Comedian Raghu Karumanchi Daughters Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Raghu Karumanchi: కమెడియన్‌ రఘు కూతుళ్లను చూశారా?

Aug 16 2023 7:11 PM | Updated on Aug 16 2023 8:09 PM

Comedian raghu Karumanchi Daughters Photos Goes Viral - Sakshi

టాలీవుడ్‌లో చాలా మంది కమెడియన్లు ఉన్నారు. వారిలో కొద్ది మంది మాత్రమే తమదైన కామెడీ టైమింగ్‌తో జనాల్లో క్రేజీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో రఘు కారుమంచి ఒకరు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. డిఫరెంట్‌ మేనరిజంతో అందరికి దగ్గరయ్యాడు. ఆది సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రఘు.. అదుర్స్‌ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

(చదవండి:  విజయ్ దేవరకొండ డ్రస్.. అంత కాస్ట్ లీ!?)

అయితే రఘు సినీ ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి సినిమాల కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. డైరెక్టర్‌ వి.వి వినాయక్‌తో ఉన్న స్నేహబంధం కారణంగా ఎన్టీఆర్‌ చిత్రాల్లో అవకాశం లభించింది. అదుర్స్‌లో మంచి పాత్ర లభించడంతో రఘు పేరు అందరికి రిజిస్ట్రర్ అయింది. అలాగే జబర్దస్త్‌ కామెడీ షో కూడా రఘుకి మంచి గుర్తింపు తెచ్చ పెట్టింది. ఇప్పటివరకు దాదాపు 200పైగా చిత్రాల్లో నటించాడు. 

 లిక్కర్ దందా
వరుస సినిమాలు చేసినప్పటికే రఘుకి సరైన గుర్తింపు రాలేదు. ఒకనొక దశలో సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో రఘు లిక్కర్‌ దందాలోకి దిగాడు. రెండేళ్ల కింద తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వైన్‌ షాపుల వేలంలో నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ బైపాస్‌ సమీపంలో ఎండు దుకాణాలు చేజిక్కించుకున్నారు. రఘునే స్వయంగా పూజలు నిర్వహించి, మద్యం అమ్మకాన్ని ప్రారంభించారు. 

బిజినెస్‌లో భారీ నష్టం
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రఘు పలు రకాల వ్యాపారాలు చేశాడు. అతనికి స్టాక్‌ మార్కెట్‌పై మంచి పట్టు ఉంది. ఒక సమయంలో షేర్‌ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి  పెద్ద ఎత్తున నష్టపోయారు.‘షేర్‌ మార్కెట్‌లో భారీ నష్టం రావడంతో మూడు నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. టెన్షన్‌తో ఇంట్లో ఉన్నకంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ని పగులగొట్టాను’అని ఓ ఇంటర్వ్యూలో రఘు చెప్పుకొచ్చాడు.

కూతుళ్ల ఫోటోలు వైరల్‌
రఘు స్వస్థలం తెనాలి. అతను హైదరాబాదులో పుట్టి పెరిగాడు. ఇక్కడే ఎంబీఏ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేరాడు. ఆ సమయంలోనే అతని పెళ్లి జరిగింది. రఘుకు ఇద్దరు ఆడ పిల్లలున్నారు. పెద్ద కూతురు పేరు స్వప్నిక, చిన్న కూతురు పేరు తేజస్వీ. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రఘు తాజాగా తన చిన్న కూతురు ఫోటోలను షేర్‌ చేస్తూ బర్త్‌డే విషెస్‌ తెలియజేశాడు. దీంతో రఘు కూతుర్ల ఫోటోలు నెట్టంట వైరల్‌గా మారాయి. రఘు ఇద్దరు కూతుళ్లు  ఇంజనీరింగ్‌ చదువుతున్నారు.

 


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement