జ్యోతికను హెచ్చరించిన సూర్య! | Jyothika return back Tamil film to have climax in Delhi | Sakshi
Sakshi News home page

జ్యోతికను హెచ్చరించిన సూర్య!

Published Fri, Jan 2 2015 7:08 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

జ్యోతికను హెచ్చరించిన సూర్య!

జ్యోతికను హెచ్చరించిన సూర్య!

 దంపతులు సూర్య, జ్యోతికలకు సినిమా కొత్తేమీ కాదు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. అయితే సూర్యను వివాహం చేసుకున్న తరువాత జ్యోతిక నటనకు దూరంగా ఉన్నారు. పలు అవకాశాలు  వచ్చినా తిరస్కరించారు. అలాంటిది ఇద్దరు పిల్లల తల్లి అయిన జ్యోతిక మంచి కథా చిత్రం అయితే మళ్లీ నటించాలనే నిర్ణయానికి వచ్చారు. తన ఆలోచనను భర్త సూర్య చెవిలో వేశారు. ఆయన స్పందిస్తూ నువ్వు నటించే చిత్రాన్ని ఎవరో ఎందుకు తానే నిర్మిస్తానని ముందుకొచ్చారు. అప్పటికే మలయాళంలో ఘన విజయం సాధించిన హౌఓల్డ్‌ఆర్ యు చిత్రం ఈ దంపతులకు బాగా నచ్చేసింది.
 
 ఇంకేముంది హౌఓల్డ్‌ఆర్‌యు చిత్రాన్ని తమ 2డీ పిక్చర్స్ పతాకంపై తమిళంలో రీమేక్ చేయడం మొదలెట్టారు. ఇందులో జ్యోతిక ప్రధాన పాత్ర పోషిస్తుండగా ఆమె సరసన రఘు నటిస్తున్నారు. చిత్రం షూటింగ్ కొంత భాగాన్ని ఢిల్లీలో చిత్రీకరించారు. ప్రస్తుతం చెన్నైలో నిర్వహిస్తున్నారు. జ్యోతిక ఇంతకుముందు నటించేటప్పుడు మధ్య మధ్యలో విరామం తీసుకునేవారు. ఈ చిత్రం విషయంలో మాత్రం క్షణం కూడా తీరికలేకుండా నటిస్తున్నారట. చిత్ర నిర్మాణ బడ్జెట్ పెరిగితే వ్యాపారం చేయడం కష్టమని సూర్య హెచ్చరించడంతో సెట్‌లో ఫోన్ మాట్లాడడానికి కూడా సమయం లేనంతగా జ్యోతిక పనిలో వేగం పెంచినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement