కమెడియన్ రఘు కారుమంచి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల నటనకు బ్రేక్ ఇచ్చిన అతను అదుర్స్, లక్ష్మి, కిక్, నాయక్, ఊసరవెల్లి వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో అలరించాడు. వెండితెరపై కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రఘు దాదాపు 150 చిత్రాల్లో నటించాడు. అయినా స్టార్ యాక్టర్ కాలేకపోయాడు. నిజానికి 20 ఏళ్ల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమాతో సీనిరంగ ప్రవేశం చేశాడతను.
కానీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరకు వచ్చాడు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌లో కామెడీ స్కిట్స్ చేయడమే కాదు టీం లీడర్‌గా వ్యవహరించాడు. అనంతరం వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు సైతం గుడ్‌బై చెప్పిన రఘు సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం సాధారణ వ్యక్తిగా జీవితం సాగిస్తున్న రఘు లాక్‌డౌన్‌లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే, కొద్ది కాలంలోనే ఆయన ఓ లగ్జరీ ఇంటికి ఓనర్ అయ్యాడు.
చదవండి: ఆ సినిమా నేను చేసి ఉండకూడదు: లయ షాకింగ్ కామెంట్స్
ఆ మధ్య వైన్ షాప్‌లో రఘు లిక్కర్ అమ్ముతూ కనిపించిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల వల్ల లాక్‌డౌన్‌లో వ్యాపారం మొదలు పెట్టిన రఘు తన స్నేహితుడి వల్ల రెండు వైన్ షాపులకు ఓనర్ అయ్యాడు. వ్యాపారంతో మళ్లీ పుంజుకున్న రఘు తన అభిరుచికి తగినట్టుగా లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడు. స్టార్ హీరోల ఇళ్లకు ఏమాత్రం తీసిపోకుండా సొంతింటి కలను నిజం చేసుకున్నాడు. ఇంటి ఎంట్రన్స్ నుంచి కిచెన్, బెడ్‌రూం, బాల్కనీ ఇలా అన్ని చాలా లగ్జరీగా ఉన్నాయి.
అంతేకాదు ఎక్కడ చూసినా పచ్చని మొక్కలు, పూలు, కూరగాయల చెట్లతో ఆ ఇల్లు ప్రకృతి వనాన్ని తలపిస్తోంది. ఇంటిని మొత్తం పూలు, పండ్లు, కూరగాయల మొక్కలతో నింపాడు. ఇక టెర్రస్ గార్డెన్ విషయానికి వస్తే అక్కడ లేని మొక్క అంటూ లేదు. టమోటాల నుంచి వంకాయ, బెండకాయ, పొట్లగాయ.. క్యాబేజీ, కాలిఫ్లవర్ ఇలా అన్ని రకాల కూరగాయలను ఇంట్లోనే స్వయంగా పండించుకుంటున్నాడు.
చదవండి: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి..
చూస్తుంటే రఘు ఆరోగ్యకరమైన, ఆహ్లదకరమైన జీవితాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంటి లోపల అయితే అన్ని కొండపల్లి బొమ్మలు, పచ్చని మొక్కలతో నింపాడు. సినీ ఆనవాలు ఎక్కడ కనిపించాకుండా ఇంటిని డెకరేట్ చేశాడు. ఇలా రఘు సినీ జీవితానికి దూరంగా.. ప్రకృతికి దగ్గరగా ఆరోగ్యకరమైన జీవితాన్ని లీడ్ చేస్తూ ఆనందంగా ఉన్నాడు. అంతేకాదు ప్రస్తుతం తాను పూర్తిగా సినీ ఇండస్ట్రీని వదిలిపెట్టానని, ఇప్పుడు కేవలం రఘు కారుమంచి అని చెప్పకనే చెప్పాడు. కాగా రఘుకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు ఇంజనీరింగ్ చదువుతున్నట్లు చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment