Raghu Karumanchi
-
కమెడియన్ రఘు కూతుళ్లను చూశారా?
టాలీవుడ్లో చాలా మంది కమెడియన్లు ఉన్నారు. వారిలో కొద్ది మంది మాత్రమే తమదైన కామెడీ టైమింగ్‌తో జనాల్లో క్రేజీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో రఘు కారుమంచి ఒకరు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. డిఫరెంట్ మేనరిజంతో అందరికి దగ్గరయ్యాడు. ఆది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రఘు.. అదుర్స్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. (చదవండి: విజయ్ దేవరకొండ డ్రస్.. అంత కాస్ట్ లీ!?) అయితే రఘు సినీ ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి సినిమాల కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. డైరెక్టర్ వి.వి వినాయక్‌తో ఉన్న స్నేహబంధం కారణంగా ఎన్టీఆర్ చిత్రాల్లో అవకాశం లభించింది. అదుర్స్‌లో మంచి పాత్ర లభించడంతో రఘు పేరు అందరికి రిజిస్ట్రర్ అయింది. అలాగే జబర్దస్త్ కామెడీ షో కూడా రఘుకి మంచి గుర్తింపు తెచ్చ పెట్టింది. ఇప్పటివరకు దాదాపు 200పైగా చిత్రాల్లో నటించాడు. లిక్కర్ దందా వరుస సినిమాలు చేసినప్పటికే రఘుకి సరైన గుర్తింపు రాలేదు. ఒకనొక దశలో సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో రఘు లిక్కర్ దందాలోకి దిగాడు. రెండేళ్ల కింద తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వైన్ షాపుల వేలంలో నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ బైపాస్ సమీపంలో ఎండు దుకాణాలు చేజిక్కించుకున్నారు. రఘునే స్వయంగా పూజలు నిర్వహించి, మద్యం అమ్మకాన్ని ప్రారంభించారు. బిజినెస్‌లో భారీ నష్టం ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రఘు పలు రకాల వ్యాపారాలు చేశాడు. అతనికి స్టాక్ మార్కెట్‌పై మంచి పట్టు ఉంది. ఒక సమయంలో షేర్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున నష్టపోయారు.‘షేర్ మార్కెట్లో భారీ నష్టం రావడంతో మూడు నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. టెన్షన్‌తో ఇంట్లో ఉన్నకంప్యూటర్, ల్యాప్‌టాప్‌ని పగులగొట్టాను’అని ఓ ఇంటర్వ్యూలో రఘు చెప్పుకొచ్చాడు. కూతుళ్ల ఫోటోలు వైరల్ రఘు స్వస్థలం తెనాలి. అతను హైదరాబాదులో పుట్టి పెరిగాడు. ఇక్కడే ఎంబీఏ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేరాడు. ఆ సమయంలోనే అతని పెళ్లి జరిగింది. రఘుకు ఇద్దరు ఆడ పిల్లలున్నారు. పెద్ద కూతురు పేరు స్వప్నిక, చిన్న కూతురు పేరు తేజస్వీ. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రఘు తాజాగా తన చిన్న కూతురు ఫోటోలను షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. దీంతో రఘు కూతుర్ల ఫోటోలు నెట్టంట వైరల్‌గా మారాయి. రఘు ఇద్దరు కూతుళ్లు ఇంజనీరింగ్ చదువుతున్నారు. View this post on Instagram A post shared by Raghu Karumanchi (@raghukarumanchi) -
లాక్డౌన్లో ఆర్థిక కష్టాలు.. అంతలోనే లగ్జరీ హోం..!: రఘు ఇల్లు చూశారా?
కమెడియన్ రఘు కారుమంచి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల నటనకు బ్రేక్ ఇచ్చిన అతను అదుర్స్, లక్ష్మి, కిక్, నాయక్, ఊసరవెల్లి వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో అలరించాడు. వెండితెరపై కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రఘు దాదాపు 150 చిత్రాల్లో నటించాడు. అయినా స్టార్ యాక్టర్ కాలేకపోయాడు. నిజానికి 20 ఏళ్ల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమాతో సీనిరంగ ప్రవేశం చేశాడతను. కానీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరకు వచ్చాడు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌లో కామెడీ స్కిట్స్ చేయడమే కాదు టీం లీడర్‌గా వ్యవహరించాడు. అనంతరం వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు సైతం గుడ్‌బై చెప్పిన రఘు సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం సాధారణ వ్యక్తిగా జీవితం సాగిస్తున్న రఘు లాక్డౌన్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే, కొద్ది కాలంలోనే ఆయన ఓ లగ్జరీ ఇంటికి ఓనర్ అయ్యాడు. చదవండి: ఆ సినిమా నేను చేసి ఉండకూడదు: లయ షాకింగ్ కామెంట్స్ ఆ మధ్య వైన్ షాప్‌లో రఘు లిక్కర్ అమ్ముతూ కనిపించిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల వల్ల లాక్డౌన్లో వ్యాపారం మొదలు పెట్టిన రఘు తన స్నేహితుడి వల్ల రెండు వైన్ షాపులకు ఓనర్ అయ్యాడు. వ్యాపారంతో మళ్లీ పుంజుకున్న రఘు తన అభిరుచికి తగినట్టుగా లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడు. స్టార్ హీరోల ఇళ్లకు ఏమాత్రం తీసిపోకుండా సొంతింటి కలను నిజం చేసుకున్నాడు. ఇంటి ఎంట్రన్స్ నుంచి కిచెన్, బెడ్రూం, బాల్కనీ ఇలా అన్ని చాలా లగ్జరీగా ఉన్నాయి. అంతేకాదు ఎక్కడ చూసినా పచ్చని మొక్కలు, పూలు, కూరగాయల చెట్లతో ఆ ఇల్లు ప్రకృతి వనాన్ని తలపిస్తోంది. ఇంటిని మొత్తం పూలు, పండ్లు, కూరగాయల మొక్కలతో నింపాడు. ఇక టెర్రస్ గార్డెన్ విషయానికి వస్తే అక్కడ లేని మొక్క అంటూ లేదు. టమోటాల నుంచి వంకాయ, బెండకాయ, పొట్లగాయ.. క్యాబేజీ, కాలిఫ్లవర్ ఇలా అన్ని రకాల కూరగాయలను ఇంట్లోనే స్వయంగా పండించుకుంటున్నాడు. చదవండి: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి.. చూస్తుంటే రఘు ఆరోగ్యకరమైన, ఆహ్లదకరమైన జీవితాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంటి లోపల అయితే అన్ని కొండపల్లి బొమ్మలు, పచ్చని మొక్కలతో నింపాడు. సినీ ఆనవాలు ఎక్కడ కనిపించాకుండా ఇంటిని డెకరేట్ చేశాడు. ఇలా రఘు సినీ జీవితానికి దూరంగా.. ప్రకృతికి దగ్గరగా ఆరోగ్యకరమైన జీవితాన్ని లీడ్ చేస్తూ ఆనందంగా ఉన్నాడు. అంతేకాదు ప్రస్తుతం తాను పూర్తిగా సినీ ఇండస్ట్రీని వదిలిపెట్టానని, ఇప్పుడు కేవలం రఘు కారుమంచి అని చెప్పకనే చెప్పాడు. కాగా రఘుకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు ఇంజనీరింగ్ చదువుతున్నట్లు చెప్పాడు. -
ప్రముఖ హాస్యనటుడు రఘు ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ హాస్యనటుడు రఘు కారుమంచి (అదుర్స్ రఘు) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్ కారుమంచి (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావ్ గురువారం తుదిశ్వాస విడిచారు. 1947 జూన్ 10న జన్మించిన వెంకట్రావ్ ఆర్మీ అధికారిగా సేవలదించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ఇంటిదగ్గరే ఉన్నారు. వెంకట్రావ్ మృతి పట్ల బంధుమిత్రులు, స్నేహితులు సంతాపం ప్రకటించారు. చదవండి: అతడు డ్రగ్స్ తీసుకోవడం కళ్లారా చూశా.. హీరో మాజీ ప్రేయసి జూనియర్ ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు, హీరోయిన్ ఏమందంటే? -
వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో!
Comedian Raghu Karumanchi Sales Liquor Video Goes Viral: తనదైన కామెడీతో ఇటూ వెండితెర, అటూ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ రఘు కారుమంచి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా. కొంతకాలంగా తెరకు దూరమైన రఘు కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన రఘు షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని పాటించడం ఎంత అవసరమో లాక్డౌన్లో చాలా మంది నటీనటులకు తెలిసోచ్చింది. ఇటూ అవకాశాలు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు క్యారెక్టర్ అర్టిస్టులు. చదవండి: బాలయ్య ఫ్యాన్స్‌కు చేదు అనుభవం, థియేటర్లో అగ్ని ప్రమాదం అయితే అలాంటి కోవలోకి రాకుండా రఘు ముందు జాగ్రత్త పడుతున్నాడు. అందుకే అది ఏ వ్యాపారం అని కూడా చూడకుండా తాజాగా లిక్కర్ బిజినెస్ స్టార్ట్ చేశాడు రఘు. సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన రఘు ‘అదుర్స్’ చిత్రంలో తనదైన కామెడీతో అందరిని మెప్పించాడు. అలా కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకొని సినిమాల్లో తన ప్రయాణం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ప్రముఖ కామెడీ షోలో రఘు పేరుతో టీం కూడా నడిపించాడు. కొద్ది రోజులకు ఆ షో నుంచి బయటకు వచ్చిన రఘు పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టాడు. చదవండి: వెడ్డింగ్ యానివర్సరి, భర్త విషయంలో ప్రియాంక కీలక నిర్ణయం.. కరోనా కారణంగా అవకాశాలు లేకపోవడంతో లాక్డౌన్లో సొంతూరికి వెళ్లిన రఘు కూరగాయలు పండించాడు. అవి మంచి ఆదాయం తీసుకురావడంతో మరో పది ఎకరాల పొలం లీజుకు తీసుకొని భారీ స్థాయిలో కూరగాయలు పండించాడట. ఈ బిజినెస్‌లో మంచి లాభాలు రావడంతో ఆ డబ్బుతో లిక్కర్ బిజినెస్ మొదలు పెట్టాడట రఘు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో రఘుతో పాటు అతని ముగ్గురు స్నేహితులు కలిసి టెండర్స్ వేశారు. అందులో రెండు టెండర్స్ రఘు పేరు మీద వచ్చాయి. చదవండి: కూకట్పల్లి మాల్లో సల్మాన్ సందడి, వీడియో వైరల్ దీంతో నల్గొండ పట్టణ శివారులో మర్రిగూడ బైపాస్ వద్ద రెండు దుకాణాలను రఘు దక్కించుకున్నాడు. ఇటీవలే ఈ షాపులను ఓపెన్ చేసి మద్యం అమ్మడం మొదలు పెట్టాడు. రఘు స్వయంగా షాప్‌లో ఉండి మద్యం అమ్ముతుండటంతో అక్కడికి వచ్చిన వాళ్ళు షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది రఘుతో సెల్ఫీ తీసుకోవడంతో పాటు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. అది చూసిన నెటిజన్లు అవకాశాలు లేకపోయిన లైఫ్‌ని బాగా సెట్ చేసుకున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. -
అందుకు ధైర్యం కావాలి
‘రేసుగుర్రం, పటాస్, రుద్రమదేవి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి సినిమాల్లో నటించిన విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అన్నది ఉపశీర్షిక. ప్రియాంక జైన్ కథానాయికగా, రఘు కారుమంచి కీలకపాత్రలో నటించారు. రఘు జయ దర్శకత్వంలో లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాని మే 11న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకుడు సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘తమిళ సినిమా ‘గోలి సోడా’కు రీమేక్ ఇది. ఈ చిత్రం ట్రైలర్ చాలా బావుంది. కొన్ని విజువల్స్ చూశా.. విక్రమ్ బాగా చేశాడు. తను 15ఏళ్లకే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో అంత పెద్ద పాత్రను తన భుజాల మీద మోయడం గొప్ప విషయం. ఇప్పుడు తనకు 17 ఏళ్లు. ఇంకా ఇంటర్ పూర్తి కాలేదు. లగడపాటి శ్రీధర్‌గారు విక్రమ్‌ని హీరోగా పెట్టి పెద్ద సినిమాతో భారీ లాంచింగ్ ప్లాన్ చేయొచ్చు. అలా కాకుండా కుమారుడు ఆర్టిస్టుగా ఎదగాలని, కళాకారుడిగా ఒక ప్రయాణం కొనసాగించాలని అనుకోవడం చాలా బాగా నచ్చింది. విక్రమ్ సహిదేవ్‌కు ఈ సినిమా పెద్ద విజయం అందించాలని కోరుకుంటున్నా. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎడిటర్‌గా పరిచయం అవుతున్నారు. కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయవచ్చు గానీ.. కొత్త సాంకేతిక నిపుణులను పరిచయం చేయడానికి ధైర్యం కావాలి. శ్రీధర్‌గారికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘టీనేజ్ ప్రేమకథతో తెరకెక్కిన న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా ఇది. మా విక్రమ్ సహిదేవ్‌కు మంచి పేరు తెస్తుందని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు లగడపాటి శ్రీధర్. -
కమెడియన్ రఘుకు తప్పిన ప్రాణాపాయం
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ కమెడియన్ కారుమంచి రఘుకు ప్రాణాపాయం తప్పింది. వర్జీనియాలో రఘు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి రఘు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో కారు ధ్వంసం అయినట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రఘు హాస్యనటుడిగా 150కి పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా పలు టీవీ షోల్లో కూడా పనిచేశారు. ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతున్న 'జబర్దస్త్'లో రోలర్ రఘుగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. 2002 లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో కమెడియన్‌గా పరిచయమైన రఘు అదుర్స్ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేశా
కమెడియన్ రఘు కొవ్వూరు : సినీ రంగంపై మక్కువతో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేశానని హాస్య నటుడు కారుమంచి రఘు చెప్పారు. శనివారం కొవ్వూరులో జరిగిన ‘టైటానిక్’ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను పలకరించగా.. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చొరవతో ఆది సినిమా ద్వారా చిత్రసీమలో అడుగుపెట్టానన్నారు. దర్శకుడు సురేంద్రరెడ్డి మంచి అవకాశాలు ఇచ్చారని, ప్రేక్షకుల ఆదరణతో హాస్య, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాని వివరించారు. ఇంకా ఏమన్నారంటే.. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సినిమా రంగంలోకి ఎందుకొచ్చానా అని ఎప్పుడైనా అనిపించిందా ఎప్పుడు ఆ భావన రాలేదు. సినిమాల్లో అవకాశాలు పెరుగుతుండటం, ప్రేక్షకుల ఆదరణ సంతృప్తినిచ్చాయి. ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు 150 తెలుగు సినిమాల్లో నటించా సంతృప్తినిచ్చిన అంశం ఏమిటి గత ఏడాది అత్యధికంగా 25 సినిమాల్లో నటించా. ఈ ఏడాది ఇప్పటికే 20 సినిమాలు చేశా. ఇతర భాషా చిత్రాల్లో నటించారా. టీవీ సీరియల్స్ సంగతేంటి తమిళం, బెంగాలీ భాషల్లో మూడేసి చిత్రాలు, కన్నడంలో రెండు, బోజ్పురిలో ఒక చిత్రంలో నటించాను. టీవీకి సంబంధించి వివిధ సీరియల్స్‌లో 1,500 ఎపిసోడ్స్‌లో నటించాను. టైటానిక్ సినిమాలో మీ పాత్ర ఏమిటి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాను. అన్ని క్యారెక్టర్ల వారితో నటించే అవకాశం లభించింది.