ముంబైకి షిఫ్ట్‌ కావడంపై తొలిసారి స్పందించిన సూర్య | Surya Comments On His Family Shift To Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైకి షిఫ్ట్‌ కావడంపై తొలిసారి స్పందించిన సూర్య

Oct 29 2024 11:46 AM | Updated on Oct 29 2024 12:14 PM

Surya Comments On His Family Shift To Mumbai

కోలీవుడ్‌లో బెస్ట్‌ జోడిగా ఉన్న సూర్య-జ్యోతిక ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. గతేడాదిలో వారు చెన్నై నుంచి అక్కడికి షిఫ్ట్‌ అయ్యారు. అయితే, అంశం గురించి గతంలో పలు రకాలుగా రూమర్స్‌ వచ్చాయి. వారు కుటుంబంతో విడిపోయారంటూ వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. అయితే, ఈ జంట ముంబైలో ఫ్యామిలీ పెట్టడానికి గల కారణాన్ని కంగువ సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమంలో సూర్య చెప్పారు.

తమ కుటుంబం కోసం జ్యోతిక చాలా వదులుకొని వచ్చిందని సూర్య ఇలా చెప్పారు. 'తనకు 18 ఏళ్ల వయసులో చెన్నైకి జ్యోతిక వచ్చింది. మా వివాహం అయిన తర్వాత అందరం కలిసే చెన్నైలోనే ఉన్నాం. నా కుటుంబం కోసం ఆమె చాలా త్యాగాలు చేసింది. ఒకదశలో సినిమా ఛాన్సులు వచ్చినా ఆమె వదులుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన జ్యోతిక అక్కడ తన స్నేహితులను దూరం చేసుకుంది. అయితే, కొవిడ్‌ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ముంబైకి షిఫ్ట్‌ కావాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఆమె కెరిర్‌ మళ్లీ మొదలైంది. సరికొత్తదనం ఉన్న ప్రాజెక్ట్‌లలో జ్యోతిక పనిచేస్తుంది. తను ఎప్పుడూ కూడా కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి పనిచేయాలని ఆలోచిస్తుంది. 

బాలీవుడ్‌లో శ్రీకాంత్‌, కాదల్‌- ది కోర్‌, సైతాన్‌ వంటి విభిన్నమైన సినిమాల్లో ఆమె మెప్పించింది.  మహిళలకు కూడా అన్ని విషయాల్లో స్వాతంత్య్రం ఇవ్వాలని నేనే కోరుకుంటాను. అందరిలా వారికి కూడా స్నేహితులు ఉంటారు. ప్రస్తుతం జ్యోతిక తన కుటుంబంతో పాటు పాత స్నేహితులతో టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలో నేను కూడా రెగ్యూలర్‌గా ముంబై వెళ్తుంటాను. కుటుంబం కోసం ప్రతి నెలలో పదిరోజులకు పైగానే కేటాయిస్తాను.' అని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement