జల్సాలకు అలవాటుపడ్డ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి స్నేహితుడితో కలిసి దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలివీ.. షాద్‌నగర్ విజయ్‌నగర్ కాలనీలో నివసించే బి.రఘు(21) చేవెళ్ల సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
జులాయి తిరుగుళ్లకు మరిగిన ఇతడు షాద్‌నగర్‌కు చెందిన స్నేహితుడు ఎల్. నరేష్(20)తో కలిసి కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -10సిలోని గాయత్రిహిల్స్‌లో ఉన్న కిరాణ స్టోర్‌కు వెళ్లి సిగరెట్ కావాలంటూ అడిగాడు. ఆ వ్యాపారిని అడిగిన సిగరెట్లు ఇస్తుండగానే అక్కడున్న రూ.10 వేల విలువ చేసే సిగరెట్ల డబ్బాను తస్కరించి బైక్‌పై ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా వేసిన పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.