
నిజానికి ఈపాటికి బిగ్‌బాస్ తెలుగు నాల్గవ సీజన్ ప్రారంభమై ఎలిమినేషన్ కూడా మొదలవాలి. కానీ కరోనా వల్ల పరిస్థితులు తారుమారయ్యాయి. షో ప్రారంభం సరికదా, కనీసం పార్టిసిపెంట్ల ప్రోమోలు కూడా వదలలేదు. ఆగస్టు 30 కల్లా షో ప్రారంభిద్దాం అనుకుంటే అది కూడా సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడింది. మరోవైపు ఎంపిక చేసిన కంటెస్టెంట్లను హైదరాబాద్‌లో క్వారంటైన్‌లో ఉంచిన విషయం తెలిసిందే కదా! అయితే ఇందులో గాయకుడు నోయల్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో షో వాయిదా వేస్తారేమో? లేదా కొత్త కంటెస్టెంట్‌ను తీసుకుంటారేమో? అదీ కాకపోతే ఇప్పుడు తాజాగా చేసే పరీక్షలో నెగెటివ్ వస్తే తిరిగి నోయల్‌నే తీసుకుంటారు కావచ్చు అంటూ ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. (చదవండి: బిగ్‌బాస్: సురేఖవాణి ఎంట్రీ పై క్లారిటీ!)
ఇంతకీ నోయల్ నిజంగానే కరోనాతో బాధపడుతున్నాడా లేదా తెలుసుకునేందుకు ఓ ఆంగ్ల మీడియా అతడిని సంప్రదించింది. అయితే అవన్నీ పుకార్లేనని నోయల్ ఆ వార్తలను కొట్టిపారేశాడు. కానీ, దీని గురించి తర్వాతే మాట్లాడతానని చెప్పుకొచ్చాడు. అంటే బిగ్‌బాస్ ఎంట్రీ గురించే నోయల్ మౌనం పాటిస్తున్నాడని అభిమానులు అంటున్నారు. మరోవైపు బిగ్‌బాస్ యాజమాన్యం గత సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రత్యేక చాట్ షోను కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో షో నుంచి ఎలిమినేట్ అయ్యేవారితో రాహుల్ సంభాషించనున్నాడు. (చదవండి: బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్!)
Comments
Please login to add a commentAdd a comment