సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ కమెడియన్ కారుమంచి రఘుకు ప్రాణాపాయం తప్పింది. వర్జీనియాలో రఘు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి రఘు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో కారు ధ్వంసం అయినట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
రఘు హాస్యనటుడిగా 150కి పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా పలు టీవీ షోల్లో కూడా పనిచేశారు. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతున్న 'జబర్దస్త్'లో రోలర్ రఘుగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. 2002 లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో కమెడియన్‌గా పరిచయమైన రఘు అదుర్స్ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment