కుర్రకారుకి తొందరెక్కువ | 'Kurrakaruki Tondarekkuva' is an upcoming telugu movie | Sakshi
Sakshi News home page

కుర్రకారుకి తొందరెక్కువ

Published Sat, Aug 24 2013 12:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

కుర్రకారుకి తొందరెక్కువ

కుర్రకారుకి తొందరెక్కువ

రఘు, స్వాతి జంటగా తమిళంలో రూపొందిన ‘రాట్టినం’ చిత్రం ‘కుర్రకారుకి తొందరెక్కువ’ పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. సత్యదేవ పిక్చర్స్ అధినేత ఆర్. సత్యనారాయణ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
 
 ఈ చిత్రం గురించి సత్యనారాయణ మాట్లాడుతూ -‘‘దర్శకుడు తంగస్వామి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. నేటి తరానికి కావల్సిన అన్ని అంశాలూ పుష్కలంగా ఉన్న సినిమా. కరెక్ట్‌గా చెప్పాలంటే అమ్మ చేతి కమ్మని వంటలా ఉంటుంది. నటీనటులు కొత్తవాళ్లయినప్పటికీ బాగా యాక్ట్ చేశారు.
 
 మనూ రమేష్ మంచి పాటలిచ్చారు. ఈ నెల 31న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. తమిళంలోలానే తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ వేడుకలో పాల్గొన్న వి. సాగర్, ప్రసన్నకుమార్ సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement