ్, టైమింగ్ అవసరం. ఈ మూడింటితో పాటు ప్రోత్సాహం ఉండాలి. నాకు లభించిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చాను. కామెడీ నటుడిగా ప్రేక్షకులను అలరించాను. అయితే విలన్‌గా నటించి ప్రేక్షకులను మరింత మెప్పించాలనుంది. ప్రస్తుతం తెలుగులో 10 సినిమాలు, కన్నడంలో రెండు సినిమాలు చేస్తున్నాను. -
‘ఎస్’ ఫార్ములాతో విజయాలు సొంతం
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ ’ఎస్’ ఫార్ములాను పాటిస్తే విజయాలను సొంతం చేసుకోగలరని అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ నిపుణుడు, విద్యావేత్త డాక్టర్ రఘు కొర్రపాటి అన్నారు. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రానికి ఉన్నత విద్యా కమిషనర్‌గా వ్యవహరించిన ఆయన శుక్రవారం ఆదికవి నన్నయ యూనివర్సిటీని సందర్శించి, అధ్యాపకులు, విద్యార్థులతో కొద్దిసేపు మమేకమయ్యారు. ’స్మైల్, స్మార్ట్, స్పెసిఫిక్, సింపుల్ అండ్ స్మాల్’ అనే ఐదు లక్షణాలను అలవర్చుకోవాలన్నారు. ముఖంపై ఎల్లప్పుడు చిరునవ్వు ఉంటే అటువంటి వారితో స్నేహం చేయాలని, మాట్లాడాలని ఇతరులు కుతూహలం చూపిస్తారన్నారు. అలాగే రాక్ స్మార్ట్ ఫార్ములా ద్వారా పరిశోధనలు జరగాలన్నారు. పని చేయడాన్ని ఉత్సాహంతో ఒక ఆటగా భావించాలన్నారు. ఆ పని చిన్నౖదైనా, పెద్దదైనా మనస్సు లగ్నం చేసి చేయడంతోపాటు, సంస్థలో సహచరులతో సంయమనంతో వ్యవహరించాలన్నారు. దీనివల్ల పని ఒత్తిడి తగ్గడంతో పాటు మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఉపకులపతి ఆచార్య ఎస్.టేకి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య పి. సురేష్‌వర్మ, డాక్టర్ ఉదయ్‌భాస్కర్, డాక్టర్ రమేష్, పద్మవళ్లి, తదితరులు పాల్గొన్నారు. -
అలిపిరిమార్గంలో భక్తుడి మృతి
తిరుమల: శ్రీవారి దర్శనార్థం కాలినడకన వెళుతున్న ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. విజయవాడకు చెందిన రఘు(28) అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున కాలినడకన తిరుమల వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
జల్సాలకు కోసం దొంగతనాలు..
జల్సాలకు అలవాటుపడ్డ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి స్నేహితుడితో కలిసి దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలివీ.. షాద్‌నగర్ విజయ్‌నగర్ కాలనీలో నివసించే బి.రఘు(21) చేవెళ్ల సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. జులాయి తిరుగుళ్లకు మరిగిన ఇతడు షాద్‌నగర్‌కు చెందిన స్నేహితుడు ఎల్. నరేష్(20)తో కలిసి కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -10సిలోని గాయత్రిహిల్స్‌లో ఉన్న కిరాణ స్టోర్‌కు వెళ్లి సిగరెట్ కావాలంటూ అడిగాడు. ఆ వ్యాపారిని అడిగిన సిగరెట్లు ఇస్తుండగానే అక్కడున్న రూ.10 వేల విలువ చేసే సిగరెట్ల డబ్బాను తస్కరించి బైక్‌పై ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా వేసిన పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
చేతకాకుంటే తప్పుకోండి
టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆశించిన ఫలితాలు రాలేదు: కోదండరాం ► ప్రజల బతుకుదెరువు విస్తరించే ప్రయత్నాలు ఒక్కటీ లేవు ► వ్యవసాయం, కుల వృత్తులపై అధ్యయనం లేదు ► హైదరాబాద్ చుట్టూ తిరిగి జిల్లాలను విస్మరిస్తే ప్రజలు ఆమోదించరు ► కాంట్రాక్టు, రియల్ ఎస్టేట్‌కు అనుగుణంగా పనిచేస్తే ప్రయోజనం ఉండదు ► వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే రైతు ఆత్మహత్యలు ► పాలీహౌస్లతో పేద రైతులకు ప్రయోజనం శూన్యం ► ప్రజల కోసమే నిలబడ్డాం..లేకపోతే సంస్థను ఎప్పుడో టీఆర్ఎస్లో కలిపేవాళ్లం సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ అభివృద్ధి చేయడం పాలకులకు చేతకాకపోతే పక్కకు తప్పుకోండి. మేం చేసి చూపిస్తాం. రెండేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రజల బతుకుదెరువు విస్తరించే ప్రయత్నం ఒక్కటీ జరగలేదు. వ్యవసాయం, కుల వృత్తుల విధానాలపై అధ్యయనమే మొదలవలేదు. ప్రజలకు ఫలితాలు ఎప్పుడు అందుతాయి? మాకు దురాశ, పేరాశ లేదు. ప్రజలు బాగుండాలనేది మా అంతిమ లక్ష్యం. ఆ సోయి ఉండబట్టే నిలబడ్డాం. లేకపోతే ఈపాటికి సంస్థను ఎప్పుడో పార్టీలో కలిపేసి వాళ్ల వెనక తిరిగేవాళ్లం..’’ అని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తన అస్తిత్వాన్ని కాపాడుకునే దిశగా పయనించినప్పుడే లక్ష్యం నెరవేరినట్లు అవుతుందని స్పష్టంచేశారు. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు జి.రవీందర్రావు ఆధ్వర్యంలో ‘రెండేళ్ల తెలంగాణ- ప్రజా ఆకాంక్షలు- ప్రభుత్వ తీరుతెన్నులు’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ‘రెండేళ్ల టీఆర్ఎస్ పాలన-ఒక పరిశీలన’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా కాంట్రాక్టు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా పనిచేస్తే ప్రయోజనం ఉండదన్నారు. కేవలం హైదరాబాద్ చుట్టూనే తిరుగుతూ మిగతా జిల్లాలను విస్మరిస్తే ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదన్నారు. అత్యధిక మంది ఆధారపడే వ్యవసాయ రంగం, సూక్ష్మ పరిశ్రమల అవకాశాలను పెంచి ఆర్థిక స్థోమత కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని, అందుకే తాము కోర్టులను ఆశ్రయించామన్నారు. పాలీహౌస్ వంటి వాటి వల్ల పేద రైతులకు ఏమాత్రం ప్రయోజనం ఉండదన్నారు. కుల వృత్తుల విషయంలో ప్రభుత్వ యంత్రాంగానికి స్పష్టత లేదని, తాటిచెట్టు ఏ డిపార్టుమెంట్ కిందకు వస్తుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇటీవల ఒక గీతకార్మికుడు తాటిచెట్టు పైనుంచి పడి చనిపోతే అది తమ పరిధి కాదంటూ హార్టికల్చర్, ఎక్సైజ్ శాఖలు తప్పించుకున్నాయన్నారు. విద్యను ఉచితంగా అందించి, ప్రజల రోగాలకు సరైన చికిత్సలు అందిస్తే తెలంగాణలో మూడోవంతు ఆత్మహత్యలను నివారించవచ్చన్నారు. పనితీరుకు గెలుపే నిదర్శనం కాదు: ప్రొఫెసర్ హరగోపాల్ రాష్ట్రంలో జరిగే వరుస ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అది పనితీరుకు నిదర్శనం కాదని, కేవలం ప్రభుత్వంపై విశ్వాసంతోనే ప్రజలు ఓట్లు వేస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలు కాకుండా అంతా తమకే తెలుసునని సీఎం, మంత్రులు భావించడం మంచి పద్ధతి కాదని అన్నారు. అలా భావిస్తే అది వారి అవివేకమే అవుతుందని పేర్కొన్నారు. దేశం మొత్తంలో తెలంగాణకు ప్రత్యేకత ఉందని, నక్సల్బరి, భూస్వామ్య, ఆంధ్ర పెట్టుబడిదారి విధానాలపై తిరగబడిన చరిత్ర ఇక్కడి ప్రాంత సొంతమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉస్మానియా యూనివర్సిటీలోనే సభలు పెట్టుకోవద్దని డిక్టేట్ చేయడం సరికాదన్నారు. మల్లన్నసాగర్ కింద భూములు కోల్పోతున్న గ్రామాల ప్రజలు కొంత కాలంగా ఉద్యమిస్తున్నా... ఏ ఒక్క మీడియా బయటి ప్రపంచానికి చూపకపోవడం దురదృష్టకరమని సామాజిక వేత్త ఎన్.వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రజల గొంతు వినిపించకుండా నొక్కేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ప్రాజెక్టులు గుదిబండలే: రఘు ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులు భవిష్యత్తులో ప్రజలకు గుదిబండగా మారుతాయని విద్యుత్ జేఏసీ నేత రఘు స్పష్టంచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మణుగూరు విద్యుత్ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.10 వేల కోట్ల భారం పడుతుందని, పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందని, ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలపై రూ.9 వందల కోట్ల భారం పడుతుందన్నారు. దామరచర్ల ప్రాజెక్టు వల్ల రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లనుందన్నారు. ఇలా విద్యుత్ రంగంలోనే 32 సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వం ఒక్కదానికి పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. పైగా రెగ్యులేటరీ కమిషన్‌కు వెళ్లరాదంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదన్నారు. వ్యవసాయానికి 40 శాతం విద్యుత్ తగ్గడం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో కరెంట్ సమస్య కనిపించడంలేదని చెప్పారు. -
ఆటోడ్రైవర్ నిజాయితీ
► ఎస్పీ విశాల్ గున్నీ అభినందన ► రూ. 5 వేల నగదు బహుమతిగా అందజేత నెల్లూరు : ఆటోలో మరిచిపోయిన విలువైన ఆభరణాల బ్యాగును ప్రయాణికుడికి అందించి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. చింతారెడ్డిపాళెం యల మవారిదిన్నెకు చెందిన ఆటోడ్రైవర్ కాయల రఘును ఎస్పీ విశాల్‌గున్నీ శుక్రవారం అభినందించారు. రఘు వీఆర్సీ సెంటర్లో ఆటో స్టాండ్‌లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గూడూరు ఇందిరానగర్‌కు చెందిన గునపాటి మురహరిరెడ్డి తన పనిమనిషితో కలిసి ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చాడు. శుక్రవారం ఉదయం మినీబైపాస్‌లోని పీటీ రంగరాజన్ పెట్రోల్ బంకు వద్ద బస్సు దిగి చిల్డ్రన్స్‌పార్కు వద్దనున్న పుండరీ కాంక్షయ్య వీధిలోని స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు రఘు ఆటో ఎక్కారు. నాలుగు బ్యాగులను ఆటోలో తన వద్ద పెట్టుకున్న ఆయన నగల బ్యాగును మాత్రం వెనుక పెట్టాడు. స్నేహితుడి ఇంటి వద్ద దిగి తన వద్దనున్న నాలుగు బ్యాగులను తీసుకుని, నగల బ్యాగును పని మనిషి తెస్తుందని భావించి లోనికి వెళ్లాడు. ఆటోడ్రైవర్ వారిని దింపి వెళ్లిపోగా, పని మనిషి ఇంట్లోకి ఖాళీ చేతులతో రావడం గుర్తించిన మురహరిరెడ్డి నగల బ్యాగు ఎక్కడాని ప్రశ్నించాడు. ఆమె నివ్వెరపోవడంతో ఇంట్లో నుంచి పరుగులు తీసి ఆటో కోసం గాలించారు. జరిగిన విషయాన్ని బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ చెంచురామారావు తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాగులో రూ.10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, డైమండ్ రింగ్‌లు, లాప్టాప్, సెల్‌ఫోన్, రూ.40 వేల నగదు ఉందని బాధితుడు పేర్కొనడంతో ఆటోడ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని ఇంటి సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. కాగా ప్రయాణికులను దించి కొద్దిదూరం వెళ్లిన రఘు వెనుక బ్యాగు ఉండటాన్ని గమనించి బాధితులకు ఇచ్చేందుకు వెనక్కి వచ్చాడు. గమనించిన బాధితుడు, పోలీసులు ఆటో వద్దకు రాగా బ్యాగు అప్పగించాడు. ఆటోడ్రైవర్, పోలీసుల సమక్షంలో బాధితుడు బ్యాగును తెరచి చూసి అందులో అన్ని వస్తువులు పక్కాగా ఉండటంతో ఆటోడ్రైవర్‌ను అభినందించాడు. నగర డీఎస్పీ వెంకటరాముడి ద్వారా తెలుసుకున్న ఎస్పీ విశాల్‌గున్నీ నిజాయితీ పరుడైన ఆటోడ్రైవర్‌ను తన చాంబర్లో అభినందించారు. రఘును సహచర ఆటోడ్రైవర్లు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మురహరిరెడ్డి ఆటోడ్రైవర్‌కు ఎస్పీ ద్వారా మీదుగా రూ.5 వేలు నగదును బహూకరించారు. -
వీధిలో నుంచి విధాన సౌధకు.....
బెంగళూరు: అనాథగా పుట్టి అనాథాశ్రయంలో పెరిగి తండ్రెవరో తెలియని తనయుడిగా 14వ ఏట బయట ప్రపంచంలోకి అడుగుపెడితే ఆ బాలుడి బతుకు ఎలా ఉంటుంది? అగమ్య గోచరంగా, అంతులేని ఆవేదనాభరితంగా ఉంటుంది. అందులోనూ పెళ్లి కాకుండానే తల్లైన తల్లికి (అత్యాచారం కారణంగా) జన్మించిన రఘు లాంటి వ్యక్తికి ఇంకెలా ఉంటుంది. తనకంటూ సొంత గుర్తింపు లేకుండా అనాథాశ్రయం ఇచ్చిన పెట్టుడు పేరుతో బతకాలంటే మరీ మరీ కష్టం. ఎక్కడికెళ్లినా అవమానాలే, ఆటంకాలే ఏర్పడతాయి. సహజంగా ఇలాంటి పిల్లలు తప్పుదోవ పట్టి సమాజానికి చీడ పురుగుల్లా తయారవుతారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బల్లారి అనాథాశ్రయంలో పెరిగి సమాజంలోకి అడుగుపెట్టిన రఘు మాత్రం ఎన్నో అవమానాలు, కష్టాలకోర్చి నలుగురికి ఆదర్శంగా నిలిచాడు. పాస్‌పోర్టు కోసం రఘు ఓ రోజు పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లినప్పుడు కూడా అతనికి అవమానమే ఎదురైంది. తానెవరో నిరూపించుకోవడం, తనకంటూ ఓ గుర్తింపు కార్డును సాధించడం కష్టమైంది. పాస్‌పోర్టు దరఖాస్తులో తప్పనిసరిగా తండ్రి పేరు వెల్లడించాలంటూ పాస్‌పోర్టు సిబ్బంది చెప్పారు. తనకు తండ్రంటూ లేడని, అత్యాచారానికి గురైన యువతికి పుట్టానని ఎలా నిరూపించుకోగలడు. అందుకనే రఘు దరఖాస్తును స్వీకరించేందుకు కూడా పాస్‌పోర్ట్ కార్యాలయం సిబ్బంది నిరాకరించింది. అసలు పాస్‌పోర్టు చట్టంలో తండ్రి పేరు తప్పనిసరా అన్న నిబంధన ఉందా? అన్న విషయాన్ని ఆయన శోధించాడు. దరఖాస్తు దారుడి నుంచి తండ్రి పేరును ఇన్సిస్ట్ చేయరాదన్న క్లాజ్‌ను వెతికి పట్టుకొని మళ్లీ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లాడు. చట్టం గురించి వివరించాడు. అయినా వారు పట్టించుకోలేదు. ఉన్నతాధికారిని కలిసేందుకు కూడా అంగీకరించలేదు. చివరకు ఓ రోజు కార్యాలయం మూతపడే సమయం వరకూ ఉండి ఉన్నతాధికారిని కలుసుకొని పాస్ పోర్టును సాధించాడు. ఈ నేపథ్యంలో తానెవరో, తన తల్లి ఎక్కడ ఉంటుందో, తన మూలాలను తెలుసుకోవాలనుకున్నాడు రఘు. తండ్రి గురించి తెలియలేదుగానీ ప్రభుత్వ మహిళా సంక్షేమ ఆశ్రమంలో తన తల్లి ఉంటున్న విషయాన్ని కనుగొన్నాడు. పిచ్చిదానిగా మారిన తన తల్లికి చెవుడు, మూగ అని తెలిసి, కళ్లు కూడా సరిగ్గా కనిపించవని గ్రహించి తల్లడిల్లాడు. తాను బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజులు గుర్తొచ్చాయి. రైలంటే ఎలా ఉంటుందో, రైల్వే స్టేషన్ ఎక్కడుంటుందో కూడా తెలియకుండా 14 ఏళ్ల వరకు పిల్లల అనాధాశ్రయంలోని నాలుగు గోడల మధ్య పెరిగిన రఘుకు బయటకు వచ్చాక తొలి ఆశ్రయం రైల్వే స్టేషనే అయింది. అక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ బతికాడు. కొంతకాలానికి మైసూరుకు వెళ్లి అక్కడ మార్కెట్లో పని చేశాడు. తనలాంటి అనాథలను ఆదుకోవాలని, వారికో ఆశ్రయం కల్పించాలని నిశ్చయానికి వచ్చాడు. అందుకోసం రేయింబవళ్లు పని చేశాడు. దాదాపు నాలుగు లక్షల రూపాయలు కూడబెట్టాడు. అతని మిత్రుడు... రఘును మోసం చేసి ఆ మొత్తం సొమ్మును ఎత్తుకు పోయాడు. ఇక అక్కడ పని చేయాలనిపించక బెంగళూరుకు వెళ్లి ఏదో ఒక పని చేయాలనుకున్నాడు. ప్రయాణంలో ఆరోగ్యం క్షీణించింది. దాంతో మళ్లీ మైసూరునే ఆశ్రయించాడు. దొరికిన ఉద్యోగం చేస్తూ ప్రైవేట్‌గా డిగ్రీ చదవుతున్నాడు. ఆరోగ్యం క్షీణించి హృద్రోగ సమస్యలు కూడా వచ్చాయి. గత జనవరి నెలలో రఘు గురించి స్థానిక మీడియా వార్తా కథనం రాయడంతో దాన్ని చదవిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్పందించారు. రఘును పిలిచి తనవద్ద గుమస్తా ఉద్యోగం ఇచ్చారు. ఇంతకాలానికి రఘుకు స్థిరమైన ఉద్యోగం వచ్చింది. ఇక చదువుకు ఎలాంటి ఆటంకం ఏర్పడదని, శ్రద్ధగా చదువుకుంటానని చెబుతున్నాడు. ఇప్పటికీ సరైన గుర్తింపు లేని తనకు ఎస్సీ లేదా ఎస్టీగా గుర్తిస్తే సివిల్స్‌కు కూడా ప్రిపేర్ అవుతానని చెబుతున్నాడు. -
ఏఈని సస్పెండ్ చేసిన కలెక్టర్
మెదక్ జిల్లా నారాయణఖేడ్ గురుకుల బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేయాడానికి వచ్చిన కలెక్టర్ భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఏఈని సస్పెండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ గురుకుల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతన భవన పనులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను పర్యవేక్షి స్తున్న ఏఈ రఘు పనితీరును ఆయనను విధుల నుంచి తొలగించారు. -
ఈ అదృష్టం అందరికీ రాదు
కమెడియన్ రఘు విశాఖపట్నం ( పెదగంట్యాడ) : నటనకు అందం, శిక్షణ, ఇవేమీ లేకుండా కూడా కేవలం నటించాలనే తాపత్రయంతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రఘు. మామూలుగా రఘు అంటే ఎవరూ గుర్తు పట్టరు. అదుర్స్ సినిమాలో ఒక సీన్లో ‘కొవ్వు ఎక్కువయ్యి నీకు తెలీట్లేదు గానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపయ్యింది...ఎంత సెలైంట్‌గా ఎసేశావన్నా...’ ఈ డైలాగ్స్ వింటే ఆ కమెడియన్ ఎవరో ఈజీగా తెలిసిపోతుంది. యారాడ బీచ్‌లో సునీల్ సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వచ్చిన రఘుని సాక్షి పలకరించింది. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. ఇదీ నేపథ్యం... మా నాన్న ఆర్మీలో జాబ్ చేసేవారు. చిన్నప్పుడు కొన్ని రోజులు విశాఖలో ఉన్నాను. అమ్మ హౌస్‌వైఫ్. నాకొక తమ్ముడు ఉన్నాడు. తను ఇంజినీర్, తనకొక సొంత కంపెనీ ఉంది. నేను మాత్రమే సినీ ఫీల్డ్‌లో కంటిన్యూ అవుతున్నాను. సాఫ్ట్వేర్ వదిలి సినిమాల్లోకి... నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేసేవాడిని. చేతుల్లో సంపాదన, వసతులు అన్ని సక్రమంగా జరిగేవి. మా ఇంటి దగ్గర్లో వి.వి. వినాయక్, సురేందర్‌రెడ్డి ఉండేవాళ్లు అప్పటికి వారు దర్శకులు కాలేదు. అసిస్టెంట్ డైరక్టర్లుగా పని చేసేవారు. మామూలుగా పరిచయం, ఫ్రెండ్షిప్ వల్ల నా బాడీ లాంగ్వేజ్, తెలంగాణ యాసలో మాటతీరు సినిమాల్లో చాలా బావుంటుందని ఒక వేళ డైరక్టర్‌గా చాన్స్ వస్తే ఫస్ట్ సినిమాలో అవకాశం ఇస్తామని ఇద్దరూ అనేవారు. నేను కూడా అంత సీరియస్‌గా తీసుకోలేదు. 2001లో వినాయక్ నాకు ఫోన్ చేసి రమ్మంటే వెళ్లాను. ఆఫీస్‌కు వెళ్లాక సినిమాలో నీకు చాన్స్ ఇస్తాను చేస్తావా అని అడిగారు. ‘నాకు ఎవరు చాన్స్ ఇస్తారన్నా.. యాక్టింగ్ కూడా నాకు రాదు’ అని అన్నాను. అయినా వినకుండా సెట్‌కు తీసుకెళ్లారు, కానీ సెట్‌కు వెళ్లేసరికి వినాయక్ డెరైక్టర్‌గా ఉన్నాడు. నేను అప్పటికే షాక్‌లో ఉన్నాను. అదే నా ఫస్ట్ సినిమా ‘ఆది’. అందులో సింహాద్రి క్యారెక్టర్. అప్పుడే వినాయక్ చెప్పారు నాలుగేళ్ల క్రితం నీకు సినిమాలో క్యారెక్టర్ ఇస్తానని చెప్పాను కదా అదే ఇది అన్నారు. తెలియకుండానే నటించా... స్టిల్ కెమెరాలో ఫొటోలు తీసుకోవడం తప్ప వీడియో కెమెరాలో రీల్ ఉంటుందని, అది రోల్ అవుతుందని, నేను చేసేది దానిలో రికార్డ్ అవుతుందని కూడా తెలీకుండా యాక్టర్‌ను అయ్యాను. డెరైక్టర్ చెప్పింది ఫాలో అవ్వడం తప్ప నాకు మరో ఛాన్స్ లేదు. అలాగే చేశాను...అందరికీ నచ్చి చప్పట్లు కొట్టేవారు. ఆశ్చర్యంగా చూడడం నావంతయ్యేది. ఇప్పుడు కెమెరా గురించి తెలుసు యాక్టింగ్ గురించి తెలుసు...అయినా బ్లాంక్‌గా సెట్‌కు వెళ్తాను.. డెరైక్టర్ చెప్పింది చేస్తాను. నచ్చకుంటే మళ్లీ మళ్లీ చేస్తాను...అంత కంటే ఎక్కువ ఆలోచించను. ‘అదుర్స్’ ఇంటిపేరైంది... నేను ఇప్పటి వరకూ 150 సినిమాలు చేశాను. అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడి పని చేస్తాను. అదుర్స్ సినిమా వరకూ నేను 40 సినిమాల్లో యాక్ట్ చేశాను. అదుర్స్ సినిమా 2010లో వచ్చింది. దాని తర్వాత నేను 110 సినిమాలు చేశాను. ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్స్‌లో అదుర్స్ రఘుని ఆహ్వానిస్తున్నాం.. అని పిలవగానే వినాయక్ గారి ముఖంలో సంతోషం కనిపిస్తుంది. ఆయన సినిమాల్లో క్యారెక్టర్ చేసి ఇంత పేరు వచ్చింది. దానినే ఇంటి పేరులా మార్చుకోవడం ఆయనకు నచ్చింది. అదుర్స్ తర్వాత వెంటనే ఆఫర్స్ వెల్లువలా వస్తాయని అనుకున్నాను. కానీ ఏడాదిన్నర కాలం ఖాళీగానే ఉన్నాను. తర్వాత తర్వాత ప్రతి సినిమాలో నా కోసం క్యారెక్టర్ రాయడం ప్రారంభించారు. ఇలా నవ్వించడమే లక్ష్యం సాఫ్ట్వేర్ రఘు అంటే కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. కానీ యాక్టర్ రఘు అంటే అందరికీ తెలుస్తుంది. కష్టాలెన్ని ఉన్నప్పటికీ సినిమాల్లో డబ్బు, గుర్తింపు ఉంటుంది. ఈ అదృష్టం అందరికీ రాదు. వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను చూసిన ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వితే చాలు అనుకుంటా.. అదే నాకు ఆక్సిజన్‌లాగా పని చేస్తుంది. ప్రేక్షకుల అభిమానం వల్లే ఇంత గుర్తింపు వచ్చింది. అందుకే వాళ్లను నవ్వించడం నాకు ధ్యేయం... ఆనందం.. లక్ష్యం.. అన్నీను. వైజాగ్ ఎప్పుడూ స్పెషలే... నేను వైజాగ్‌లో చిన్నప్పుడు కొన్నాళ్లు ఉన్నాను. అక్కయ్యపాలెం దగ్గర్లో ఉండేవాళ్లం...దొండపర్తి రోడ్లో విజ్ఞాన నికేతన్ స్కూల్ ఉండేది అక్కడే చదువుకునేవాడిని. ఎప్పుడు వైజాగ్ వచ్చినా రైల్వే గ్రౌండ్స్ గుర్తుకు వస్తాయి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడడానికి వెళ్లేవాడిని, ఆర్కే బీచ్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా వైజాగ్ నాకు ఎప్పుడూ స్పెషలే. 1994లో వైజాగ్‌లో కొన్నాళ్లు ఉన్నాను. కోస్టల్ బీజియంను చూసుకునేవాడిని, గీతం యూనివర్సిటీ, ఐటీ కంపెనీలు, ఎన్ఎస్టీఎల్, షిప్‌యార్డ్, జింక్ వీళ్లందరికీ సిస్టమ్ ఇన్స్టాల్ చెయ్యడానికి వస్తూండేవాడిని. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఎప్పుడైనా బయటకు వెళ్లాలనిపిస్తే వైజాగ్ వచ్చేస్తాను. -
జ్యోతికను హెచ్చరించిన సూర్య!
దంపతులు సూర్య, జ్యోతికలకు సినిమా కొత్తేమీ కాదు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. అయితే సూర్యను వివాహం చేసుకున్న తరువాత జ్యోతిక నటనకు దూరంగా ఉన్నారు. పలు అవకాశాలు వచ్చినా తిరస్కరించారు. అలాంటిది ఇద్దరు పిల్లల తల్లి అయిన జ్యోతిక మంచి కథా చిత్రం అయితే మళ్లీ నటించాలనే నిర్ణయానికి వచ్చారు. తన ఆలోచనను భర్త సూర్య చెవిలో వేశారు. ఆయన స్పందిస్తూ నువ్వు నటించే చిత్రాన్ని ఎవరో ఎందుకు తానే నిర్మిస్తానని ముందుకొచ్చారు. అప్పటికే మలయాళంలో ఘన విజయం సాధించిన హౌఓల్డ్ఆర్ యు చిత్రం ఈ దంపతులకు బాగా నచ్చేసింది. ఇంకేముంది హౌఓల్డ్ఆర్యు చిత్రాన్ని తమ 2డీ పిక్చర్స్ పతాకంపై తమిళంలో రీమేక్ చేయడం మొదలెట్టారు. ఇందులో జ్యోతిక ప్రధాన పాత్ర పోషిస్తుండగా ఆమె సరసన రఘు నటిస్తున్నారు. చిత్రం షూటింగ్ కొంత భాగాన్ని ఢిల్లీలో చిత్రీకరించారు. ప్రస్తుతం చెన్నైలో నిర్వహిస్తున్నారు. జ్యోతిక ఇంతకుముందు నటించేటప్పుడు మధ్య మధ్యలో విరామం తీసుకునేవారు. ఈ చిత్రం విషయంలో మాత్రం క్షణం కూడా తీరికలేకుండా నటిస్తున్నారట. చిత్ర నిర్మాణ బడ్జెట్ పెరిగితే వ్యాపారం చేయడం కష్టమని సూర్య హెచ్చరించడంతో సెట్లో ఫోన్ మాట్లాడడానికి కూడా సమయం లేనంతగా జ్యోతిక పనిలో వేగం పెంచినట్టు సమాచారం. -
రెండు ప్రాణాలను బలిగొన్న క్షణికావేశం
-
రెండు ప్రాణాలను బలిగొన్న క్షణికావేశం
*పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం *అక్కడికక్కడే భార్య.. చికిత్స పొందుతూ భర్త మృత్యువాత *చండూరు మండల కేంద్రంలో ఘటన చండూరు: క్షణికావేశంతో భార్యభర్త బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన చండూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాతాల రఘు(32) హైదరాబాద్‌కు చెందిన కల్పన(28)ను 3సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. రఘు వృత్తిరీత్యా వైద్యుడు. మండల కేంద్రంలోనే సంజీవిని వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. వీరికి 11నెలల కూతురు(చిన్ని) ఉంది. కాగా భార్యాభర్తలిద్దరూ ఇటీవల కొన్ని రోజులుగా కుటుంబ విషయాల్లో గొడవ పడుతున్నారు. మంగళవారం సాయంత్రం కూడా ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో కల్పన పత్తిపంటకు వాడే మోనోక్రొటోఫాస్‌ను తాగింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనను చూసిన భర్త రఘు తట్టుకోలేక మిగిలిన మందును తాగాడు. ఆపస్మారక స్థితికి చేరిన అతడిని నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రఘు కూడా మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. -
రైతు కోసం....
గౌహతి-ఐఐటి నుంచి పట్టా పుచ్చుకున్న రఘు కంచుస్తంభం తాను రూపొందించిన యాప్ ద్వారా ప్రపంచదృష్టిని ఆకరిస్తున్నారు. ఈ హైదరాబాదీ రూపొందించిన ‘లైవ్లీహుడ్ 360’ యాప్ ‘ది బెస్ట్ యాప్ ఇన్ ఏషియా కేటగిరి’లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించింది. ‘లైవ్లీహుడ్’ను అరకులోయ ప్రాంతంలోని 650 గ్రామాలకు చెందిన 12,000 మంది రైతులు ఉపయోగిస్తున్నారు. రైతుల పంటకు సంబంధించిన దిగుబడి, చెల్లించాల్సిన ధర...మొదలైన వివరాలను ఈ యాప్ ద్వారా త్వరితగతిన తెలుసుకోవచ్చు. ప్రతి రైతుకు ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. మీట నొక్కితే చాలు...బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంతో సహా ఎన్నో వివరాలు తెలుసుకోవచ్చు. కేవలం ఇది మాత్రమే కాక ఒక ప్రాంతానికి సంబంధించిన పారిశుధ్యం, అక్షరాస్యత వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ‘‘పంట ఉత్పత్తుల అమ్మాకానికి సంబంధించిన డబ్బు...ఈ యాప్ ద్వారా త్వరగా చేతికందుతుంది’’ అంటున్నారు రఘు. రఘు రూపొందించిన యాప్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకుంది. అన్నిటి కంటే ముఖ్యంగా రైతు కళ్లలో కాంతి నింపింది. -
వేట
ఎల్లంగౌడ్ కోసం ముమ్మరంగా పోలీసుల గాలింపు రంగంలోకి ప్రత్యేక బృందాలు సాక్షి, సిటీ బ్యూరో: నకిలీ నోట్ల తయారీ ముఠా నాయకుడు, మెదక్ జిల్లాకు చెందిన ఎల్లంగౌడ్ కోసం సైబరాబాద్ పోలీసులతో పాటు మరో రెండు జిల్లాల పోలీసులు గాలిస్తున్నారు. కానిస్టేబుల్ ఈశ్వర్రావు మృతికి కారకులైన ముఠాను ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఈ ముఠాలోని సభ్యులు రఘు, నరేష్, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎల్లంగౌడ్ కోసం సైబరాబాద్, రంగారె డ్డి, మెదక్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగలోకి దింపారు. పారిపోతూ చిక్కిన శ్రీకాంత్... ఘటనా స్థలంలో ఎస్ఐ వెంకట్‌రెడ్డి జరిపిన కాల్పుల్లో తన అనుచరుడు ముస్తఫా అక్కడికక్కడే మృతి చెందడంతో, షిఫ్టు కారును అక్కడే వదిలిన శ్రీకాంత్ మజీద్‌పురాకుపరుగుతీశాడు. అతన్ని అనుమానించిన గ్రామస్తులు పట్టుకున్నారు. తాను కారు డ్రైవర్‌నని.. రాజీవ్ రహదారిపై యాక్సిడెంట్ జరిగిందని.. అందరూ కొడుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చానని గ్రామస్తులను నమ్మించాడు. తిరిగి రాజీవ్ రహదారికి ఎలా చేరుకోవాలో చెప్పాలని వారినే కోరాడు. గ్రామస్తుడి నుంచి రూ.10 తీసుకుని, లారీ కోసం రహదారిపై వేచి చూస్తుండగా, శామీర్‌పేట ఠాణా పెట్రోలింగ్ సిబ్బంది హైజలీ, హెచ్.కె.రవిలు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని అధికారులకు అప్పగించారు. అలా కలిశారు... ముస్తఫా (22) మెదక్ జిల్లా సిద్దిపేట వాసి. ఎల్లంగౌడ్ సిద్దిపేట మండలం ఇమాంబాద్ గ్రామవాసి. సిద్దిపేట సమీపంలోని కాళ్లకుంట కాలనీలో రాజు అలియాస్ చిన్నా అనే యువకుడు సుమారు మూడు నెలల క్రితం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నా కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపేందుకు ముస్తఫా, ఎల్లంగౌడ్‌లు వచ్చారు. అక్కడే వారిద్దరికి పరిచయం ఏర్పడింది. పంచాయతీలు, సెటిల్మెంట్లు, దాడులు, చోరీలు, దోపిడీలు, అరాచకాలలో ఆరితేరిన ఎల్లంగౌడ్‌కు ముస్తఫా ఆయుధమయ్యాడు. నేరాలకు మారుపేరు ఎల్లంగౌడ్ దాదాపు ఎనిమిదేళ్లుగా సిద్దిపేట, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, జహీరాబాద్, మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతాల్లో ఎల్లంగౌడ్‌పై 12 కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై విడుదలై మళ్లీ తన అరాచకాలను కొనసాగించాడు. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఎల్లంగౌడ్ తండ్రి అంజాగౌడ్, తల్లి లచ్చవ్వ, భార్య భాగ్యలు స్వగ్రామం ఇమాంబాద్‌లో హోటల్, కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నారు. కాసులు ఇస్తే దాడులకు సై... సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్‌లోని పేద కుటుంబంలో జన్మించిన ముస్తఫా విద్యార్థి దశలోనే విలాసాలకు అలవాటు పడ్డాడు. సుమారు మూడేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన ముస్తఫా డబ్బు ఇస్తే ఎంతటి నేరమైనా చేసేవాడు. ఎల్లంగౌడ్‌తో పరిచయం ముస్తఫాను పెద్ద నేరస్తుడిగా మార్చేసింది. ఈ నేపథ్యంలో ఆయనపై ఐదు కేసులు నమోదయ్యాయి. అతడి తండ్రి జహంగీర్ హైదరాబాద్‌లో వాచ్‌మన్‌గా, తల్లి సలీమ బీడీ కార్మికురాలిగా, సోదరుడు గౌస్ ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్లేవాడని, ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తే... ‘అడగవద్ద’ని ఎదురు సమాధానం చెప్పేవాడని సమాచారం. ఆ ఎస్ఐ సనత్‌నగర్‌లో పని చేశారు.. సంజీవరెడ్డినగర్: దుండగులను పట్టుకునే ప్రయత్నంలో కత్తిపోట్లకు గురైన ఎస్ఐ వెంకట్‌రెడ్డి గతంలో సనత్నగర్పోలీస్ స్టేషన్లో పనిచేశారు. ఆరు నెలలుగా బాలానగర్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ వద్ద అటాచ్గా పని చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. ఎస్ఐ ప్రస్తుతం బోరబండ గాయత్రీనగర్‌లో నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆయన నివాసానికి వచ్చి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను ఆరాతీస్తున్నారు. -
'కిడ్నాపైన ఇంజినీర్లను రక్షించండి'
హైదరాబాద్: నాగాలాండ్‌లో కిడ్నాపైన విజయవాడకు చెందిన ఇద్దరు ఇంజినీర్ల విడుదల కోసం ఆంధ్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఆ ఇంజినీర్లు విడుదలకు చర్యలు చేపట్టాలని నాగాలాండ్ ప్రభుత్వంతో చర్చించినట్లు న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు వెల్లడించారు. వారి విడుదలపై నాగాలాండ్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుతున్నామని తెలిపారు. నాగాలాండ్‌లోని పృధ్వీ కన్స్ట్రక్షన్ కంపెనీలో విజయవాడకు చెందిన ఇంజినీర్లు ప్రదీశ్ చంద్ర, రఘులు సూపర్ వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన వారు స్వస్థలం విజయవాడకు బయలుదేరేందుకు నాగాలాండ్‌లోని దిమాపూర్ చేరుకున్నారు. ఆ క్రమంలో ఆ ఇద్దరు ఇంజనీర్లతోపాటు మరో వ్యక్తిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అయితే ముగ్గురులో ఓ వ్యక్తి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని... కిడ్నాపైన ఇంజినీర్ల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దాంతో వారు పృధ్వీ కన్స్ట్రక్షన్ యాజమాన్యంతో సంప్రదించారు. రఘు, ప్రతీశ్ చంద్రలు కిడ్నాప్ అయిన విషయం నిజమేనని.... వారిని విడుదల చేయాలంటే రూ. 20 లక్షలు తమకు అందజేయాలని బోడో తీవ్రవాదులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దాంతో బోడో తీవ్రవాదుల చెరలో ఉన్న తమ వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని రఘు, ప్రతీశ్ చంద్ర కుటుంబసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఇద్దరు తెలుగు ఉద్యోగుల అపహరణ
అసోం : అసోంలో ఇద్దరు తెలుగువారిని బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్ అయిన రఘు, ప్రదీప్‌లు పృధ్వీ కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. వారిని విడుదల చేసేందుకు తీవ్రవాదులు రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా తమ కుమారుల కిడ్నాప్ సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ అయినవారిలో ఒకరు విజయవాడకు చెందినవారు. కాగా గతంలోనూ బోడో తీవ్రవాదులు....అక్కడ పనిచేసే తెలుగు వారిని అపహరించుకు వెళ్లిన విషయం తెలిసిందే. -
పదేళ్లలోపు చిన్నారుల్లో చూపు తగ్గుతోంది..
- పదేళ్లలోపు చిన్నారుల్లో పోషకాహార లోపం.. - ఆహారపు అలవాట్లు, చీకటి గదుల్లో విద్యాబోధనే కారణం - తల్లిదండ్రులూ.. పారాహుషార్ గతంలో కంటిచూపు తగ్గిపోతోందంటే వృద్ధాప్యం దగ్గరపడుతుందని భావించేవారు. ప్రస్తుతం జీవనశైలి, ఆహారపు అలవాట్లు వెరసి వయసుతో నిమిత్తం లేకుండానే చూపు మందగిస్తోంది. పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారుల్లో చూపు సమస్య ఎక్కువగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాసంస్థలు జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రతి చిన్నారి కళ్లజోళ్లతో పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ హెల్త్ :జిల్లాలో కంటిచూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పది సంవత్సరాల లోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. పదేళ్లలోపు ఉన్న వంద మంది చిన్నారులను పరిశీలిస్తే.. నల్గురికి పైగా దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కంటిఅద్దాలు సమకూర్చినా చూపు బాగుపడని పరిస్థితి ఉంది. పిల్లల్లో చూపు తగ్గడానికి అనేక కారణాలున్నారుు. ప్రధానంగా కంటిచూపు తగ్గడానికి జన్యుపర సమస్య ఒకటైతే, విటమిన్-ఏ లోపం, తగినంత వెలుతురు లేని గదుల్లో విద్యాభ్యాసం చేయడం, అదేపనిగా వీడియో గేమ్స్, కంప్యూటర్, టీవీ చూడటం వ ంటివి కూడా కారణమవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కంటిచూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరునెలలకో సారి ఏ-విటమిన్ పిల్లలకు అందిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం ఉండడం లేదు. విటమిన్ ‘ఏ’ ద్రవం అందించే కార్యక్రమం పకడ్బందీగా చేపట్టకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఆరోపణలున్నారుు. పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కంటిచూపు సమస్యతో బాధపడుతున ్న వారిలో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు.. వీరిలో ఎక్కువ మంది ఉన్నత వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రెండు లక్షల వరకు ఉంది. వీరిలో నాలుగు శాతం పదేళ్ల వయసులోపు పిల్లలు ఉండగా ... 11 నుంచి 16 సంవత్సరాల లోపు వారు ఎక్కువ గా ఉంటున్నారు. చూపు తగ్గడానికి కారణాలు ఇవీ.. - పిల్లలకు పాలు, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పుదినుసులు, అసవరం అయినంతమేరకు తీసుకోకపోవడంతో ఏ-విటమిన్, కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపుతోపాటు ఇతర ఆరోగ్యసమస్యలూ వస్తాయి. - వెలుతురు, గాలి లేని ఇరుకుగదుల్లో విద్యాభ్యాసం చేయడం. - గతంలో బ్లాక్‌బోర్డుపై చాక్‌పీస్‌తో అక్షరాలు రాసేవారు. ఈ అక్షరాలు కళ్లకు ఇబ్బంది కలగకుండా పెద్దగా కూడా కనిపించేవి. తరగతి గదిలో చివరివరుసలో కూర్చున్నా..అక్షరాలు స్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు బ్లాక్ బోర్డుల స్థానంలో వైట్‌బోర్డుపై మార్కర్‌తో చిన్న అక్షరాలు రాస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఫలితంగా కళ్లపై ఒత్తిడిపడి నరాలపై ప్రభావం చూపి చూపు తగ్గుతోంది. - ప్రస్తుతం పుస్తకాల్లో అక్షరాలు కూడా మరీ చిన్నవిగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతోంది. - టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్స్ ఆడే పిల్లల్లో ఈ కంటిచూపు సమస్య ఉత్పన్నమవుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, ద్రాక్ష, బొప్పాయి, చిలగడ దుంపలు వంటి తినడంతో కంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న ఏదైనా వ స్తువును తదేకంగా చూడాలి. తర్వాత దగ్గరగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా ఐదారుసార్లు చేయడంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూసి తెరుస్తుండడం మరిచిపోవద్దు. పిల్లలు, పెద్దలు ఎలాంటి సమస్యలేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చిన ప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేందుకు పెద్దలూ జాగ్రత్తలు తీసుకోవాలి. - రఘు, కంటి వైద్య నిపుణులు -
డ్రంక్ ఆండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సినీ కొరియోగ్రాఫర్ రఘు
-
ఒకరు సచిన్‌లా... ఒకరు ధోనీలా...
సినిమా... క్రికెట్ ... వీటిలో దేనిపై ఎక్కువ మక్కువ? వెంటనే సమాధానం చెప్పడం కష్టం. క్రికెటర్లు తెరపై కనిపించడం చాలా తక్కువ. కానీ, నటులు క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టి చాన్నాళ్లయింది. సరదా కోసమో, నిధుల సేకరణ నిమిత్తమో సినీ తారలు బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వచ్చిన సందర్భాలు 1950ల నాటి నుంచి ఉన్నాయి. ఇక, ఇటీవలి కాలంలో స్టార్ క్రికెటర్లు ఏటా ఏదో ఒక సందర్భంలో క్రికెట్ స్టేడియంలో దాదాపు ప్రొఫెషనల్స్‌లా తమ ప్రతిభను చూపిస్తూ ఉన్నారు. ఒకరు సచిన్‌లా... మరొకరు ధోనీలా మైదానంలో చెలరేగుతున్నారు. అటు సినిమా ఫ్యాన్స్, ఇటు క్రికెట్ ఫ్యాన్స్ కేరింతల మధ్య సిక్స్‌లు, ఫోర్లు కొడుతూ అభిమానాన్ని బౌండరీలు దాటిస్తున్నారు. ఓ వైపు షూటింగ్, మరోవైపు క్రికెట్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్న స్టార్ క్రికెటర్లను పలకరిస్తే వారు ఎన్నెన్నో కబుర్లు చెప్పారు. సేవ పేరుతో మొదలైన స్టార్ క్రికెట్ ఆటలు ఇప్పుడు కప్‌లు గెలుచుకునేవరకూ వెళ్లాయి. మూడేళ్లుగా పరభాషా నటులతో కలిసి మన స్టార్లు ఆడుతున్న మ్యాచ్‌లను చూస్తుంటే సినిమా అభిమానులకు, క్రికెట్ అభిమానులకు కన్నుల పండువలా ఉంది. ఇలా క్రికెటర్ల అవతారమెత్తి స్టేడియంలో దర్శనమివ్వడం హీరోలకు కూడా కొత్తగా, గర్వంగా ఉంటోంది. క్రికెటర్ల హోదాలో అందుకుంటున్న ఆతిథ్యం దగ్గర నుంచి కొట్టే సిక్స్, పట్టే క్యాచ్ వరకూ అన్నీ వారికి అపురూపమైన జ్ఞాపకాలే. ఇంత గొప్ప వేడుక వెనుక వారు చేస్తున్న కసరత్తు విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. మూడు వారాల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర ఔటర్రింగ్రోడ్డుకి సమీపంలోని ఓ గ్రౌండ్లో మన ‘తెలుగు వారియర్స్’ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. రోజుకి ఐదు గంటల చొప్పున వారానికి నాలుగురోజులు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్న మన హీరోల సాధన అనుభవాలు వింటే మనకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. సాధనే గెలుపు మంత్రం: వెంకటేష్ ఏ ఆటకైనా సాధన ఉండాలి. అదే గెలుపునకు దారి చూపెడుతుంది. ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా అవసరం. సిసిఎల్4 (సెల బ్రెటీ క్రికెట్ లీగ్4) స్టార్ క్రికెటర్స్‌కి ఇది చాలా అవసరం. పైగా ఇది మన ఊళ్లో మనవాళ్లతో ఆడుతున్న ఆటకాదు. ఎనిమిది రాష్ట్రాల నుంచి ఎనిమిది టీమ్‌లు బరిలోకి దిగాయి. అన్నీ కూడా నువ్వా...నేనా అన్నట్టు ఉన్నాయి. అలాగని ఇది పూర్తిగా ఒత్తిడిని ఎదుర్కొనే గేమ్ కాదు. చాలా ఆరోగ్యకరమైన పోటీ. మన దేశంలోని సినిమా రంగం ఆటపేరుతో ఏర్పాటు చేసుకున్న అందమైన వేదిక. మా తెలుగు వారియర్స్ జట్టు చాలా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. నేను కూడా ఇక్కడికి రోజూ వస్తున్నాను. ఇంట్లో రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌తో పాటు ఇక్కడ ఆట నన్ను మరింత ఫిట్‌గా ఉంచుతోంది. ఈ మధ్యనే కాలికి గాయం అవ్వడం వల్ల కొన్నిసార్లు బ్యాటింగ్ నుంచి తప్పుకుంటున్నాను. వైస్ కెప్టెన్ అఖిల్ దగ్గర నుంచి నిఖిల్ వరకూ అందరూ చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈసారి పవర్‌ప్లేలో(మొదటి ఆరు ఓవర్లలో) హీరోలు మాత్రమే ఆడాలి. సిసిఎల్ పేరుతో ఏడాదిలో నెల రోజులు మరో ప్రొఫెషన్లో బిజీగా గడపడాన్ని స్టార్ క్రికెటర్లందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కోరిక తీరింది: అఖిల్ చిన్నప్పటి నుంచి క్రికెటర్‌ను అవ్వాలన్న కోరిక ఇప్పుడు తీరిపోయింది. క్రికెట్ అంటే ఇష్టం ఉండని అబ్బాయి ఎవరుంటారు చెప్పండి. తెలుగు వారియర్స్‌కి వైస్ కెప్టెన్‌గా ఆడుతున్నాను. క్రికెట్‌పై నాకున్న ఆసక్తి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి ఆదివారం క్రికెట్ ఆడాల్సిందే. రెండే రెండు కారణాలు మాత్రం నా ఆదివారం ఆటను ఆపగలవు. ఒకటి వర్షం, రెండోది నేను ఊళ్లో లేకపోవడం. నేను ఆస్ట్రేలియాలో చదువుకున్న రోజుల్లో కూడా క్రికెట్టే నా ప్రపంచం. ప్రతి వీకెండ్‌కి అక్కడ స్పెషల్ మ్యాచ్‌లు ఆడేవాడిని. అందులో భాగంగా కొంత శిక్షణ కూడా తీసుకున్నాను. ఇక ఇక్కడ ప్రాక్టీస్ అంటారా...ఒక్కరోజు ఎగ్గొట్టినా లోపల భయం మొదలవుతుంది. పైగా వైస్ కెప్టెన్ కావడంవల్ల టీం ప్రాక్టీస్‌ని సీరియస్‌గా గమనించే బాధ్యత కూడా నేను చూసుకోవాలి. వెంకీ అంకుల్ అందిస్తున్న ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ముప్పై, నలభై వేలమంది ప్రజల మధ్య బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి దిగడాన్ని గర్వంగానే కాదు పెద్ద బాధ్యతగా కూడా ఫీలవుతున్నాం. అంతా క్రికెట్ పుణ్యమే: నిఖిల్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఆడినపుడు సచిన్ వాడిన డ్రసింగ్ రూమే మాకూ ఇచ్చారు. ఆ సమయంలో నేనెంత గర్వపడ్డానంటే....కేవలం స్టార్ క్రికెటర్స్ మ్యాచ్‌ల పుణ్యమే ఇదంతా అనిపించింది. సల్మాన్‌ఖాన్ లాంటి స్టార్ హీరో మాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి ఆల్‌దిబెస్ట్ చెప్పిన సంఘటన వెనకున్న కారణం కూడా క్రికెట్టే. అందుకే దీన్ని మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం. రోజూ ఇక్కడ ఐదు గంటల ప్రాక్టీస్ ఉంటుంది. ఒకపక్క షూటింగ్‌లు... మరో పక్క క్రికెట్ ప్రాక్టీస్. రెండింటికీ న్యాయం చేయడంలో కొంత ఇబ్బంది పడ్డా... ఏడాదిలో ఒకే ఒక్కసారి వచ్చే అవకాశాన్ని మిస్ చేసుకోలేం కదా! మా ఫిజియో వెంకట్ కూడా మాకు బాగా సాయపడుతున్నారు. ప్రతి ప్రాక్టీస్గేమ్కి ముందు ఆయన మా బాడీ ఫిటెనెస్ పరీక్ష చేసి ఎక్కడైనా నొప్పి ఉన్నా...ఒత్తిడిగా ఫీలయినా మసాజ్‌తో సరిచేస్తారు. ఆ తర్వాత వార్మప్ అయ్యాక మా బాడీ ఆటకు రెడీ అవుతుందన్నమాట. కప్ గ్యారెంటీ: తరుణ్ సినిమాల్లోకి రాకపోతే నేను తప్పనిసరిగా క్రికెటర్‌నే అయ్యేవాడిని. అందులో సందేహం లేదు. ఆ లోటును తీర్చడానికే సిసిఎల్ వచ్చిందనిపిస్తోంది. అదే క్రికెట్ గ్రౌండ్...అదే జనం...అవే వసతులు..అవే మర్యాదలు...వీటి మధ్య బ్యాట్ పట్టుకుని ఒకరు సచిన్‌లా ఫీలైతే ఒకరు ధోనీలా ఫీలవుతూ కొట్టే షాట్లు, పట్టే క్యాచ్‌లు...నిజంగా మేం చాలా అదృష్టం చేసుకున్నాం. వీకెండ్ ఉండే మ్యాచ్ రాత్రిపూట ఉంటే ఇక్కడ రాత్రివేళలో ప్రాక్టీస్ చేస్తున్నాం. మధ్యాహ్నం ఉంటే ఇక్కడ కూడా మధ్యాహ్నమే ఆడుతున్నాం. ఆడబోయే సమయానికి అప్పుడున్న వాతావరణానికి అలవాటు పడడానికి రకరకాల పద్ధతుల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈసారి కప్పు కచ్చితంగా గెలుస్తామని చెబుతున్నాను. ఇక ఆ పొరపాటు జరగదు: సచిన్ మా తెలుగు వారియర్స్ జట్టు తప్పకుండా కప్ గెలుస్తుందని చెప్పడానికి ఇక్కడ జరుగుతున్న ప్రాక్టీస్మ్యాచ్లే నిదర్శనం. ఇలాంటి ప్రత్యేక శిక్షణ పెద్దగా లేకపోవడం వల్లనో ఏమో గత ఏడాది చాలామంది ఆటగాళ్లకు గాయాలయ్యాయి. ఈసారి అలాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిరోజూ ప్రాక్టీస్ మ్యాచ్ పెట్టుకున్నాం. చాముండేశ్వరీనాథ్గారు కూడా మాలోని లోపాల్ని గమనించి వాటిని అధిగమించేలా శిక్షణనిస్తున్నారు. కేవలం పండ్లు, ప్రొటీన్ షేక్స్: రఘు ఈ ప్రాక్టీస్ వల్ల అనుభవం రావడమే కాక ప్రతి ఒక్కరు నాలుగేసి కిలోల బరువు కూడా తగ్గిపోయారు. ఎన్ని రకాల జిమ్‌లకు వెళ్లినా రాని ఫిట్నెస్ వస్తోందిక్కడ. ఇక మానసిక ఉల్లాసమంటారా...ఇక్కడ తోటినటులతో సాన్నిహిత్యంతో పాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న నటులతో పరిచయాలు... స్నేహాలు అన్నీ మా పాలిట వరాలే. సిసిఎల్ లేకుండా భోజ్‌పురిలో పాపులర్ నటుడి గురించి మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. బెంగాలీలో ఉన్న నటులతో స్నేహం ఎలా కుదురుతుంది చెప్పండి. అలాగని వారితో కలిసి ఆడే అవకాశంగా భావించి ఊరుకుంటే సరిపోదు. ఈసారి కప్ తేకుంటే తెలుగు వారియర్స్‌ని తెలుగు ప్రేక్షకులు క్షమించరు జుట్టును. (నవ్వుతూ) ఒక పక్క కర్ణాటక, మరో పక్క బాలీవుడ్ ఎడాపెడా వాయించేస్తున్నాయి. మేం కూడా వారికి దీటుగా ఆడడానికే సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ నెలరోజులు ఆరోగ్య విషయంలో, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్లామర్ తగ్గకుండా జాగ్రత్తలు: సామ్రాట్ చిన్నప్పుడు స్కూల్లో గ్రౌండ్లో ఆడిన జ్ఞాపకాలన్నీ మా కళ్లముందు కదలాడే క్షణాలివి. ఫేవరెట్ స్పోర్ట్ ఏంటని ఎవరిని అడిగినా ప్రశ్న పూర్తవ్వకుండా చెప్పే సమాధానం క్రికెట్. ఒకపక్క తెరపై గ్లామర్‌గా కనిపించాలి. మరోపక్క ఇక్కడ ఇలా ఎండలో ప్రాక్టీస్ చేయాలి. రెండూ ముఖ్యమైనవే కాబట్టి రిస్క్ తీసుకోవడం తప్పడం లేదు. ప్రొఫెషనల్ క్రికెటర్స్కే గ్రౌండ్లోకి వెళ్లగానే ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. ఇక మా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి! అందుకే ఈ తిప్పలన్నీ. మా వెంకీసార్ చెప్పినట్టు సాధనొక్కటే అలాంటి ఆందోళన నుంచి బయటపడేస్తుంది. అందుకే అన్ని పనులూ పక్కన పెట్టి మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇక్కడ వాలిపోతున్నాం. లోపాల్ని అధిగమించడానికి నేను ఎక్కువగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. కొత్త స్నేహితులు దొరికారు: సుధీర్‌బాబు నేను ఆల్‌రౌండర్‌ని. మోహన్‌బాబుగారి అబ్బాయి విష్ణు, నేను చిన్నప్పుడు క్లాస్‌మేట్స్‌మి. మా ఇద్దరికీ స్కూల్ జ్ఞాపకాలకంటే క్రికెట్ గ్రౌండ్ జ్ఞాపకాలే ఎక్కువ. ప్రస్తుతం నా ఆటను చూసి సలహాలిస్తుంటాడు. అతనొక్కడే కాదు..చాలామంది చిన్ననాటి స్నేహితులు నన్ను గ్రౌండ్లో చూసి సంతోషపడుతున్నారు. స్టార్ క్రికెట్ వల్ల పరభాషానటులతో పరిచయాలు, అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకునే అవకాశం కలిగింది మాకు. ఎనిమిది టీమ్‌ల నటుల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటికే చాలావరకూ మా ఫేస్‌బుక్‌లోకి వచ్చేశారనుకోండి. అలాగే నిజమైన క్రికెటర్ల స్థానంలో ఉండి ఆడుతున్నాం అనే ఫీలింగ్ మమ్మల్ని మరింత సంతోషంగా ఉంచుతోంది. - భువనేశ్వరి టీంవర్క్ని నమ్మారు... గుడ్ టీం. తెలుగు వారియర్స్ ఈసారి చాలా పట్టుదలగా ఉన్నారు. ‘షూటింగ్‌లు...ముఖ్యమైన పనులు అన్నీ ప్రాక్టీస్ తర్వాతే’ అంటున్నారు. వీరి ఉత్సాహం, ప్రాక్టీస్ చేసే విధానం చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వెంకటేష్‌గారి కెప్టెన్సీలో యువహీరోలంతా చాలా ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈసారి టీంవర్క్పై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. - చాముండేశ్వరీనాథ్, ‘తెలుగు వారియర్స్’ జట్టు మెంటర్ ప్రాక్టీస్ మ్యాచ్‌లే కోచింగ్ క్యాంపులు! మన తెలుగు హీరోలు చేస్తున్న ప్రాక్టీస్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చెన్నై, కర్ణాటక టీమ్‌లు వీకెండ్‌కి ముందు ప్రత్యేకంగా కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. దానికి భిన్నంగా మన తెలుగు స్టార్స్ ప్రతి రోజు ఐదుగంటలపాటు ఇక్కడ లోకల్ ఆటగాళ్లతో పోటీ మ్యాచ్‌లు ఆడుతున్నారు. అవే వాళ్లకు పెద్ద కోచింగ్ క్యాంపులు. వాళ్ల సీరియస్‌నెస్ చూస్తుంటే వారిలో ప్రొఫెషనల్ క్రికెటర్స్ కనిపిస్తున్నారు. - విష్ణు ఇందూరి, సిసిఎల్ ఫౌండర్ -
రఘు దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ జేఏసీ కో ఆర్డినేటర్ రఘు తన 48 గంటల దీక్షను బుధవారం విరమించారు. ఆయనకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. సీమాంధ్ర విద్యుత్ సమ్మెలో అరాచక శక్తుల జోక్యాన్ని అరికట్టాలని కోరుతూ రఘు 48 గంటల దీక్షను సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీక్ష విరమణకు ముందు ఉస్మానియా ఆసుపత్రి నుండి ర్యాలీగా వచ్చిన రఘు విద్యుత్ సౌధలోని దీక్ష శిబిరం వద్ద బైఠాయించారు. ఆయనను పరామర్శించేందుకు ఎంపీ పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎనుగుల రవీందర్, సోమారం సత్యనారాయణ, బిక్షపతి, టీజేఏసీ నేతలు కోదండరామ్, శ్రీనివాస్ గౌడ్, విఠల్, అద్దంకి దయాకర్‌లు వచ్చారు. అప్పటికే అక్కడ మోహరించి ఉన్న పోలీసులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అదనపు డిసీపి నాగరాజు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ‘ఎత్తి వ్యాన్‌లో వేయండి’ అంటూ చేసిన వ్యాఖ్యలను విన్న జూపల్లి కృష్ణారావు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఆ తరువాత రఘు విద్యుత్‌సౌధ గేటు వద్దకు రావడంతో కోదండరామ్ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. -
రఘు దీక్ష భగ్నం
ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న తెలంగాణ విద్యుత్ జేఏసీ కో ఆర్డినేటర్ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ సమ్మెలో అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యాజమాన్య, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కో ఆర్డినేటర్ రఘు చేపట్టిన 48గంటల నిరాహార దీక్షను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు ఉదయం 9గంటలకే ఉద్యోగులు ఎవరూ కార్యాలయానికి రాకముందే రఘును అరెస్ట్‌చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే రఘు ఆసుపత్రిలోనూ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆసుపత్రిలోని ఏఎంసీ వార్డులో కిందకూర్చుని నిరసన వ్యక్తం చేశారు. తన దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వ కుట్ర అని ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఆరోపించారు. సీఎం కిరణ్ అసాంఘిక శక్తుల కుట్రలో భాగస్వామిగా మారుతున్నారని ధ్వజమెత్తారు. ఉస్మానియా ఆసుపత్రిలో రఘును టీజేఏసీ ఛైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరామ్ పరామర్శించారు. రఘు అరెస్ట్ వార్త తెలుసుకున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సౌధ వద్దకు చేరుకొని నిరసనలకు దిగారు. -
కుర్రకారుకి తొందరెక్కువ
రఘు, స్వాతి జంటగా తమిళంలో రూపొందిన ‘రాట్టినం’ చిత్రం ‘కుర్రకారుకి తొందరెక్కువ’ పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. సత్యదేవ పిక్చర్స్ అధినేత ఆర్. సత్యనారాయణ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం గురించి సత్యనారాయణ మాట్లాడుతూ -‘‘దర్శకుడు తంగస్వామి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. నేటి తరానికి కావల్సిన అన్ని అంశాలూ పుష్కలంగా ఉన్న సినిమా. కరెక్ట్‌గా చెప్పాలంటే అమ్మ చేతి కమ్మని వంటలా ఉంటుంది. నటీనటులు కొత్తవాళ్లయినప్పటికీ బాగా యాక్ట్ చేశారు. మనూ రమేష్ మంచి పాటలిచ్చారు. ఈ నెల 31న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. తమిళంలోలానే తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ వేడుకలో పాల్గొన్న వి. సాగర్, ప్రసన్నకుమార్ సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.