మూడు పువ్వులు ఆరు కాయలుగా నా వ్యాపారం వృద్ధి చెందాలి | Comedian Raghu Entered Into Liquor Business, Now He Is Wine Shop Owner | Sakshi
Sakshi News home page

Comedian Raghu: మందు బాటిళ్లు అమ్ముతున్న కమెడియన్‌, లాభాలు రావాలంటూ..

Published Thu, Dec 2 2021 6:12 PM | Last Updated on Thu, Dec 2 2021 6:38 PM

Comedian Raghu Entered Into Liquor Business, Now He Is Wine Shop Owner - Sakshi

Comedian Raghu Entered Into Liquor Business: కమెడియన్‌ రఘు ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై బాగా ఫేమస్‌ అయిన వ్యక్తి. సినిమాల్లో నవ్వులు పూయించే కామెడీ విలన్‌ పాత్రల్లో ఆకట్టుకున్న రఘు ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అతడికి ఆఫర్లు రావడం లేదా? సినిమాలు కాకుండా రఘు ఇప్పుడేం చేస్తున్నాడు? అతడి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం..

కమెడియన్‌ రఘుకు అడపాదడపా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. దీంతో అప్పుడప్పుడూ షూటింగులకు వెళ్తున్నాడు. కానీ మిగతా సమయంలో ఖాళీగా ఎందుకుండటం అని వ్యాపారం మీద దృష్టి పెట్టాడు. కొత్తగా లిక్కర్‌ బిజినెస్‌లో అడుగుపెట్టాడు. నాలుగు దుకాణాల కోసం టెండర్లు వేస్తే రెండు రఘుకే వచ్చాయట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాతో చెప్పుకొచ్చాడు. దుకాణంలో కౌంటర్‌ మీద కూర్చున్న రఘు తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలని కోరుతున్నాడు. రెండు మద్యం దుకాణాలకు ఓనర్‌ అంటే రఘు ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా ఉండదన్నమాటే! మొత్తానికి అటు సినిమాలతో పాటు బిజినెస్‌లోనూ రఘు దూసుకుపోతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement