![Bigg Boss Telugu 4: Raghu Master Not Participating In Bigg Boss - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/31/raghu.jpg.webp?itok=uTso9iQC)
బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఈ షో వస్తుందంటే చాలు, ఆ సమయంలో ప్రసారమయ్యే ఇష్టమైన సీరియళ్లను కూడా త్యాగం చేసేందుకు వెనుకాడరు. అలాంటి బిగ్‌బాస్ షో ఈ ఆదివారం నుంచి అందరి ఇళ్లలో తిష్ట వేయనుంది. కాగా ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ అనేకమంది పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పాల్గొననున్నాడని ప్రచారం జరగ్గా ఆయన దాన్ని కొట్టిపారేశాడు. ఆ తర్వాత రఘు మాస్టర్ పేరు వినిపించింది. (కరోనా వార్తలను కొట్టిపారేసిన నోయల్)
అంతేకాదు, రఘు మాస్టర్‌తో పాటు ఆయన భార్య ప్రణవి కూడా జంటగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లనున్నాడని ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా రఘు మాస్టర్ ఈ వార్తలను కొట్టిపారేశాడు. "బిగ్‌బాస్ 4కు రావాల్సిందిగా నాకు ఆఫర్ వచ్చినమాట వాస్తవమే. కానీ వ్యక్తిగత కారణాల వల్ల షోలో పాల్గొనడం లేదు" అని స్పష్టం చేశారు. అయితే రఘు మాస్టర్ మొదట బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆఖరు నిమిషంలో అతను నిర్ణయాన్ని మార్చుకుని బిగ్‌బాస్‌కు హ్యాండ్ ఇచ్చాడని చెప్తున్నారు. దీంతో ఇప్పుడు అతని స్థానంలో ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌లో కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ ఉంటారో? లేదో? చూడాలి! (బిగ్‌బాస్ 4 ఎంట్రీ: కొట్టిపారేసిన నటి)
Comments
Please login to add a commentAdd a comment